ETV Bharat / bharat

'మూడు వారాల్లోగా సమాధానం చెప్పండి'- CAAపై కేంద్రానికి సుప్రీం డెడ్​లైన్! - caa case supreme court

Stay Petition On CAA Supreme Court : పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై మూడు వారాల్లోగా తమ సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసం మంగళవారం విచారణ చేపట్టింది.

caa case supreme court
caa case supreme court
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 3:02 PM IST

Updated : Mar 19, 2024, 4:26 PM IST

Stay Petition On CAA Supreme Court : పౌరసత్వ సవరణ చట్టం-CAA అమలుపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లపై 3 వారాల్లోగా స్పందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మూడువారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అయితే, విచారణ పూర్తయ్యే దాకా చట్టం అమలుపై స్టే విధించాలని పిటిషనర్లు కోరారు. దీనిపై ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.

కేంద్ర తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ చట్టం ఏ వ్యక్తి పౌరసత్వాన్ని తొలిగించదని ధర్మాసనానికి తెలిపారు. 200 దరఖాస్తులకు సమాధానం ఇచ్చేందుకు నాలుగు వారాల సమయం కావాలని మెహతా సుప్రీంకోర్టును కోరారు. అనంతరం సర్వోన్నత న్యాయస్థానం విచారణను ఏప్రిల్‌ 9వ తేదీకి వాయిదా వేసింది.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు దేశ పౌరసత్వాన్ని కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం 2019లో పార్లమెంట్‌ ఆమోదం పొందింది. అయితే ఆ తర్వాత సీఏఏను సవాల్‌ చేస్తూ అప్పట్లోనే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనలు ఇంకా నోటిఫై చేయకపోవడం వల్ల ఆ చట్టం అమల్లోకి రాలేదని కేంద్రం నాడు న్యాయస్థానానికి వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇటీవల పౌరసత్వ సవరణ నిబంధనలు-2024ను సర్కారు నోటిఫై చేయడం వల్ల చట్టం అమలులోకి వచ్చింది. దీంతో ఈ అంశం మళ్లీ కోర్టుకు చేరింది.

'ఇది ముస్లిం వ్యతిరేక చట్టం కాదు'
అయితే పార్లమెంట్​లో ఆమోదం పొందిన నాటు నుంచి సీఏఏను పలు వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. అయినా కేంద్రం ఈ చట్టంపై కచ్చితంగా ఉంది. ఇటీవల ఈ విషయంపై మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ ​షా సీఏఏను వెనక్కి తీసుకునే ప్రసక్తిలేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో రాజీపడబోమని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. సీఏఏను ముస్లిం వ్యతిరేక చట్టంగా అభివర్ణించడాన్ని ఆయన తప్పుబట్టారు. కొందరిని వేరుగా ఉంచడం ఈ చట్టం ఉద్దేశం కాదన్నారు. 1947లో మతం ఆధారంగానే దేశ విభజన జరిగిందన్న అమిత్ షా, వలస వెళ్లినవారు ఎప్పుడైనా తిరిగి రావచ్చని ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు చెప్పారని గుర్తు చేశారు. అయితే బుజ్జగింపు రాజకీయాల కారణంగానే నాడు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోవడంలేదన్నారు.

CAA అమలుతో ఏమవుతుంది? కొత్త చట్టంపై నిరసనలకు కారణమేంటి?

'ఎన్నికల ముందు ఓట్లు చీల్చే ప్రయత్నం'- CAA అమలుపై విపక్షాలు ఫైర్​

Last Updated : Mar 19, 2024, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.