Telangana Tourism Shirdi Ellora Tour: వేసవి సెలవుల్లో ఎక్కువ మంది కుటుంబ సభ్యులతో కలిసి వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించాలని టూర్ ప్లాన్ చేస్తుంటారు. ఇలా దేవాలయాలను సందర్శించడం వల్ల పిల్లల్లో ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని పేరెంట్స్ నమ్ముతారు. మరి మీరు కూడా ఈ హాలిడేస్‌లో ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని అనుకుంటున్నారా ? అయితే, మీకో గుడ్‌న్యూస్. తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ నుంచి షిరిడీకి ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. చాలా తక్కువ ధరకే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. మరి ఈ టూర్ ఎలా సాగుతుంది ? ఏయే ప్రాంతాలను చూడొచ్చు ? ప్యాకేజీ ధర ఎంత ? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ టూరిజం 'షిరిడీ ఎల్లోర టూర్' (Shirdi Ellora Tour) పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి బుధవారం, శుక్రవారం రోజు షిరిడీకి బస్సు ఉంటుంది. మూడు రోజులు పాటు ఈ టూర్ ఉంటుందని తెలంగాణ టూరిజం తెలిపింది. ఈ టూర్ ద్వారా షిరిడీ సాయినాథుడి దర్శనంతో పాటు శని శింగనాపూర్, ఎల్లోరా, ఔరంగాబాద్‌లోని మినీ తాజ్‌మహల్ వంటి వాటిని చూడవచ్చు.
టూర్ ఇలా సాగుతుంది :
- మొదటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు దిల్సుఖ్నగర్ నుంచి, సాయంత్రం 4 గంటలకు బషీరాబాగ్ నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నైట్ మొత్తం జర్నీ ఉంటుంది.
- రెండవ రోజు ఉదయం శని శింగనాపూర్, షిరిడీ సాయినాథుడి దర్శించుకోవాలి. రాత్రి అక్కడే హోటల్‌లో బస చేయాలి.
- మూడవ రోజు ఉదయం 5 గంటలకు షిరిడీ నుంచి ఎల్లోరా గుహలను చూడటానికి వెళ్తారు. మధ్యలో ఔరంగాబాద్‌లోని మినీ తాజ్‌మహల్‌ను చూస్తారు.
- ఆ రోజున నైట్ తిరిగి హైదరాబాద్ బయలుదేరతారు.
- నాలుగవ రోజు ఉదయం 6 గంటలకు హైదారాబాద్ చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.
ఛార్జీలు ఎలా ఉన్నాయి : మీరు ఈ టూర్‌లో ఏసీ లేదా నాన్‌ఏసీ బస్సులో వెళ్లవచ్చు. ఏసీ బస్సులో అయితే పెద్దలకు రూ.3,550లు, పిల్లలకు రూ.2,890లను ధరగా నిర్ణయించారు. అదే నాన్‌ఏసీ బస్సులో అయితే పెద్దలకు రూ.3,100లు, పిల్లలకు రూ.2,530లను ఛార్జీగా నిర్ణయించారు. పర్యాటకులు ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో బస్సు ప్రయాణం, వసతి మాత్రమే ఉంటాయి. భోజనం, దర్శనం టికెట్‌లను టూరిస్టులే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టూర్‌ను బుకింగ్ చేసుకోవాలనుకునే వారు.. అలాగే మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునే వారు ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోండి.