ETV Bharat / bharat

తండ్రి రిటైర్​మెంట్​ ఆర్డర్​పై కుమారుడు సంతకం- నాన్న కోసం రూ.లక్షల జీతం వదిలి UPSC టాపర్​గా! - Son Signed Father Retirement Order

Son Signed IAS Father Retirement Order : రాజస్థాన్​లో తండ్రి రిటైర్​మెంట్​ ఆర్డర్​పై కుమారుడు సంతకం చేశారు. సీనియర్ ఐఏఎస్​ అధికారి సన్​వర్​మల్​ వర్మ పదవీ విరమణ ఆర్డర్​పై తన కుమారుడు కనిష్క కటారియా సైన్​ చేశారు. ఈ ఘటన అధికారుల వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Son Signed IAS Father Retirement Order
Son Signed IAS Father Retirement Order (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2024, 12:16 PM IST

Updated : Oct 3, 2024, 12:33 PM IST

Son Signed IAS Father Retirement Order : తండ్రి రిటైర్​మెంట్​ ఆర్డర్​పై కుమారుడు సంతకం చేయడం, వినడానికి ఎంత బాగుందో కదా!. ఇలాంటి అరుదైన ఘటనే రాజస్థాన్​లో జరిగింది. భరత్​పుర్​ డివిజనల్​ కమిషనర్​గా ఉన్న సీనియర్ ఐఏఎస్​ ​అధికారి సన్​వర్​మల్ వర్మ పదవీ విరమణ ఆర్డర్​పై, కార్మిక విభాగం సంయుక్త కార్యదర్శి హోదాలో కుమారుడు కనిష్క కటారియా సంతకం చేశారు. ఈ విషయాన్ని కనిష్క సోషల్​ మీడియాలో షేర్​ చేసుకున్నారు. ఈ సంఘటన రాజస్థాన్​ అధికారుల వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇద్దరికీ ఒకేసారి ప్రమోషన్
ఇంతకుముందు, ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. తండ్రీకొడుకులకు ఒకేసారి శాలరీ పెరిగింది. సన్​వర్​మల్ వర్మ శాలరీ సెలెక్షన్​ పే స్కేల్​ నుంచి సూపర్​టైమ్​ పే స్కేల్​(Level 14 in Pay Matrix)కు పెరిగింది. అదే సమయంలో కనిష్క కటారియాకు జూనియర్ పే స్కేల్​ నుంచి సీనియర్​ పే స్కేల్​కు(Level 11 in Pay Matrix) శాలరీ పెరిగింది.

సన్​వర్​మల్ శర్మ రిటైర్​మెంట్​ ఆర్డన్​ సెప్టెంబర్​ 28న కినిష్క జారీ చేశారు. జైపుర్ డివిజనల్ కమిషనర్ ఐఏఎస్ రష్మీ గుప్తాకు భరత్‌పుర్ డివిజనల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఆర్ఏఎస్ అధికారుల బదిలీ, పదవీ విరమణ, ఇతర సర్వీసులకు సంబంధించిన ఉత్తర్వులపై జాయింట్ సెక్రటరీ మాత్రమే సంతకం చేస్తారు.

Son Signed IAS Father Retirement Order
కనిష్క సంతకం చేసిన తండ్రి రిటైర్​మెంట్ ఆర్డర్ (ETV Bharat)

ఉద్యోగం వదిలి- యూపీఎస్​సీ టాపర్​గా
జైపుర్​కు చెందిన కనిష్క కటారియా- తండ్రి, చిన్నాన్న కేసీ వర్మ కూడా ఐఏఎస్​లే. కోటాలో విద్యాభ్యాసం చేసిన కనిష్క, 2010లో జేఈఈలో 44వ ర్యాంకు సాధించారు. అనంతరం ఐఐటీ బాంబేలో బీటెక్ కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివారు. అనంతరం 2016 వరకు సౌత్​ కొరియాలోని సామ్​సంగ్​లో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పనిచేశారు. అనంతరం బెంగళూరులోని QPLUM డేటా సైంటిస్ట్​గానూ పనిచేశారు. అయితే, భారత గ్రోత్​ స్టోరీలో భాగం కావాలని, తండ్రి కోరికను నెరవేర్చాలనే కోరికతో లక్షల జీతం వదులుకుని 2018లో యూపీఎస్​సీ పరీక్ష రాశారు. మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్​సీ మొదటి ర్యాంకు సాధించారు.

2019లో బ్యాచ్​లో ఐఏఎస్​ అయ్యారు కనిష్క​. ముస్సోరీలో ట్రైనింగ్​ తర్వాత బికనెర్​లోని అసిస్టెంట్​ కలెక్టర్​గా పనిచేశారు. అనంతరం కోటాలోని రామ్​గంజ్​ మండిలో ఎస్​డీఎమ్​గా పనిచేశారు. ఆ తర్వాత ప్రమోషన్​తో కార్మిక విభాగంలో జాయింట్​ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

తండ్రి కోసం కుమార్తె త్యాగం.. హైకోర్టులో వాదించి గెలిచి, లివర్ దానం.. దేశంలో ఫస్ట్ టైమ్ ఇలా!

'మీకు నాన్న ఉన్నాడంటూ కొండంత ధైర్యం ఇచ్చాడు - సంతోషపడే లోపే కోలుకోలేని షాకిచ్చాడు' - EX INMATE CHEATS HIS KIDS

Last Updated : Oct 3, 2024, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.