Uttar Pradesh Road Accident : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై టెంపో, పికప్ వ్యాన్ ఢీకొనడం వల్ల ఈ విషాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని ముజారియా పోలీస్ స్టేషన్ సమీపంలో దిల్లీ- బదాయూ హైవేపై ప్రమాదం జరిగింది. టెంపో, పికప్ వ్యాన్ గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పరసర్పం ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. వాటిని విన్న స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసులకు సమచారం అందించారు. ఘటానాస్థలికి చేరుకుని గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు పోలీసులు. మృతదేహాలను శవపరీక్షల కోసం తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు.