Train Full Form In English : సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు రైల్వేను ఉత్తమ రవాణా మార్గంగా పరిగణిస్తారు. ఎందుకంటే బస్సు, విమానాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో రైలులో ప్రయాణించవచ్చు. అయితే రైలును తెలుగులో ధూమశకటం అంటారని మనలో చాలా మందికి తెలుసు. మరి ఇంగ్లీష్‌లో TRAIN ఫుల్ ఫామ్ ఏంటో మీకు తెలుసా?
సాధారణంగా మనం భాషతో సంబంధం లేకుండా ట్రైన్ అని అంటుంటాం. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అలా ఎక్కువ భాషల్లో ట్రైన్ అనే పిలుస్తుంటాం. అయితే Train ఫుల్ ఫామ్ Tourist Railway Association Incorporated. ట్రైన్ అనే పదం ఇంగ్లీష్ నుంచి రాలేదని, ఫ్రెంచ్ పదం Trahiner నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. లాటిన్ భాషలో ట్రైన్ అంటే to pull అని అర్థం. వీటితో పాటు రైల్వేకు సంబంధించిన మరికొన్ని అబ్రివేషన్స్ మీకోసం.
- IRCTC- Indian Railway Catering and Tourism Corporation.
- IRFC- Indian Railway Finance Cooperation
- IRCON- Indian Railway Construction Limited
- RVNL- Rail Vikas Nigam Limited
అయితే రైల్వే టికెట్లపై చాలా వరకు షార్ట్ కట్ లో పదాలను ముద్రిస్తుంటారు రైల్వే సిబ్బంది. WL, RSWL, PQWL, GNWL పదాలు ఉంటాయి. WL అని ఉంటే ఇంకా మీకు సీటు ధ్రువీకరించలేదని, వెయిటింగ్ లిస్ట్‌లో మీ పేరు ఉందని అర్థం. అలా మిగతా వాటికి కూడా వివిధ అర్థాలు ఉంటాయి.
ఇటీవలే, ప్రయాణికులు రైలు టికెట్‌లను సులభంగా, దుర్వినియోగానికి గురి కాకుండా బుక్ చేసుకోవడానికి వీలుగా ఐఆర్‌సీటీసీ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసే ప్రయాణికులు ముందుగా వారి ఫోన్ నంబర్, ఈ-మెయిల్‌ను ధ్రువీకరించాల్సి ఉంటుంది.
వెరిఫికేషన్ ఇలా
- మొదటగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో వెరిఫికేషన్ విండోకు లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని నమోదు చేయాలి.
- హోమ్ పేజీలో అవసరమైన సమాచారాన్ని అందించిన తర్వాత వెరిఫై బటన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి మీ మొబైల్ నంబర్‌ని ధ్రువీకరించాలి.
- ఇక ఈ-మెయిల్ వెరిఫికేషన్ పూర్తి చేయడానికి ముందుగా మీ ఈ-మెయిల్ ఐడీకి వచ్చిన కోడ్‌ను నమోదు చేయాలి.
- ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ రైలు టికెట్ బుకింగ్‌లు చేయగలుగుతారు.