ETV Bharat / bharat

'అమ్మ'గా బిర్యానీ వండి పెడుతున్నారు- క్యాటరింగ్ బిజినెస్​లో ట్రాన్స్​జెండర్ టీమ్ సెక్సెస్​ స్టోరీ - Transgender Catering Business

Transgender Catering Business In Tamilnadu : సమాజంలో ట్రాన్స్ జెండర్లపై ఉండే చిన్నచూపు అంతా ఇంతా కాదు! అయితే వారు కూడా తామేం తక్కువ కాదని నిరూపించుకున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన ఓ ట్రాన్స్ జెండర్, క్యాటరింగ్ బిజినెస్​లో దూసుకెళ్తోంది. అంతేకాకుండా తనలాంటి వాళ్లని చేరదీసి, వంటల్లో మెలకువలు నేర్పుతూ ఆత్మస్థైర్యంతో ముందుకుసాగేలా చేస్తోంది. ఇలా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న తమిళనాడుకు చెందిన ట్రాన్స్​జెండర్​పై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Transgender Catering Business In Tamilnadu
Transgender Catering Business In Tamilnadu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2024, 1:33 PM IST

Transgender Catering Business In Tamilnadu : ట్రాన్స్‌జెండర్లంటే సమాజంలో ఒక రకమైన చిన్నచూపు. ఛీత్కారాలు! చాలా మంది కుటంబ సభ్యుల ఆదరణకూ నోచుకోరు! అయితే ఇలాంటి అవమానాలు, అవాంతరాలు అన్నింటినీ దాటుకుని తన కాళ్ల మీద తాను నిలబడమే కాకుండా, తనలాంటి వాళ్లను ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేలా చేస్తోంది ఓ ట్రాన్స్​జెండర్. ఆమే క్యాటరింగ్ బిజినెస్​లో దూసుకెళ్తున్న 'సెల్వీ అమ్మ'. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన సెల్వీ, ఆమెతో నడిచిన 40మంది ట్రాన్స్​జెండర్ల టీమ్​ వారి అనుభవాలను "ఈటీవీ భారత్​"తో షేర్​ చేసుకున్నారు.

'అమ్మ'గా వండి పెడుతోంది
కోయంబత్తూరుకు చెందిన సెల్వీ(50) అనే ట్రాన్స్​జెండర్​ క్యాటరింగ్ బిజినెస్​లో దూసుకుపోతోంది. అందరితో 'సెల్వీ అమ్మ' అనిపించుకునే స్థాయికి ఎదిగింది. అయితే ఈ విజయం సెల్వీకి అంత సులువుగా దక్కలేదు. తాను కూడా అందరు ట్రాన్స్​జెండర్ల లాగానే అనేక సవాళ్లను ఎదుర్కొంది. సమాజంలో తమలాంటి వారిపై ఉన్న చిన్నచూపు, ఛీత్కారాలను దాటి, తాను కూడా ఏదైనా సాధించాలనే పట్టుదలతో కష్టపడింది. ఈ క్రమంలో వంటల్లో, ముఖ్యంగా బిర్యానీ చేయడంలో మెలకువలు నేర్చుకుని ఆరితేరింది. అందులో ముఖ్యంగా సెల్వీ అమ్మ చేసే, 'రవ్​తర్'​ బిర్యానీ చాలా ఫేమస్​. ఫలితంగా, పొరుగు రాష్ట్రం కేరళ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. చాలా మంది తమ ఇంటి కార్యక్రమాల కోసం సెల్వీ అమ్మ చేత వంట చేయించుకోవడానికి నెలల తరబడి నిరీక్షిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

Transgender Catering Business In Tamilnadu
బిర్యానీ వండుతున్న సెల్వీ అమ్మ టీమ్​ (ETV Bharat)

తనలాంటి వారిని చేరదీసి
స్వతహాగా ట్రాన్స్​జెండర్ల కష్టాలను అనుభవించింది సెల్వీ. అయితే తనలాంటి వారికి సహాయపడాలనే ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఆమె చేసిన పని చాలా మంది ట్రాన్స్​జెండర్లకు ఓ దిక్సూచి అయింది. నిరుద్యోగ ట్రాన్స్​జెండర్లను చేరదీసి, కనీసం టీ పెట్టడం రాని వారికి కూడా వంటల్లో మెలకువలు నేర్పింది. అలా ఒక్కొక్కరుగా సెల్వీ అమ్మ టీమ్​లో భాగస్వాములయ్యారు. ఇప్పుడు సెల్వీ క్యాటరింగ్ టీమ్​లో​ 40మంది ఉన్నారు.

'ఆత్మవిశ్వాసం నింపింది'
సెల్వీ అమ్మ టీమ్​లోని కనిక అనే ట్రాన్స్​జెండర్​ తన అనుభవాలను "ఈటీవీ భారత్​"తో షేర్​ చేసుకుంది." సెల్వీ అమ్మ/సరో అమ్మ దగ్గర వంట నేర్చుకున్న తర్వాత మేము చాలా చోట్ల వంటలు చేస్తున్నాము. కోయంబత్తూరులోనే కాకుండా కేరళలోనూ బిర్యానీ చేస్తున్నాము. నాలాంటి వారికి వంట నేర్పించి మాలో ఆత్మవిశ్వాసం నింపింది సెల్వీ అమ్మ. నేను దాదాపు 15ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాను. మేము చేసే 'రవ్​తర్' బిర్యానీ కోయంబత్తూరులో చాలా ఫేమస్. అయితే మాకు ఇక్కడి కంటే కేరళలోనే ఎక్కువ కస్టమర్లు ఉన్నారు. గత వారం మా టీమ్​, ఓ పండుగ సందర్భంగా వేయి మందికి బిర్యానీ చేసింది. ఒకప్పుడు మాకు టీ ఎలా చేయాలో కూడా తెలియదు. కానీ ఇప్పుడు మేము వేల మందికి కూడా వండి పెట్టగలం" అని కనిక తెలిపింది.

Transgender Catering Business In Tamilnadu
Transgender Catering Business In Tamilnadu (ETV Bharat)

నిరుద్యోగికి చేయూత
తాను నిరుద్యోగిగా ఉన్నప్పుడు సెల్వీ అమ్మ మంచి గైడెన్స్​ ఇచ్చారని వినిత అనే మరో ట్రాన్స్​జెండర్​ తెలిపింది. తాను సెల్వీ అమ్మ టీమ్​లో గత రెండేళ్లుగా వంటమనిషిగా పనిచేస్తున్నట్లు చెప్పింది. తాను బిర్యానీ మాస్టర్​గా అయిన తర్వాత, అందరూ మెచ్చే బిర్యానీ చేయబోతున్నానని సంతోషం వ్యక్తం చేసింది.

సెల్వీ అమ్మ టీమ్​ ప్రిపేర్ చేసిన బిర్యానీ (ETV Bharat)

చీదరించిన చోటే ఆదరణ - ట్రాన్స్‌జెండర్ల జీవితాలపై యూట్యూబ్‌ ఛానల్‌ - TRANSGENDER SNEHA YOUTUBE CHANNEL

పేద జంటలకు పెళ్లిళ్లు చేయించిన ట్రాన్స్​జెండర్​- భిక్షాటన ద్వారా వచ్చిన సొమ్ముతో సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.