ETV Bharat / bharat

మెటర్నిటీ లీవ్స్​ నిబంధనలు ఛేంజ్​- ఇకపై వారికి కూడా సెలవులే! - Surrogacy Maternity Leave - SURROGACY MATERNITY LEAVE

Surrogacy Maternity Leave : సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే మహిళలకు, ఆ పిల్లల తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సరోగసీ తల్లులకు 180 రోజులు ప్రసూతి సెలవులు పొందేలా కొత్త నిబంధనులు తీసుకొచ్చింది.

Surrogacy Maternity Leave
Surrogacy Maternity Leave (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 3:00 PM IST

Surrogacy Maternity Leave : సరోగసీ విషయంలో 50 ఏళ్ల నాటి నిబంధనను కేంద్రం సవరించింది. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే మహిళలకు, ఆ పిల్లల తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సరోగసీ ద్వారా తల్లి అయిన మహిళకు 180 రోజుల ప్రసూతి సెలవులు, తండ్రులు కూడా 15 రోజులపాటూ పితృత్వ సెలవులను తీసుకోవచ్చు. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్-1972ను సవరించింది.

కొత్త నిబంధనలు ప్రకారం అద్దె గర్భం ధరించేవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే 180 రోజుల ప్రసూతి సెలవులు పొందుతారు. అలాగే ఇద్దరు కంటే తక్కువ పిల్లలున్న ప్రభుత్వ ఉద్యోగి తల్లికి (గర్భంలోని బిడ్డను స్వీకరించే తల్లి) కూడా ఈ సెలవులు లభిస్తాయి. ఇక ఈ సవరించిన సరోగసీ కేసుల్లో పితృత్వ సెలవులకు కూడా ప్రభుత్వం అనుమతించింది. సాధారణ పురుష ఉద్యోగులకు ఇచ్చే విధంగానే సరోగసీ విధానం ద్వారా తండ్రిగా మారిన వారికి కూడా సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే బిడ్డకు జన్మించిన ఆరు నెలల్లోపు 15 రోజుల పాటు పితృత్వ సెలవులు తీసుకోవచ్చు. అయితే అతడికి కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదని షరతు విధించింది. సరోగసీ ద్వారా బిడ్డ పుడితే ఆ మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనే నిబంధనలు ఇప్పటి వరకు లేవు. తాజాగా ఆ నిబంధనలను సవరించి కొత్త రూల్స్​ను తీసుకొచ్చంది కేంద్ర ప్రభుత్వం. సవరించిన కొత్త రూల్స్ జూన్​ 18నుంచి అమల్లోకి వచ్చాయి.

గర్భంలోని పిండం వయసు నిర్ధరణకు ఏఐ- ఇక డెలివరీ డేట్ మరింత పక్కాగా!
Fetal Age Estimation AI Model : గర్భిణీలో పెరిగే పిండం కచ్చితమైన వయసును నిర్ధరించేందుకు ఐఐటీ మద్రాస్‌తోపాటు ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (టీహెచ్‌ఎస్‌టీఐ) పరిశోధకులు ఏఐ నమూనాను అభివృద్ధి చేశారు. భారత్‌లో ఈ తరహా ఏఐ మోడల్‌ను రూపొందించడం ఇదే తొలిసారి. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ మోడల్‌ను గర్భిణీ-జీఏ2గా పిలుస్తున్నారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి

కేజ్రీవాల్​కు సుప్రీంలో చుక్కెదురు- అప్పటివరకు జైలులోనే దిల్లీ సీఎం! - Kejriwals Bail Plea

ఐక్యంగా పార్లమెంట్​కు ఇండియా కూటమి నేతలు- రాజ్యాంగ ప్రతులతో ఎంపీల నిరసనలు - Lok Sabha Session 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.