ETV Bharat / bharat

'రామోజీరావు రియల్ హీరో- మనందరికీ ఆయన అన్నదాతే'- రాజస్థాన్, కర్ణాటకలో అక్షర యోధుడికి పాత్రికేయుల నివాళి - Tribute To Ramoji Rao - TRIBUTE TO RAMOJI RAO

Tribute To Ramoji Rao in Jaipur : మీడియా దిగ్గజం, రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు రాజస్థాన్​లోని జయపుర, కర్ణాటకలోని బెంగళూరు ప్రెస్ క్లబ్​లో నివాళులర్పించారు మీడియా ప్రతినిధులు. ఆయన మీడియా రంగంలో చేసిన సేవలను కొనియాడారు. రామోజీరావుతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు ఈటీవీ జర్నలిస్టులు.

Tribute To Ramoji Rao
Tribute To Ramoji Rao (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 9:52 AM IST

Updated : Jun 20, 2024, 10:58 AM IST

Tribute To Ramoji Rao in Jaipur : రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు రాజస్థాన్ రాజధాని జయపురలోని పింక్ సిటీ ప్రెస్ క్లబ్​లో మీడియా ప్రతినిధులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఈటీవీకి చెందిన జర్నలిస్టులు, పలు మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు, ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ పాల్గొని రామోజీరావుకు నివాళులర్పించారు. మరోవైపు రామోజీరావుకు ఈటీవీ కన్నడలో పనిచేసిన జర్నలిస్టులు సంతాపం తెలిపారు. బెంగళూరు ప్రెస్‌ క్లబ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మీడియా మెఘల్ రామోజీరావుతో గడిపిన క్షణాలను జర్నలిస్టులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వక్తలు రామోజీరావు సాధించిన విజయాలు, వృత్తి నైపుణ్యం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు.

'రామోజీరావు రియల్ హీరో'
జర్నలిజం విశ్వసనీయతను ఈనాడు, ఈటీవీ బలోపేతం చేశాయని జయపురలోని పింక్ సిటీ ప్రెస్ క్లబ్​లో వక్తలు వ్యాఖ్యానించారు. రామోజీ తన జీవితకాలంలో జర్నలిజంలో విలువలు కాపాడారన్నారు. ఈటీవీ ఎందరో జర్నలిస్టులను తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. టీవీ మీడియా నుంచి ఫిల్మ్ మేకింగ్ వరకు అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి రామోజీరావు అని సీనియర్ పాత్రికేయులు అమిత్ భట్ తెలిపారు. ఈటీవీలో పనిచేసిన వ్యక్తులు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ మీడియా సంస్థల్లో కనిపిస్తారని పాత్రికేయులు సుధీర్ శర్మ వెల్లడించారు. మీడియాకు సాధికారత కల్పించడంలో రామోజీ నిర్ణయాలు కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. రామోజీరావు రియల్ హీరో అని సీనియర్ జర్నలిస్టు శశిమోహన్ శర్మ తెలిపారు. ఉపాధితో పాటు యువ జర్నలిస్టులకు ఆయన దిశానిర్దేశం చేశారని కొనియాడారు.

'ఆయన అన్ని రంగాల్లో విజయం సాధించారు'
'మనందరికీ రామోజీరావు సర్ నిజంగా అన్నదాతే' అని అన్నారు సీనియర్ జర్నలిస్టు రామకృష్ణ ఉపాధ్యాయ. ప్రైవేట్ మీడియాలో రైతుల కోసం అన్నదాత లాంటి కార్యక్రమం చేసిన మొదటి వ్యక్తి రామోజీరావు అని బెంగళూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో కొనియాడారు. పచ్చళ్ల వ్యాపారం నుంచి మీడియా రంగం వరకు ఎన్నో రంగాల్లో రామోజీ విజయం సాధించారని గుర్తు చేసుకున్నారు. దశాబ్ద కాలంపాటు రామోజీరావుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని సీనియర్ జర్నలిస్ట్ నరేంద్ర పుప్పాల తెలిపారు. ఒత్తిడిలో కూడా రామోజీ రావు వార్తలను, మీడియాను వక్రీకరించలేదని కొనియాడారు. మీడియా మెఘల్ రామోజీరావు సామాజిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చారని సీనియర్ పాత్రికేయులు శివ శంకర్ అన్నారు. అందుకే ఈటీవీ వార్తలను నమ్మదగినవి, విశ్వసనీయమైనవిగా ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు.

'అక్కడే జీవిత పాఠాలు నేర్చుకున్నా'
రామోజీ రావు మీడియా నిజాయతీ గురించి ఆందోళన చెందేవారని ఈటీవీ భారత్ బెంగళూరు బ్యూరో చీఫ్ సోమశేఖర్ కవచూర్ వెల్లడించారు. రామోజీరావుకు చెందిన మీడియా సంస్థ నాణ్యమైన జర్నలిజం విలువలతో కూడుకున్నదని తెలిపారు. తన ప్రయత్నాలన్నింటిలోనూ రామోజీ విజయం సాధించారని కొనియాడారు. రామోజీ ఫిలిం సిటీలో తాను జీవిత పాఠాలు నేర్చుకున్నానని సీనియర్ జర్నలిస్టు రాధికా రాణి తెలిపారు. రామోజీరావు ప్రోత్సాహం మరువలేనిదని కొనియాడారు. కొత్త ఆవిష్కరణలకు, ప్రయోగాలకు రామోజీరావు మంచి ఊదాహరణ అని పాత్రికేయురాలు సమీవుల్లా అభిప్రాయపడ్డారు.

'మృతదేహాన్ని మాయం చేసేందుకు రూ.30 లక్షలు ఇచ్చా'- నేరం అంగీకరించిన దర్శన్! - Darshan Renuka Swamy

కల్తీ మద్యం తాగి 33మంది మృతి- ICUలో 20మంది- రంగంలోకి సీఎం - Hooch Tragedy Tamil Nadu

Last Updated : Jun 20, 2024, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.