ETV Bharat / bharat

ఇంట్రస్టింగ్ : పాములకు రెక్కలు ఉంటాయా? - ఈ స్నేక్ గాలిలో ఎగురుతుంది మరి! - Secrets Of Behind Flying Snakes

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 5:18 PM IST

Secrets Of Behind Flying Snakes : గాల్లో ఒకజీవి ఎగురుతోందంటే.. దానికి కచ్చితంగా రెక్కలు ఉంటాయని మనం భావిస్తాం. రెక్కలుంటేనే ఎగరగలదని అనుకుంటాం. కానీ.. రెక్కలు లేని పాము గాల్లో ఎగురుతుందని మీకు తెలుసా? తెలియకపోతే ఈ స్టోరీ చదవాల్సిందే.

TRUTH OF TAKSHAK SNAKE
Secrets Of Behind Flying Snakes (ETV Bharat)

Interesting Facts About Flying Snakes : పాములు అంటే.. జర..జర.. నేలపై పాకుతాయని అందరికీ తెలుసు. మరి.. అవే పాములు గాల్లో ఎగిరితే ఎలా ఉంటుంది? మన ఇళ్ల మీదకు వచ్చి పడితే ఎలా ఉంటుంది? ఊహిస్తేనే.. భయమేస్తోంది కదా! కానీ.. రయ్యిమంటూ గాల్లో ఎగిరే పాములు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అవును.. మీరు వింటున్నది నిజమే! ఇటీవల బీహార్​లో ఇలాంటి పాము కనిపించింది. ఇంతకీ.. ఆ పాము(Snake) పేరేంటి? అది నిజంగా గాల్లో ఎగురుతుందా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇటీవల బీహార్​లో గాల్లో ఎగిరే పాము కనిపించింది. దాని పేరు.. తక్షక్ స్నేక్. ఇది ఎక్కువ సౌత్​ఈస్ట్ ఆసియా అడవుల్లో కనిపిస్తుంది. తక్షక్ పామునే.. ఆర్నెట్స్ ఫ్లయింగ్ స్నేక్, టక్కా నాగ్, గ్లైడింగ్ స్నేక్, క్రైసోపెలియా అనే వివిధ పేర్లతో పిలుస్తారు. అయితే.. ఈ పాము మరీ పక్షిలా ఎగురుతూ విహరించదుగానీ.. గాలిలో తేలుతుంది. ఇది తన శరీరాన్ని ఎగరడానికి వీలుగా చదునుగా మార్చుకొని చటుక్కున గాల్లో ఎగురుతుందంటున్నారు నిపుణులు.

దీని పొట్టకున్న ప్రత్యేకత వల్ల చెట్లపైకి చకచకా ఎక్కేస్తుందని చెబుతున్నారు నేచర్ ఎన్విరాన్​మెంట్ అండ్ వైల్డ్​లైఫ్ సొసైటీ(NEWS) ప్రాజెక్ట్ మేనేజర్ అభిషేక్. అంతేకాదు.. ఒక కొమ్మ చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుమీదకు గాల్లో ఎగురుతూ దూకేస్తుందంటున్నారు. ఆహార వేట కోసం, ఇంకా భూమ్మీదుండే శత్రుజీవుల నుంచి తప్పించుకోవడానికే ఇలా ఇది ఎగురుతుందని చెబుతున్నారు.

తక్షక్ పాము శరీరంపై గంధపు మరక ఉంటుంది. దీని పొడవు 3 నుంచి 4 అడుగులు ఉంటుంది. ఇది సాధారణంగా పొడవైన చెట్లపై నివసిస్తుంది. ఈ పాము కాస్త సన్నగా ఉంటుంది. ఇది తన శరీరాన్ని S ఆకారంలోకి మార్చుకొని స్ప్రింగ్ లాగా దూకగలదని నిపుణులు చెబుతున్నారు. ఈ పాము ఒకేసారి దాదాపు 100 మీటర్ల దూరం గాల్లో ఎగురుతూ వెళ్లగలదని అంటున్నారు.

పాములు కాటేసే ముందు ఏం చేస్తాయో తెలుసా? - అప్పుడు మనుషులు ఏం చేయాలి?

'జర్నల్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ బయాలజీ' ప్రకారం.. పాము ఎగిరే జీవి కాదు. ఎగరదు. అయితే.. ఈ పాము ఊగినప్పుడు దాని శరీరంలో మార్పు జరుగుతుందట. అంటే.. పాము ఏరోడైనమిక్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది విమానం రెక్కల లాంటిది. అటువంటి పరిస్థితిలో.. శారీరక మార్పుల కారణంగా అది ఎగరడంలో విజయవంతమవుతుందంటున్నారు నిపుణులు.

ఇక.. తక్షక్ పాము వెనుక అనేక పౌరాణిక కథలు కూడా ఉన్నాయి. ఇది మహాభారత కాలానికి సంబంధించిన పాముగా కూడా చెప్పుకుంటారు. పురాణాల ప్రకారం.. పాతాళంలో ఎనిమిది పాములు ఉండేవట. వాటిలో తక్షక్ అనే పాము కూడా ఒకటి. ఇదే పాము పరీక్షిత్ రాజును కరిచిందని.. అందుకే అతను చనిపోయాడని చెప్పుకుంటారు. ఈ కారణం చేతనే తక్షక్​ని పాములకు రాజు అని నమ్ముతారట.

'బస్సు అంత పొడవున్న పాము'- ప్రపంచంలోనే అతిపెద్ద స్నేక్ అవశేషాలను కనుగొన్న సైంటిస్ట్​లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.