ETV Bharat / bharat

'వికసిత్‌ భారత్‌లో సాధికార న్యాయవ్యవస్థ భాగమే- కొత్త యుగంలోకి పోలీస్​, దర్యాప్తు వ్యవస్థలు'

Supreme Court Diamond Jubilee Modi Speech : సాధికార న్యాయవ్యవస్థ వికసిత్‌ భారత్‌లో భాగమే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉత్తమ అభ్యాసాలకు అనుగుణంగా చట్టాలను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు.

Supreme Court Diamond Jubilee Modi Speech

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 3:12 PM IST

Supreme Court Diamond Jubilee Modi Speech : విశ్వసనీయ న్యాయ వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉత్తమ అభ్యాసాలకు అనుగుణంగా దేశంలోని చట్టాలను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా చేసిన మూడు నేరచట్టాల వల్ల దేశంలోని న్యాయ, పోలీసు, దర్యాప్తు వ్యవస్థలు కొత్తయుగంలోకి ప్రవేశించాయని చెప్పారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఏర్పాటై 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవాల్లో మోదీ ప్రసంగించారు.

  • #WATCH | PM Narendra Modi says, "...The Supreme Court has strengthened India's vibrant democracy. Today's economic policies of India will form the basis of tomorrow's bright India. The laws being made in India today will further strengthen tomorrow's bright India ..." pic.twitter.com/up6ECLFzz5

    — ANI (@ANI) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"వికసిత్ భారత్‌లో సాధికార న్యాయ వ్యవస్థ ఒక భాగం. విశ్వసనీయ న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. అందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. జన్ విశ్వాస్ బిల్లు ఈ దిశలో ఒక అడుగు. భవిష్యత్తులో ఈ బిల్లు న్యాయవ్యవస్థపై అనవసరమైన భారాన్ని తగ్గిస్తుంది. ప్రతి పౌరుడు సులభంగా న్యాయాన్ని పొందడానికి అర్హుడు"

-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

"ప్రస్తుతం ప్రపంచం దృష్టి భారత్​ పైనే ఉంది. మన దేశంపై విశ్వాసం పెరుగుతోంది. న్యాయానికి ప్రతి పౌరుడు అర్హుడు. ప్రతి పౌరుడికి సులభంగా న్యాయం అందేలా చేయడమే భారత్​ ప్రాధాన్యం. అలా చేయడానికి సుప్రీంకోర్టు ప్రధాన మాధ్యమం. ప్రస్తుతం సుప్రీంకోర్టు భవనంలో సమస్యలన్నీ నాకు తెలుసు. అత్యున్నత న్యాయస్థానం భవన సముదాయాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం రూ.800 కోట్లను విడుదల చేసింది" అని తెలిపారు మోదీ.

"డిజిటల్‌ సుప్రీంకోర్టు రిపోర్ట్ సాయంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పులు ఇప్పుడు డిజిటల్‌ ఫార్మాట్‌లోనూ లభించనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులను స్థానిక భాషల్లో అనువాదం మొదలు కావటం నాకు ఆనందాన్ని ఇచ్చింది. దేశంలోని ఇతర న్యాయస్థానాల్లోనూ ఇలాంటి వ్యవస్థ త్వరగా అందుబాటులోకి వస్తుందని విశ్వసిస్తున్నాను. సులభతర న్యాయానికి సాంకేతిక ఎలా మద్దతు ఇస్తుందో ఈ కార్యక్రమమే అందుకు మంచి ఉదాహరణ. నా ఈ ప్రసంగం కృత్రిమమేధతో ఇదే సమయంలో ఇంగ్లిష్‌లో అనువాదం అవుతోంది. దాన్ని మీలో కొందరు భాషిణి యాప్‌ ద్వారా వింటున్నారు. ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ సాంకేతిక ఎంత అద్భుతం చేస్తుందో దీనిద్వారా తెలుస్తోంది. న్యాయస్థానాల్లో కూడా ఇలాంటి సాంకేతికతను ఉపయోగించి సామాన్య ప్రజల జీవితాలు సులభతరం చేయవచ్చు. న్యాయస్థానాల తీర్పులు సులభమైన భాషల్లో రాయడం వల్ల సగటు ప్రజలకు మరింత మేలు జరుగుతుంది.

-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఈ సందర్భంగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రస్తావనను తీసుకొచ్చారు ప్రధాని మోదీ. రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి, ఆసియాలో తొలి మహిళా సుప్రీంకోర్టు జడ్జి అయిన జస్టిస్ ఫాతిమా బీవీని పద్మభూషణ్​తో సత్కరించామని మోదీ తెలిపారు. ఇది దేశమంతా గర్వపడాల్సిన విషయం అని అన్నారు.

  • #WATCH | PM Narendra Modi says, "...The Padma Awards given this time. In that, retired Supreme Court judge and the first Muslim female Supreme Court judge of entire Asia, Justice Fathima Beevi was honoured with Padma Bhushan. This is a matter of pride for me..." pic.twitter.com/x36sxd2B3Z

'యువత, మహిళలు దేశాన్ని అవినీతి, బంధుప్రీతి నుంచి విముక్తి చేయగలరు'

'జనవరి 22 నవయుగానికి ప్రతీక- రాముడిని క్షమించమని కోరుతున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.