Tomato Nuvvula Pachadi : మెజారిటీ జనాలు ఏ కర్రీ చేసినా కూడా.. అందులో మాగ్జిమమ్ టమాటాలు యూజ్ చేస్తారు. ఎందుకంటే.. పుల్లపుల్లగా ఉండే ఈ టమాటాలు వంటల రుచిని మరింత పెంచుతాయి. కానీ.. స్వయంగా టమాటాలతోనే తయారు చేసే రోటి పచ్చళ్లు మరింత టేస్టీగా ఉంటాయి. అయితే.. చాలా మందికి టమాటా పచ్చడి తెలుసు. కానీ.. నువ్వులతో కలిపి నూరుకునే టమాటా పచ్చడి గురించి అందరికీ తెలియకపోవచ్చు. ఒక్కసారి ట్రై చేశారంటే.. వదిలిపెట్టరంటే నమ్మాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుందీ చట్నీ. ఈ పచ్చడి.. అన్నంలో, చపాతీలో.. రెండిట్లోనూ అద్దిరిపోద్ది. మరి, ఈ చట్నీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్ధాలు :
- పండిన టమాటాలు - అర కేజీ
- పసుపు - అర టీస్పూన్
- పచ్చిమిర్చి-10 లేదా 12
- నువ్వులు- 2 టేబుల్‌స్పూన్‌లు
- వెల్లుల్లి-5
- మెంతులు - పావు స్పూన్
- ధనియాలు- టేబుల్ స్పూన్
- జీలకర్ర
- నూనె- 3 టేబుల్ స్పూన్‌లు
- ఉప్పు రుచికి సరిపడా
తాలింపు కోసం :
- కరివేపాకు రెమ్మ- ఒకటి
- ఆవాలు, జీలకర్ర
- నూనె రెండు- టేబుల్‌స్పూన్‌లు
టమాటా నువ్వుల పచ్చడి తయరీ విధానం:
- ముందుగా స్టౌ పైన పాన్ పెట్టి ఇందులో మెంతులు వేసి ఎర్రగా వేపండి. తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి.
- ధనియాలు బాగా వేగిన తర్వాత నువ్వులు వేసి మరికొద్ది సేపు వేయించాలి.
- ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పౌడర్‌లాగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చట్నీకి మరింత రుచి వస్తుంది.
- తర్వాత.. ఇదే గిన్నెలో కొద్దిగా నూనె యాడ్ చేసి పచ్చిమిర్చి వేసి వేయించాలి.
- అలాగే కొన్ని నిమిషాల తర్వాత కట్ చేసుకున్న బాగా పండిన టమాటాలను వేసుకోవాలి.
- మీకు టమాటా పచ్చడి మరింత పుల్లగా ఉండాలంటే.. కొద్దిగా చింత పండు కూడా వేసుకోవచ్చు.
- టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని దింపి పక్కన పెట్టుకోవాలి.
- టమాటాల మిశ్రమం బాగా చల్లారిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత ఇందులోకి నువ్వుల పౌడర్‌ను వేసుకుని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా టమాటాలను గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లను వేసుకోకూడదు.
- ఇప్పుడు తాలింపు కోసం నూనె వేసి అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు రెమ్మలు వేసి.. తాలింపుని టమాటా పచ్చడిలో వేసుకోవాలి.
- ఇంతే.. ఇలా ఎంతో సింపుల్‌గా టమాటా నువ్వుల పచ్చడి చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఫ్రిడ్జ్‌లో పెడితే రెండు నుంచి మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది.
- ఈ చట్నీ వేడివేడి అన్నంలోకి అలాగే, చపాతీల్లోకి అద్దిరిపోతుంది.
టిఫిన్ సెంటర్ రుచిలో 'టమాట పుదీనా' చట్నీ - ఇలా చేస్తే నిమిషాల్లో రెడీ!
సమ్మర్ స్పెషల్ పెరుగు పచ్చళ్లు - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా - రుచితోపాటు ఆరోగ్యం బోనస్!
టిఫెన్ స్పెషల్ : "రాయలసీమ పల్లీ చట్నీ" - పదే పది నిమిషాల్లో రెడీ!