ETV Bharat / bharat

తండ్రిని కాపాడేందుకు కొడుకు ప్రయత్నం- తల్లి హత్య కేసులో పోలీసులకు లొంగుబాటు

Son Surrendered To Police Protect Father : తల్లిని హత్య చేసిన కొడుకు కేసు ట్విస్ట్ జరిగింది. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో మృతురాలి భర్త సైతం హత్యలో పాలుపంచుకున్నట్లు తేలింది. దీంతో అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

Son Surrendered To Police Protect Father

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 9:31 AM IST

Son Surrendered To Police Protect Father : తల్లి హత్య కేసులో తండ్రిని రక్షించేందుకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు ఓ మైనర్ కొడుకు. అయితే పోలీసుల విచారణలో తండ్రి సైతం హత్యలో పాల్గొన్నట్లు తేలడం వల్ల అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని కేఆర్​ పురం పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగింది.

ఇది జరిగింది
ఫిబ్రవరి 2న కేఆర్​పురం పోలీస్ స్టేషన్​ పరిధిలో ఓ హత్య జరిగింది. తన తల్లిని హత్య చేశానంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు. బ్రేక్​ఫాస్ట్​ విషయంలో గొడవ తలెత్తడం వల్ల ఐరన్​ రాడ్​తో కొట్టి ఈ హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అందులో ఆసక్తికర విషయాలు బహిర్గతమయ్యాయి. హత్యకు ఉపయోగించిన ఐరన్​ రాడ్​పై రెండు రకాల వేలిముద్రలు కనిపించాయి. దీంతో అనుమానించిన పోలీసులు, ఐరన్ రాడ్​ను ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పంపించారు. దీనిని పరీక్షించిన అధికారులు, వాటిని తండ్రి, కొడుకు వేలిముద్రలుగా గుర్తించారు. దీంతో వెంటనే మృతురాలి భర్త చంద్రప్పను అరెస్ట్ చేశారు పోలీసులు.

అయితే, పోలీసుల విచారణలో మరిన్ని విషయాలను చెప్పాడు నిందితుడు చంద్రప్ప. "నా భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉంది. మద్యపానం అలవాటు కూడా ఉంది. వాటిని మానుకోవాలని ఎన్ని చెప్పినా వినలేదు. ఆమె ఒక్కోసారి రెండు, మూడు రోజుల వరకు ఇంటికి కూడా రాదు. ఇదే విషయంపై ప్రశ్నించగా మాకు గొడవ జరిగింది. అందుకే కుమారుడితో కలిసి ఆమెను హత్య చేసేందుకు ప్లాన్​ చేశా" అని చంద్రప్ప తెలిపాడు.

తండ్రీకొడుకులు ఇద్దరు కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు. ఐరన్​ రాడ్​తో దాడి చేసిన తర్వాత ఆమె మరణించిందని నిర్ధరించుకుని పారిపోయాడు చంద్రప్ప. కానీ తండ్రిని రక్షించేందుకు నేరాన్ని ఒప్పుకున్నాడు మైనర్​ కుమారుడు. హత్యకు ఉపయోగించిన ఐరన్ రాడ్​ను తీసుకుని పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు. ఆ తర్వాత విచారణలో ఇదంతా తెలియడం వల్ల చంద్రప్పను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తండ్రి చంద్రప్పతో పాటు అతడి కుమారుడు సైతం కేఆర్​ పురం పోలీస్ స్టేషన్​లో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.