ETV Bharat / bharat

'లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడో ఆయన గురువారం చెబుతారు!': కేజ్రీవాల్ భార్య సునీత - Sunita Kejriwal

Sunitha Kejriwal Announcement : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుపై ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్​ మరో వీడియో సందేశం విడుదల చేశారు. ఈ కేసుకు సంబంధించి నిజాలన్నీ ఆయన గురువారం కోర్టులో బయటపెట్టనున్నట్లు వెల్లడించారు.

Sunitha Kejriwal Announcement
Sunitha Kejriwal Announcement
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 1:14 PM IST

Updated : Mar 27, 2024, 1:57 PM IST

Sunitha Kejriwal Announcement : దిల్లీ లిక్కర్​ స్కాం కేసుకు సంబంధించిన నిజానిజాలను తన భర్త అరవింద్​ కేజ్రీవాల్‌ మార్చి 28న (గురువారం) కోర్టులోనే చెబుతారని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్​ సంచలన ప్రకటన చేశారు. ఈ కేసుకు సంబంధించి వాస్తవాలన్నింటినీ ఆయన న్యాయమూర్తి ముందు బయటపెడతారని వెల్లడించారు. ఈ కుంభకోణం డబ్బులు ఎక్కడున్నాయనే వివరాలతోపాటు పూర్తి ఆధారాలు సమర్పిస్తారని చెప్పారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో తన అరెస్టును సవాల్‌ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఆయన సతీమణి సునీత ఈ సంచలన ప్రకటన చేశారు. మంగళవారం సాయంత్రం సునీత అరవింద్​ కేజ్రీవాల్​ను కలిశారు.

'దిల్లీని నాశనం చేయాలని చూస్తున్నారు'
'నా భర్తను అరెస్టు చేసి ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఆయనకు ఆరోగ్యం సహకరించట్లేదు. షుగర్​తో ఇబ్బందిపడుతున్నారు. కస్టడీలోనూ ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచే దిల్లీ ప్రజల బాగోగులు అడిగి తెలుకుంటున్నారు. దీన్ని కూడా మోదీ ప్రభుత్వం సమస్యగా మారుస్తోంది. ఆయనపై అక్రమ కేసులు పెడుతోంది. దిల్లీని నాశనం చేయాలని వారు కోరుకుంటున్నారు. ఈ వరుస పరిణామాలతో కేజ్రీవాల్​ ఆందోళన చెందుతున్నారు' అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ నిజమైన దేశభక్తుడని, ధైర్యం గల నేత అని తెలిపారు.

"మద్యం కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటివరకు 250 సార్లకుపైగా సోదాలు జరిపారు. ఎందులోనూ వారికి ఏమీ దొరకలేదు. ఈ కేసుకు సంబంధించి మార్చి 28న కోర్టులో అన్ని నిజాలు బయటపెడతానని అరవింద్‌ కేజ్రీవాల్‌ నాతో చెప్పారు. లిక్కర్‌ స్కాం డబ్బు ఎక్కడుందో కూడా ఆయన న్యాయస్థానంలో చెబుతారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఇస్తారు."
- సునీతా కేజ్రీవాల్, దిల్లీ సీఎం సతీమణి

జైలు నుంచి కేజ్రీ రెండో ఆర్డర్​!
రెండు రోజుల క్రితమే దిల్లీలో నీటి సమస్యను నివారించాలని ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్​ తన సహచర మంత్రి ఆతిశీకి లేఖ పంపారు. ఈ విషయాన్నీ సునీత తన వీడియో మెసేజ్​లో ప్రస్తావించారు. కాగా, ప్రస్తుతం ఈ లేఖపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం కూడా మరో ఉత్తర్వును జైలు నుంచే జారీ చేశారు కేజ్రీవాల్. ఇందులో ఆరోగ్యశాఖకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను తన రెండో ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్​ భరద్వాజ్​ను కోరారు.

'లాలూ,రబ్రీ- అరవింద్,సునీత!'
మరోవైపు సునీతా కేజ్రీవాల్​ చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ స్పందించారు. 'లాలూ ప్రసాద్​ యాదవ్​ దాణా కుంభకోణంలో చిక్కుకున్నప్పుడు రాబ్రీ దేవీ ప్రకటనలు చేసేవారు. ప్రస్తుతం అరవింద్​ కేజ్రీవాల్​- సునీతా కేజ్రీవాల్​ వ్యవహారం అలానే ఉంది. కాంగ్రెస్​ అవినీతికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ నిరాహార దీక్షలు చేసేవారు. కానీ, ఇప్పుడు ఆయనే అవినీతి ఊబిలో కూరుకుపోయారు. ఆప్​కు చెందిన ఎంపీ, మంత్రులు, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ అందరూ జైల్లో ఉన్నారు. ఈ కేసులో ప్రధాన పాత్రధారుగా ఉన్న సీఎం కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. కేజ్రీవాల్​కు ముఖ్యమంత్రి పదవిపై ఎంత వ్యామోహం అంటే ఆయన జైల్లో ఉండి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు' అని అనురాగ్​ ఠాకూర్ అన్నారు.

'మాకు మరింత సమయం కావాలి'- కేజ్రీవాల్​ అరెస్ట్​ పిటిషన్​పై ఈడీ - Arvind Kejriwal ED Case

ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్‌ రెండో ఆదేశం- ప్రధాని నివాసం ముట్టడిలో ఉద్రిక్తత - Kejriwal Issue 2nd Order From Jail

Last Updated : Mar 27, 2024, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.