ETV Bharat / bharat

బడికి వెళ్లాలంటే నది దాటాల్సిందే- 'సాయం చేయకపోతే పడవ కొంటాం!'- సీఎంకు విద్యార్థుల లేఖ - Children Cross River datia district

Students Cross River To Reach School : మధ్యప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులు బడికి వెళ్లేందుకు సాహసాలు చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి నదిని దాటుతున్నారు. ఓ చేత్తో యూనిఫాం మరోచెత్తో చెప్పులు. తలపై పుస్తకాలతో నదిని దాటి పాఠశాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం నది నడుము లోతులోనే ప్రవహిస్తున్నా అకస్మాత్తుగా నది పొంగితే తమ చిన్నారుల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

Students Cross River To Reach School
Students Cross River To Reach School
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 4:04 PM IST

Students Cross River To Reach School : మధ్యప్రదేశ్‌ దతియా జిల్లాలో విద్యార్థులు ప్రతిరోజు నడుములోతు ప్రవహిస్తున్న నదిని దాటుతూ పాఠశాలకు వె‌ళ్తున్నారు. ఓ చేత్తో తమ యూనిఫాం తడవకుండా జాగ్రత్త పడాలి, మరోవైపు చేతితో చెప్పుల జత జారకుండా పట్టుకువాలి ఇవే అనుకుంటే తలపైన ఉన్న పుస్తకాల సంచి నీటిలో పడకుండా చూసుకోవాలి. ఇలా సాహసం చేస్తే తప్ప పాఠశాలకు ఆ విద్యార్థులు వెళ్లలేరు.

Students Cross River To Reach School
బడికి వెళ్లేందుకు నది దాటుతున్న విద్యార్థులు

భందేర్‌ నియోజకవర్గంలో తగా పంచాయితీ విద్యార్థులు నరేటా గ్రామంలోని పాఠశాలకు వెళ్లడానికి పడే పాట్లు ఇవి. ఈ రెండు గ్రామాల మధ్య దూరం సుమారు కిలోమీటరు ఉంటుంది. కానీ ఆ దారిలో ఏడాది పొడవునా ప్రవహించే నది ఉంది. ఈ కారణంగా విద్యార్థులు, గ్రామస్థులు ఎప్పుడు ఆ గ్రామానికి వెళ్లాలన్నా, ఈ నదిని దాటాల్సి వస్తోంది. ఒక్కోసారి నది అకస్మాత్తుగా ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల విద్యార్థులు, గ్రామస్థులు నీటి ప్రవాహంలో గల్లంతైన సందర్భాలూ ఉన్నాయని స్థానికులు తెలిపారు.

నదిలో పాములు, పదునైనా రాళ్లు, గాజు ముక్కలు కారణంగా విద్యార్థులకు గాయలవుతున్నాయని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ నదిపై వంతెన నిర్మించడానికి ప్రభుత్వ అధికారులకు ఎన్ని ప్రతిపాదనలు పంపినా పట్టించుకోలేదని అన్నారు. ఇక్కడ వంతెన నిర్మించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విద్యార్థలందరూ కలిసి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ఈ నదిపై వంతెన నిర్మించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. ఇక ప్రభుత్వం తమకు సహాయం చేయకపోతే ఓ పడవ కొని, పిల్లలను నది దాటిస్తాం అని ప్రధానోపాధ్యాయులు వెల్లడించారు.

కట్టెల వంతెనపై విద్యార్థుల పాట్లు
గతేడాది ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌ అశోక్‌నగర్ జిల్లా తుమెన్ గ్రామంలోని విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. స్కూల్​కు చేరుకునే క్రమంలో త్రివేణి నది దాటేందుకు చెక్కతో చేసిన ప్రమాదకరమైన తాడు వంతెనను దాటాల్సి వస్తోంది. పాఠశాలకు వెళ్లేందుకు మరో మార్గం లేదు. దీంతో స్కూల్​కు వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. పాఠశాలకు వెళ్లేందుకు ఎక్కువ సమయం అవుతుండడం వల్ల, ఈ తాత్కాలిక వంతెనే వారికి దిక్కవుతోంది. చాలాసార్లు పడతామేమో అని భయం వేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి కథనం చూడాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

పాముకాటుకు విరుగుడు- ల్యాబ్​లో యాంటీబాడీల అభివృద్ధి- బెంగళూరు శాస్త్రవేత్తల ఘనత!

ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు- రంగంలోకి రాహుల్- దీదీని ఒప్పించేందుకు నయా ఫార్ములా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.