ETV Bharat / bharat

అయోధ్య రామయ్య దర్శనానికి యోగి టీమ్- ​దేవుడు, భక్తుల మధ్య దూరం లేదన్న ఎస్​పీ! - up mlas visit ram temple

UP MLAs Ayodhya Visit : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ తన మంత్రులు, ఎమ్మెల్యేలతో అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. 10 ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ప్రజాప్రతినిధులకు భక్తులు ఘనస్వాగతం పలికారు. మరోవైపు, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ఫ్యామిలీతో అయోధ్యకు వెళ్లనున్నారు.

UP MLAs Ayodhya Visit
UP MLAs Ayodhya Visit
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 5:24 PM IST

UP MLAs Ayodhya Visit : అయోధ్య బాలక్‌ రామ్‌ను ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి దర్శించుకున్నారు. 10 ప్రత్యేక బస్సుల్లో బీజేపీ ఎమ్మెల్యేలు సీఎంతో కలిసి అయోధ్యకు ఆదివారం చేరుకున్నారు. మార్గమధ్యలో భజనలు, కీర్తనలతో ఉత్సాహంగా గడిపారు. అయోధ్యకు చేరుకోగానే జై శ్రీరామ్ నినాదాలతో భారీ సంఖ్యలో భక్తులు వారికి స్వాగతం పలికారు. బస్సుల దగ్గరకు చేరుకుని జేసీబీలతో బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రయాణించిన బస్సులపై స్థానికులు పూల వర్షం కురిపించారు.

అయోధ్య ఆలయంలో యోగి టీమ్

"రామ్ లల్లాకు ప్రార్థనలు చేయడానికి మాకు ఈ సువర్ణావకాశం లభించింది. రాముడు అందరినీ ఆశీర్వదిస్తాడని ఆశిస్తున్నాను" అని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు. "చాలామంది భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలిచిన ప్రదేశానికి రామ్ లల్లా ఎట్టకేలకు చేరుకోవడం ఆశీర్వాదకరం. చివరకు ఇక్కడికి రావడం మనందరి ఆశీర్వాదంగా భావిస్తున్నాం" అని మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. తమతో కలిసి రావాలని సమాజ్‌వాద్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించగా, వారు తిరస్కరించినట్లు బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు.

'దేవుడు, భక్తుల మధ్య రాజకీయాలు తీసుకురావొద్దు'
అయితే అయోధ్య ఆలయాన్ని సందర్శించకపోవడంపై సమాజ్​వాద్​ పార్టీ- ఎస్పీ చీఫ్ విప్ మనోజ్ పాండే స్పందించారు. "భగవంతుడికి భక్తుడి మధ్య దూరం లేదు. ఆయన (రామ్ లల్లా) మమ్మల్ని పిలిచినప్పుడు మేం మా కుటుంబంతోపాటు నియోజకవర్గ ప్రజలతో కలిసి అయోధ్యను సందర్శిస్తాం. దేవుడు, భక్తుల మధ్య రాజకీయాలు తీసుకురావద్దని బీజేపీని అభ్యర్థిస్తున్నాను" అని తెలిపారు.

"జనవరి 22న జరిగిన ప్రాణప్రతిష్ఠ రోజు ఎమ్మెల్యేలందరినీ అయోధ్యకు తీసుకెళ్లాలని మేం శాసనసభ స్పీకర్‌కు లేఖ రాశాం. అందుకు ఆయన విఫలమయ్యారు. అందుకు నేను గౌరీగంజ్ నియోజకవర్గ ప్రజలతోపాటు నా కుటుంబంతో కలిసి అయోధ్యకు వెళతాను" అని ఎస్పీ నాయకుడు రాకేశ్ ప్రతాప్ సింగ్ చెప్పారు.

అయోధ్యకు కేజ్రీవాల్​ ఫ్యామిలీ
మరోవైపు, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం అయోధ్యకు వెళ్లనున్నారు. కేజ్రీవాల్‌ కుటుంబసమేతంగా అయోధ్యకు వెళ్లి బాలక్‌ రామ్‌ను దర్శించుకోనున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ వెల్లడించింది. ఆయనతో పాటు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కుటుంబం కూడా వెళ్లనున్నట్లు తెలిపింది. జనవరి 22న రాముడి ప్రాణప్రతిష్ఠకు కేజ్రీవాల్ ఆహ్వానం అందగా, ఆయన తర్వాత దర్శించుకుంటానని చెప్పారు. ఇప్పుడు కేజ్రీవాల్‌ కుటుంబ సమేతంగా వెళ్లడం విశేషం.

అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్తున్నారా? ఈ ఐదు విషయాలు తెలుసుకోవడం మస్ట్!

అయోధ్యలో IRCTC కొత్త ప్రాజెక్ట్- అన్ని రాష్ట్రాల ఫుడ్ ఐటమ్స్​తోపాటు డార్మిటరీ రెడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.