ETV Bharat / bharat

కర్ణాటకలో చక్రం తిప్పేది మనోళ్లే- లోక్​సభ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు కీలకం- మద్దతు ఎవరికో? - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

Telugu Voters Impact on Karnataka Elections : కర్ణాటకలో తెలుగువారి ప్రభావం అక్కడి లోక్​సభ ఎన్నికల్లో కీలకం కానుంది. స్థిరాస్తి వ్యాపారం, వ్యవసాయం, ఉన్నత విద్య, ఉద్యోగాల నిమిత్తం కర్ణాటకలో స్థిరపడిన తెలుగువారు గణనీయంగా ఉన్నారు. కర్ణాటక రాజకీయాల్లో వీరి చైతన్యం కొన్ని నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేసేంతగా మారింది. అందుకే లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగువారి ఓట్లను రాబట్టుకునేందుకు అన్ని పార్టీలూ కసరత్తు చేస్తున్నాయి.

Telugu Voters Impact on Karnataka
Telugu Voters Impact on Karnataka
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 7:05 AM IST

Updated : Apr 24, 2024, 7:12 AM IST

Telugu Voters Impact on Karnataka Elections : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే కర్ణాటకలో ఎక్కువ సంఖ్యలో తెలుగు ఓటర్లు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను తెలుగు ప్రజలు శాసించగలిగే స్థాయిలో ఉన్నారు. అందుకే ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీలు ఆంధ్ర, తెలంగాణల నుంచి తెలుగు ప్రముఖులను రప్పించి మరీ ప్రచారం చేయిస్తుంటారు. ఈ ఎన్నికల్లోనూ అదే కొనసాగుతోంది.

ఆధిక్యానికి అడ్డుకట్ట
2019 ఎన్నికల్లో 50వేల లోపు ఆధిక్యంలో గెలిచిన మూడు స్థానాలు చామరాజనగర (1,817), కొప్పళ (8,397), తుమకూరు (13,339). అయితే, వీటిలో రెండింట తెలుగు ఓటర్ల ప్రభావం అధికంగా ఉంది. 50వేల నుంచి లక్ష లోపు ఆధిక్యంతో గెలిచిన నాలుగు స్థానాల్లో బళ్లారి (55,707), బెంగళూరు కేంద్రం (70,968) చిత్రదుర్గ (80,178), కలబురగిలో (95,452) మూడు స్థానాలు కూడా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నవే. లక్ష నుంచి రెండు లక్షల లోపు ఆధిక్యం ఉన్న స్థానాల్లోనూ ఎక్కువగా తెలుగు ఓటర్ల ప్రభావాన్ని నేతలు గుర్తించారు. కొద్దిపాటి ఆధిక్యాలు నమోదయ్యే స్థానాల్లో తెలుగు ఓటర్లు నిర్ణయాత్మకంగా మారడం ప్రతి ఎన్నికల్లోనూ గమనించవచ్చు. అందుకే వివిధ పార్టీలు తెలుగు వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు, ప్రముఖులతో ప్రచారాలు చేయించి మరి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 5 వేలలోపు ఓట్లతో అభ్యర్థులు ఓడటం, గెలవటం తెలుగు ఓటర్ల ప్రభావంతోనేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

రాజకీయ ఉత్సాహం
గత ఐదేళ్లుగా రాష్ట్రంలో స్థిరపడిన తెలుగు ఓటర్లకు స్థానిక రాజకీయాలపై ఉత్సాహం పెరగడం గమనార్హం. ఇక్కడి తెలుగు ప్రజలంతా ఐటీ ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కోసం వచ్చినవారే ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో జరిగే సమీకరణాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు తగ్గట్లుగా స్పందిస్తుంటారు. ఐటీ నగరం బెంగళూరులో స్థిరపడిన ఐటీ ఉద్యోగులు ఆంధ్ర, తెలంగాణ రాజకీయ పోకడలను గమనిస్తుంటారు. కోలారు, తుమకూరు, బీదర్‌, బళ్లారి, రాయచూరు, చిత్రదుర్గ, కొప్పళ, బీదర్‌ ప్రాంతాల్లోని తెలుగువారు ఇక్కడి రాజకీయాలతో మమేకమై ఉంటారు. అయితే ఈ ఐదేళ్లలో బెంగళూరుకు వచ్చి స్థిరపడిన వారి సంఖ్య అనధికారికంగా 30 లక్షలకు పైగా ఉందని సమాచారం. మొత్తంగా రాష్ట్రంలో దాదాపు ఏడు కోట్లకు చేరిన జనాభాలో కనీసం కోటి మంది తెలుగు ప్రాంతాలకు చెందినవారు ఉన్నారని అంచనా.

