Telangana Tourism Tour Packages : ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు.. తెలంగాణ టూరిజం అందుబాటు ధరల్లోనే వివిధ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలలో కొన్ని ఒక్కరోజు ట్రిప్‌లు కూడా ఉన్నాయి. టూర్‌లకు వెళ్లడానికి రెండుమూడు రోజుల సమయం లేని వారు ఫ్యామిలీతో కలిసి ఈ ఒక్కరోజు టూర్ ప్యాకేజీలను ఎంజాయ్ చేయవచ్చు. తాజాగా.. ఈ సంస్థ ఓ బెస్ట్ ప్యాకేజీని ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ టూరిజం (Telangana Tourism ) హైదరాబాద్ నుంచి బీచ్‌పల్లి, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని ప్రముఖ దేవాలయాలను సందర్శించడానికి కొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్క రోజులోనే ఈ టూర్ ముగుస్తుంది. ఈ ప్యాకేజీని హైదరాబాద్, బీచ్‌పల్లి, అలంపూర్ టెంపుల్స్ పేరుతో ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీ ద్వారా కృష్ణ, తుంగభద్ర నది మధ్య ప్రాంతంలో వెలసిన ఆంజనేయస్వామిని దర్శించుకోవచ్చు. అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక పీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవచ్చు. ప్రతి శని, ఆదివారాల్లో ఈ టూర్‌ను నిర్వహిస్తున్నారు.
"అల పాపికొండల్లో విహరిద్దామా" - తక్కువ ధరలో తెలంగాణ టూరిజం అద్దిరిపోయే ప్యాకేజీ!
టూర్ ఇలా సాగుతుంది:
- సికింద్రాబాద్‌లోని యాత్రి నివాస్ నుంచి టూర్ ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటల నుంచి టూర్ మొదలవుతుంది.
- ఉదయం 11.30 గంటలకు బీచ్‌పల్లికి చేరుకున్న తర్వాత.. ఆంజనేయస్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
- తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక పీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మరికొన్ని ఆలయాలను సందర్శిస్తారు.
- మధ్యాహ్నం హరిత హోటల్లో భోజనం ఉంటుంది.
- అలాగే సాయంత్రం 4 నుంచి 4.30 గంటలకు స్నాక్స్ కూడా హరిత హోటల్‌లో ఏర్పాటు చేస్తారు.
- సాయంత్రం 4.30 గంటలకు అలంపూర్ నుంచి తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణం చేస్తారు.
- రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.
టికెట్ ధర ఎంతంటే ?
ఈ టూర్‌లో హైదరాబాద్ నుంచి నాన్‌ఏసీ బస్సులో ప్రయాణం ఉంటుంది. ఈ ప్యాకేజీలో పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1200 టికెట్ ధరగా నిర్ణయించారు. టూర్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
వీకెండ్ ట్రిప్‌కు వెళ్తున్నారా? - తెలంగాణలో ఈ బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ట్రై చేయండి!
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్ వే, బోట్ జర్నీ! - తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీలు!