ETV Bharat / bharat

జులై 22న కేంద్ర బడ్జెట్‌ - జులై 3న ఆర్థిక సర్వే! - Union Budget 2024 - UNION BUDGET 2024

Union Budget 2024 : ఈ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం జులై 22న ప్రవేశపెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతకంటే ముందు జులై 3నే ఆర్థిక సర్వేను వెల్లడించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Economic Survey
Union Budget 2024 (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 1:00 PM IST

Union Budget 2024 : మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అయితే వర్షాకాల సమావేశాలకు కూడా షెడ్యూల్‌ ఖరారైనట్లు సమాచారం. జులై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఈ సెషన్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో మొదటి రోజే పూర్తిస్థాయి బడ్జెట్‌ (Union Budget 2024)ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

వర్షాకాల సమావేశాలు
కొత్తగా ఏర్పడిన 18వ లోక్‌సభ సమావేశాలు జూన్‌ 24 నుంచి జులై 3వ తేదీ వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. తొలివిడత సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎన్నిక జరుగుతాయి. కనుక ఈ సమయాన్ని మినహాయిస్తే, ఇంకా కేవలం 5 పనిదినాలే ఉంటాయి. ఈ స్వల్పకాలంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టి, దానిపై చర్చించడం సాధ్యం కాదని భావించిన కేంద్ర ప్రభుత్వం, వర్షాకాల సమావేశాల్లోనే బడ్జెట్​ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

టీం ఇండియా
జూన్‌ 24న జరగనున్న తొలివిడత సమావేశాల్లో లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారని కిరణ్‌ రిజిజు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారి కలుస్తున్న
నేపథ్యంలో అందరం కలిసి టీం ఇండియాగా పనిచేయాలని ఆయన అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

తొలి రోజునే బడ్జెట్​
కేంద్ర ప్రభుత్వం జులై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. అంతకంటే ముందు ప్రత్యేక సమావేశాల చివరి రోజైన జులై 3న ఆర్థిక సర్వేను పార్లమెంట్‌ ముందు ఉంచనున్నట్లు పేర్కొన్నాయి. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మోదీ 3.0 ఫస్ట్ బడ్జెట్​
ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ 2024 ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్​ ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను తీసుకురానున్నారు. మోదీ 3.0లో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌ ఇదే కానుండడం గమనార్హం. దీంతో వరసగా ఏడుసార్లు బడ్జెట్‌ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్‌ పొందనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్‌ వరసగా 6 సార్లు బడ్జెట్‌ సమర్పించారు.

మీ దగ్గర చాలా క్రెడిట్ కార్డులు ఉన్నాయా? నష్టపోయే ప్రమాదం ఉంది - జర జాగ్రత్త! - Credit Card Usage Tips

LIC సరికొత్త స్కీమ్​ - రోజుకు రూ.200 పొదుపు చేస్తే చాలు - ఒకేసారి చేతికి రూ.1.22 కోట్లు! - LIC New Jeevan Anand

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.