ETV Bharat / bharat

పారాలింపిక్స్​లో వెటర్నరీ డాక్టర్​ హవా- స్వర్ణమే టార్గెట్ అంటున్న 'ఆమె' బిగ్ సపోర్టర్! - Paris Paralympics 2024 - PARIS PARALYMPICS 2024

Paralympics 2024 Thulasimathi Murugesan : లక్ష్యాన్ని వైకల్యం అడ్డుకోలేదని నిరూపించింది తమిళనాడుకు చెందిన తులసిమతి. పారాలింపిక్స్​లో రజతం సాధించి చరిత్ర సృష్టించింది. అయితే తులసిమతి విజయం వెనుక ఉన్న కష్టాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు ఆమె తండ్రి. అవి ఆయన మాటల్లోనే!

Paris Paralympics 2024
Paris Paralympics 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2024, 7:59 PM IST

Updated : Sep 4, 2024, 8:25 PM IST

Paralympics 2024 Thulasimathi Murugesan : లక్ష్య సాధనకు శిక్షణ, మానసిక, శారీరక సమస్యలు అడ్డంకులు కావని నిరూపించింది తమిళనాడుకు చెందిన తులసిమతి మురుగేశన్. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించి సత్తా చాటింది. ఇక్కడితో తన ప్రయాణం ఆపనంటోంది. పారాలింపిక్స్​లో గోల్డ్ మెడల్ సాధించడమే తన తదుపరి లక్ష్యమంటున్న తులసిమతి తండ్రి మురుగేశన్ ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె పడిన కష్టాలను, ఇబ్బందులను షేర్ చేసుకున్నారు.

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో తులసిమతి జన్మించింది. పుట్టుకతో ఎడమ చేతికి వైకల్యం ఉంది. అయితే ఆ లోపాన్ని చూస్తూ కూర్చోకుండా లక్ష్యం నిర్దేశించుకొని ముందుకు సాగింది. అందుకు అమె తండ్రి మద్ధతు కూడా లభించింది. ఇప్పటికే ఆసియా క్రీడల్లో చైనా గడ్డపై బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించిన ఆమె, తాజాగా పారాలింపిక్స్‌లో విభాగంలో రజత పతకం సాధించింది. ఈసారి గురి తప్పినా తన కుమార్తె వచ్చే పారాలింపిక్స్​లో తప్పకుండా స్వర్ణం సాధిస్తుందని మురుగేశన్ ధీమా వ్యక్తం చేశారు. తులసిమతి క్రీడల్లో రాణిస్తూనే వెటర్నరీ మెడిసిన్ చదువుతుందని ఆయన తెలిపారు.

''తులసిమతి బ్యాడ్మింటన్​లో కష్టపడి ప్రాక్టీస్ చేసి పారాలింపిక్స్‌ వరకు వెళ్లింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించింది. తులసిమతి ప్రస్తుతం వెటర్నరీ మెడిసిన్ చదువుతుంది. పారాలింపిక్స్‌ కోసం శిక్షణ ఇచ్చేందుకు 45 రోజుల సమయం కావాల్సి వచ్చింది. ఈ విషయం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఆయన మాకు సహాయం చేశారు. తమిళనాడు రాష్ట్ర క్రీడా అభివృద్ధి సంస్థతో పాటు ఉదయనిధి సహాయం మరువలేనిది'' అని మురగేశన్ తెలిపారు.

Thulasimathi Murugesan father
ఈటీవీ భారత్​తో తులసిమతి తండ్రి మురుగేశన్​ (ETV Bharat)

తులసిమతి చిన్నప్పటి నుంచి తండ్రి ప్రోత్సాహంతో ఆటల్లో రాణించింది. ఆయన కూడా క్రీడాభిమాని కావడం వల్ల కుమార్తెను ప్రోత్సహించారు. అలా తులసి కోచ్‌ ఇర్ఫాన్‌ కంటపడింది. అదే ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. వైకల్యం ఉన్నవారు ఆటపై ఇష్టాన్ని చంపుకోనక్కర్లేదనీ, వారికోసమూ క్రీడాపోటీలుంటాయని అప్పుడే తెలుసుకుంది. ఆపై తులసిని హైదరాబాద్‌లోని గోపీచంద్‌ అకాడమీలో చేర్చారు. అక్కడే ఒలింపిక్స్‌లో పతకం అందుకోవాలన్న లక్ష్యం పెట్టుకుంది. ఈ క్రమంలో కండరాలు బాధించినా, గాయాలు ఇబ్బంది పెట్టినా ఎక్కడా తగ్గలేదు. అనుకున్న లక్ష్యం కోసం తీవ్రంగా శ్రమించింది. ఇప్పుడు పారాలింపిక్స్‌లో సత్తా చాటి దేశం గర్వించేలా చేసింది.

దీప్తి జీవాంజీకి పారాలింపిక్స్​లో కాంస్యం - స్వగ్రామంలో సంబురాలు - Deepthi Jeevanji Paris Paralympics

పారాలింపిక్స్​లో భారత్ జోరు- ఒక్కరోజే గోల్డ్ సహా 7 పతకాలు- మొత్తం ఎన్నంటే? - Paris Paralympics India 2024

Last Updated : Sep 4, 2024, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.