చంద్రబాబుకు మద్దతుగా
ఇక గతేడాది సెప్టెంబరులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వేలాది మంది తెలుగు ప్రజలు బెంగళూరు, బళ్లారి, రాయచూరు, కోలారు తదితర జిల్లాల్లో ఆందోళన చేపట్టారు. వీరంతా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ అంశాలపై సందేశాలు, ప్రచారాలు చేస్తూ తెలుగు ఓటర్లను చైతన్యపరుస్తూ ఉన్నారు. వీరి అభిమానాన్ని గుర్తించిన చంద్రబాబు గతేడాది డిసెంబరులో బెంగళూరులో తెలుగు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

lok sabha election 2024
చంద్రబాబు మద్దతుగా కర్ణాటకలో చేసిన నిరసనలు

తెలుగు ఓటర్ల ప్రభావిత ప్రాంతాలు
తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర, బెంగళూరు దక్షిణ, బెంగళూరు కేంద్ర, ఉత్తర, గ్రామీణం, కోలారులో ఈ నెల 26న పోలింగ్‌ జరగనున్నాయి. ​బళ్లారి, కొప్పళ, రాయచూరు, కలబురగి, బీదర్‌, విజయపుర నియోజకవర్గాలు తెలుగు ఓటర్ల ప్రభావిత ప్రాంతాలు. అయితే వీటికి మే 7న పోలింగ్ జరగనుంది. బెంగళూరులో 15 శాతం, బళ్లారి,కోలారు, రాయచూరులో 50 శాతం, తుమకూరు, చిత్రదుర్గ కొప్పళలో 30 శాతం, మిలిగి స్థానాల్లో 10-15 శాతం వరకు తెలుగు ఓటర్లు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభావం
ఈనెల 26న రాష్ట్రంలోని 14 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా ఇందులో కనీసం 8 స్థానాల్లో తెలుగు ఓటర్లు ప్రభావం చూపుతారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల నుంచి స్ఫూర్తి పొందడం ఖాయంగా కనిపిస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్​డీఏతో సన్నిహితంగా ఉన్న కారణంగా ఆ పార్టీ అధినేత పిలుపును ఇక్కడి తెలుగు ప్రజలు అందిపుచ్చుకునే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఎన్​డీఏలో భాగస్వామిగా మారిన జేడీఎస్‌తో టీడీపీ అధినేత చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉండటం ఈ కూటమి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలదని బెంగళూరు టీడీపీ ఫోరం సమన్వయకర్త శ్రీకాంత్‌ వివరించారు. కేవలం తొలి విడత ఎన్నికలే కాదు మలి విడత ఎన్నికల్లోనూ తెలుగు రాష్ట్రాల రాజకీయాల ప్రభావం ఇక్కడి తెలుగు ఓటర్లను ప్రభావితం చేయగలదని చెబుతున్నారు.

నటుడు రవి కిషన్‌కు DNA టెస్టు? ఆయనే తండ్రి అంటూ బాంబే హైకోర్టులో జూనియర్ నటి పిటిషన్ - BJP MP Ravi Kishan DNA Test

'ఆంధ్రప్రదేశ్​లో పైలట్ ప్రాజెక్ట్​తో కాంగ్రెస్ కుట్ర - దేశమంతా అలానే చేద్దామని ప్లాన్' - lok sabha elections 2024

Last Updated : Apr 24, 2024, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.