ETV Bharat / bharat

'సిలిండర్ డిప్లిషన్' డివైజ్- గ్యాస్ అయిపోయే 10రోజుల ముందు వార్నింగ్​- కాస్ట్​ రూ.1000లే! - Cylinder Depletion Device

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2024, 4:56 PM IST

Cylinder Depletion Device Invention : సిలిండర్​లోని గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో తెలుసుకునే ఓ డివైజ్​ను కనిపెట్టాడు తమిళనాడుకు విద్యార్థి. ఆ డివైజ్ వల్ల మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరనుంది. మరి ఆ పరికరం ఎలా పనిచేస్తుందంటే?

Cylinder Depletion Device
Cylinder Depletion Device (ETV Bharat)

Cylinder Depletion Device Invention : ప్రస్తుత కాలంలో దాదాపు అందరీ ఇంట్లోనూ గ్యాస్ సిలిండర్లు ఉంటున్నాయి. అయితే అందరి దగ్గర రెండు గ్యాస్ బండలు ఉండకపోవచ్చు. కొందరి దగ్గర ఒకటి మాత్రమే ఉంటుంది. అది అకస్మాత్తుగా ఖాళీ అయిపోతే వంటకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి గ్యాస్ అయిపోతుందని ముందుగానే అలర్ట్ ఇచ్చే డివైజ్​ను కనుగొన్నాడు. అది ఎలా పనిచేస్తుందో తెలుసా?

అమ్మ కష్టాన్ని చూసి!
మధురై జిల్లాలోని నరిమేడుకు చెందిన మిత్రన్ ఓ ప్రైవేట్ స్కూల్​లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. గ్యాస్ సిలిండర్ విషయంలో తన తల్లి పడిన కష్టాన్ని చూసి చలించిపోయాడు. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్లు వాడే వారి కోసం 'సిలిండర్ డిప్లిషన్' అనే వార్నింగ్ డివైజ్​ను తయారుచేశాడు. ఈ డివైజ్​ను సిలిండర్​కు అమర్చితే అందులోని గ్యాస్ అయిపోయే 10 రోజుల ముందు సిగ్నల్ లైట్ వెలుగుతుంది. అలాగే బజర్ సౌండ్ వస్తుంది. దీంతో వినియోగదారులు గ్యాస్ మరికొద్ది రోజుల్లో అయిపోతుందని భావించి బుక్ చేసుకోవచ్చు. లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవచ్చు. కాగా, చిన్న వయసులో వినూత్న డివైజ్​ను రూపొందించిన మిత్రన్​పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు.

TN Student Invented Cylinder Depletion Device
సిలిండర్ డిప్లిషన్ (ETV Bharat)

మిత్రన్ కనిపెట్టిన సిలిండర్ డిప్లిషన్ (ETV Bharat)

ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో
"మా ఇంట్లో ఒకే గ్యాస్ సిలిండర్ ఉంది. సిలిండర్​లోని గ్యాస్ అయిపోతే మా అమ్మ వంట చేయడానికి చాలా ఇబ్బందులు పడేది. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించేది. ఈ సమస్యకు స్వస్తి చెప్పేందుకు ఈ డివైజ్​ను తయారుచేశాను. ఈ డివైజ్ తయారీకి చెక్క బోర్డు, సిగ్నల్ ల్యాంప్, చిన్న మోటర్. ఈ వృత్తాకార బోర్డుపై సిలిండర్ పెడితే అందులో గ్యాస్ అయిపోతే 10 రోజుల ముందు సిగ్నల్ లైట్ వెలుగుతుంది. బజర్ నుంచి సౌండ్ వస్తుంది. ఈ డివైజ్​ను తయారీ చేసేందుకు రూ.1000 ఖర్చయ్యింది. సింగిల్ సిలిండర్లు మాత్రమే ఉన్న కుటుంబాలకు ఈ పరికరం వరంగా మారుతుంది. ఈ ఆవిష్కరణకు ప్రధాన కారణం ఉపాధ్యాయులు, మా స్కూల్ ప్రిన్సిపల్, ఛాన్సలర్. వారందరూ నన్ను ప్రోత్సహించారు. అలాగే మా స్కూల్ టీచర్ అబ్దుల్ రజాక్ నాకు అండగా నిలిచారు" అని మిత్రన్ తెలిపాడు.

సిలిండర్ డిప్లిషన్​తో మిత్రన్ (ETV Bharat)

శత్రువులను ఖతం చేసే 'AI రోబో'- ఎనిమీ ఎక్కడ ఉన్నా గురితప్పదు! యుద్ధభూమిలో 360 డిగ్రీల కవరేజ్​! - AI robot soldiers

పిల్లలు తప్పిపోతే పేరెంట్స్​కు లైవ్ లొకేషన్- హోమ్​వర్క్ చేయకపోతే రిమైండర్- స్మార్ట్​బ్యాగ్​ విశేషాలివే - Students Smart Tracking Bag

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.