Suraj Revanna Sexual Assault Case : కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. సూరజ్‌పై స్వలింగ వేధింపులకు పాల్పడ్డారంటూ జేడీఎస్ పార్టీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
జూన్ 16 సాయంత్రం సూరజ్ రేవణ్ణ ఫామ్‌హౌస్‌లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని శనివారం హూళెనరసిపురా పోలీస్ స్టేషన్లో చేతన్ అనే పార్టీ కార్యకర్త ఫిర్యాదు చేశాడు. 'లోక్‌సభ ఎన్నికల సమయంలో చేసిన పనిని చూసి నా ఫోన్ నంబర్‌ను సూరజ్ అడిగారు ఈ క్రమంలో ఖాళీగా ఉన్నప్పడు వచ్చి కలవాలని చెప్పారు. జూన్ 16 సాయంత్రం హసన్ జిల్లాలోని గన్నికాడ గ్రామంలో ఉన్న ఫామ్‌హౌస్ వెళ్లాను. ఆ తర్వాత సూరజ్ వచ్చి లోపల నుంచి తాళం వేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. అలాగే రాజకీయాల్లో ముందుకు వెళ్లేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. నేను ఒప్పకోకపోవడం వల్ల బెదిరించి, ఫోన్ చేసినప్పుడల్లా పామ్‌హౌస్ రావాలని హెచ్చరించారు. జూన్ 17న సూరజ్ స్నేహితుడు శివకుమార్ వచ్చి ఈ విషయాన్ని ఎక్కడ చెప్పవద్దని, అందుకు రూ.2 కోట్లు, ఉద్యోగం ఇప్పిస్తాని చెప్పారు' అని చేతన్ పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సూరజ్‌పై ఐపీసీ సెక్షన్ 377, 506(బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. శనివారం సాయంత్రమే సూరజ్ రేవణ్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే హసన్ పోలీసులు సూరజ్‌ను అరెస్ట్ చేశారు.
రూ. 5 కోట్ల కోసం డిమాండ్
మరోవైపు ఈ ఆరోపణలను సూరజ్ రేవణ్ణ తీవ్రంగా ఖండించారు. రూ. ఐదు కోట్లు ఇవ్వాలని చేతన్ డిమాండ్ చేశాడనీ లేకపోతే కేసు పెడతానని బెదిరించాడని సూరజ్ తెలిపారు. ముందుగా తన స్నేహితుడైన శివకుమార్ దగ్గరకు ఉద్యోగం ఇప్పించాలని అతడు వచ్చాడనీ, ఉద్యోగం ఇప్పించకపోవడం వల్ల రూ.5 కోట్లు డిమాండ్ చేశాడని వివరించారు. ఆ తర్వాత రూ.2 కోట్లకు తగ్గిందని శివకుమార్ శుక్రవారమే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం కేసులో అరెస్టయ్యారు. ఉద్యోగ అవసరాల కోసం వచ్చిన మహిళలను ఆయన శారీరకంగా ఉపయోగించుకున్నాడని ఆయనపై ఆరోపణలున్నాయి.
రైతుకు దొరికిన భారీ డైమండ్- రాత్రికి రాత్రే లక్షాధికారిగా! ఇది రెండోసారట!!
CBI చేతికి నీట్ లీకేజీ కేసు- ప్రధాన సూత్రధారి సంజీవ్ ముఖియానే! - NEET UG 2024 Paper Leak