ETV Bharat / bharat

వాలెంటైన్స్ డే స్పెషల్ : ఇలా ప్రపోజ్ చేయండి - ఫ్లాట్ అయిపోతారంతే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 5:19 PM IST

Tips for Love Propose : "వాలెంటైన్స్ వీక్" కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 8న "ప్రపోజ్ డే"ను సెలబ్రేట్ చేసుకోనున్నారు. మరి.. మీరు కూడా ప్రపోజ్ చేసేందుకు సిద్ధమయ్యారా? మీ ప్రేమను ఎలా వ్యక్తం చేయబోతున్నారు? ఇందుకోసం ఏమైనా ప్రిపేర్ అయ్యారా??

Tips for Love Propose
Tips for Love Propose

Tips for Surprise Love Proposal: గాఢంగా అందరూ ప్రేమిస్తారు. కానీ.. అదే స్థాయిలో ప్రేమను వ్యక్తపరచడం అందరికీ రాదు. ఈ పని సరిగ్గా చేయలేక విలువైన ప్రేమను కోల్పోయిన వారు ఎందరో. అవును.. ప్రేమ సక్సెస్​ కావాలంటే నీ పార్ట్​నర్​ను నువ్వెంత ప్రేమిస్తున్నావో నీకు తెలిస్తే సరిపోదు.. తనకు తెలియాలి. నువ్వు తన వెంట ఉంటే చాలు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జీవితాంతం ధైర్యంగా బతికేయగలను అనే నమ్మకం వాళ్లకు కలగాలి. అప్పుడే.. నీ వేలు అందుకుని.. నీతో ఏడడుగులు వేస్తారు. ఈ భావన కలిగించకుండా.. కేవలం ప్రేమిస్తున్నాను అని చెప్పడం ద్వారా ఉపయోగం లేదంటున్నారు మానసిక నిపుణులు. భాగస్వామికి ఆ నమ్మకం కలిగించడంతోపాటు.. లవ్ ప్రపోజ్​ చేయడానికి ముందు మరికొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.

ప్లాన్స్​: చాలా మంది ప్రేమ గురించే ప్రపోజ్ చేస్తారు. కానీ.. మీరు పెళ్లి చేసుకోవడానికి కూడా ప్రపోజ్ చేయొచ్చు. దీని వల్ల మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో మీ పార్ట్​నర్​కు తెలుస్తుంది. మీది టైమ్ పాస్​ లవ్​ కాదు అని అర్థమవుతుంది. అంతేకాకుండా తనలో ఏ క్వాలిటీస్ నచ్చాయో చెప్పండి. తద్వారా.. ఎందుకు లవ్ చేస్తున్నారో క్లారిటీ వస్తుంది.

అదేవిధంగా.. పెళ్లి తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి..? ఎలా ఉండాలనుకుంటున్నారు..? అనేది చెప్పేయండి. అంతేకాకుండా.. మీ ప్రేమను పెళ్లి పట్టాలు ఎక్కించడానికి ఏం చేస్తారో ముందే ఆలోచించుకోండి. ఆ విషయాన్ని కూడా చెప్పేయండి. పెళ్లికోసం.. మీ పార్ట్​నర్​ పేరెంట్స్​తో కూడా మాట్లాడతానని చెప్పండి. వారిని ఎలా ఒప్పిస్తారో కూడా వివరించండి.

ప్రపోజ్​ డే స్పెషల్​.. ఇలా ప్రపోజ్​ చేసి చూడు.. పిల్ల పడకుంటే అడుగు..!

పటిష్టమైన ప్రణాళిక: ఒక పువ్వు ఇచ్చి ప్రపోజ్​ చేయడం కాకుండా.. మీ పార్టనర్​ ఇష్టాఇష్టాలకు విలువ ఇస్తూ.. వారు మెచ్చేలా ప్రపోజ్​ చేయండి. అంటే వారికి నచ్చిన ప్రదేశాలకు తీసుకెళ్లి ప్రపోజ్​ చేయడం, లేకుంటే ఇష్టమైన వస్తువులను ఇచ్చి వారు సర్​ప్రైజ్​ అయ్యేలా మీ ప్రేమను వ్యక్తపరచండి. అందుకోసం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఇలాంటి ప్లాన్ ఒకటే కాకుండా రెండు మూడు ప్లాన్స్​ రెడీగా పెట్టుకోండి. ఒకవేళ పరిస్థితులు మారినా ప్లాన్ A విఫలమైనా.. ప్లాన్ B, C ఉపయోగపడతాయి. అయితే.. మీరు ఎలా ప్రపోజ్​ చేసినా నిజాయితీగా ఉండటం ముఖ్యమని మరిచిపోకండి.

సహాయం: ప్రపోజ్​ చేసేముందు.. మీ భాగస్వామి స్నేహితుల హెల్ప్ తీసుకోండి. ఎందుకంటే.. మీ పార్ట్​నర్​ ఇష్టాఇష్టాలు మీకు పూర్తిగా తెలియకపోవచ్చు. అందువల్ల వాళ్ల సాయం తీసుకుంటే.. మీ ప్రపోజ్​ మరింత అందంగా మలుచుకునే ఛాన్స్ ఉంటుంది.

ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరైనా ఫిదానే.. ఒక్కసారి ట్రై చేసి చూడు!

ప్రిపేర్ చేసుకోండి: ఇక చాలామందికి ముందస్తు ప్లాన్ ఉండదు. దీంతో.. ప్రపోజ్​ చేసే సమయంలో ఏం మాట్లాడాలో తెలియక తడబాటుకు గురవుతారు. అలాకాకుండా ఉండాలంటే ప్రపోజ్​ చేసే సమయంలో ఏం చెప్పాలనుకుంటున్నారో దానిని ముందుగానే ఓ పేపర్​ మీద రాసుకోండి. ఇలా రాసుకోవడం వల్ల మీరు చెప్పాలనుకున్న విషయంపై మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగని బట్టీ కొట్టాల్సిన అవసరం లేదు. మీరు చెప్పే అంశం మీద కొంత అవగాహన ఉంటే చాలు.

చిన్న విషయాలను వదలొద్దు: ప్రపోజ్​ చేయడానికి అందరూ ఏదైనా పెద్దగా ప్లాన్ చేస్తుంటారు. దీంతో.. చిన్న చిన్న విషయాలను మర్చిపోతారు. ఉదాహరణకు.. మీరు ఖరీదైన రింగ్​ తొడిగి ప్రపోజ్​ చేయాలనుకుంటారు. అయితే.. దానికన్నా టెడ్డీబేర్​ లేదా చాక్లెట్​ అంటే మీ పార్ట్​నర్​కు మరింత ఇష్టం కావొచ్చు. కాబట్టి.. ఇలాంటి చిన్న విషయాలను కూడా మర్చిపోవద్దు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని.. ది బెస్ట్ ప్రపోజల్​ ఫైనల్​ చేసుకోండి.

Love Propose Day : ఎలా ప్రపోజ్ చేయబోతున్నారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.