ETV Bharat / bharat

అన్నామలై పేరు వెనుక అంత కథ ఉందా? ఈ పదంతో తమిళులకు ఎందుకంత అటాచ్‌మెంట్? - Significance Of Name Annamalai - SIGNIFICANCE OF NAME ANNAMALAI

Significance Of Name Annamalai in Tamilnadu : 'అన్నామలై' అనగానే మనకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు గుర్తుకొస్తారు !! వాస్తవానికి ఆ పదం తమిళనాడులో మనుషుల పేర్లకే పరిమితం కాదు. తమిళుల చారిత్రక, సామాజిక, సాంస్కృతిక కోణాలతో ఈ పదానికి అవినాభావ అనుబంధం ఉంది.

Significance Of  Name Annamalai
Significance Of Name Annamalai
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 5:34 PM IST

Significance Of Name Annamalai in Tamilnadu : 'అన్నామలై' అనగానే మనకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు గుర్తుకొస్తారు! వాస్తవానికి ఆ పదం తమిళనాడులో మనుషుల పేర్లకే పరిమితం కాదు. అంతకంటే చాలా ఎక్కువ విలువను 'అన్నామలై' పదానికి తమిళులు ఇస్తుంటారు. ఎందుకంటే తమిళుల చారిత్రక, సామాజిక, సాంస్కృతిక కోణాలతో ఈ పదానికి అవినాభావ అనుబంధం ఉంది. అన్నామలై అనే పేరును వినగానే తమిళులు గర్వించేలా చేసిన చారిత్రక ఘట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్న అన్నామలై
తమిళులు చిన్న అన్నామలై అనే పేరును వినగానే చాలా గర్వంగా ఫీలవుతారు. ఎందుకంటే ఆయన దేశభక్తి అనన్య సామాన్యం. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో గాంధీజీకి కీలక అనుచరుడిగా చిన్న అన్నామలై వ్యవహరించారు. గాంధీజీతో కలిసి సుదీర్ఘ పాదయాత్రల్లో పాల్గొన్నారు. 1920 - 1980 కాలానికి చెందిన ఈయన తన ప్రసంగాలతో ప్రజలను ఎంతో ఆకట్టుకునేవారు. క్విట్ ఇండియా ఉద్యమం టైంలో 1942లో చిన్న అన్నామలైను బ్రిటీష్ పాలకులు అరెస్టు చేసి రామనాథపురం జిల్లాలోని తిరువాడనై జైలులో పెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన అభిమానులు జైలుపై దాడి చేసి చిన్న అన్నామలైను విడిపించి తీసుకెళ్లారు. ఆనాడు చిన్న అన్నామలై అభిమానులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. మళ్లీ పోలీసులు చిన్న అన్నామలైను అరెస్టు చేసి జైల్లో వేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా ఆయన తరఫున న్యాయవాదిగా, ప్రఖ్యాత నాయకుడు చక్రవర్తుల రాజగోపాలాచారి హాజరై వాదనలు వినిపించారు. దీంతో ఎట్టకేలకు అన్నామలైకు బెయిల్ వచ్చింది.

అన్నామలై చెట్టియార్
తమిళనాడుకు చెందిన ఓ ప్రఖ్యాత పరోపకారి, పారిశ్రామికవేత్త పేరు రాజా సర్ అన్నామలై చెట్టియార్. ఈయన 1881-1948 కాలానికి చెందినవారు. తమిళనాడులోని ప్రముఖ అన్నామలై యూనివర్సిటీని 1929 సంవత్సరంలో స్థాపించింది ఈయనే. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వమే దీన్ని నిర్వహిస్తోంది. తమిళ సంగీతాన్ని ప్రచారం చేయడానికి 1943లో 'తమిళ ఇసై సంగమ్‌'ను కూడా అన్నామలై చెట్టియార్ స్థాపించారు. చెన్నైలోని డౌన్‌టౌన్ ప్యారీ ఏరియాలో ఉన్న రాజా అన్నామలై మండ్రం భవనాన్ని నిర్మించింది కూడా ఈయనే. ఈ బిల్డింగ్‌లో తమిళ సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.

శైవ గ్రంథాలలో- అన్నామలయార్ స్వామి పేరులోనూ
శక్తిమంతుడైన శివ భగవానుడిని కూడా 'అన్నామలై' అని పిలుస్తుంటారు. శివుడు సర్వశక్తివంతుడు, గొప్పవాడు, మహిమను కలిగిన వాడు అనే అర్థాన్ని ఈ పదం ఇస్తుంది. తమిళ శైవమతానికి సంబంధించి 12 పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. వాటిలో రెండు ముఖ్య గ్రంథాల పేర్లు తేవరం, తిరువాసగం. వీటిలోనూ శివుడిని అన్నామలై అనే పదంతో కీర్తించారు. తమిళనాడులోని తిరువణ్నామలైలో అత్యంత మహిమ కలిగిన అరుణాచలేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ కొలువైన భగవానుడిని అన్నామలయార్ అని పిలుస్తారు. ఈ పేరులోనూ అన్నామలై అనే పదం కలిసి ఉంది. తిరువణ్నామలైలోని పవిత్రమైన అరుణాచల కొండను జ్ఞానోదయానికి ప్రవేశ ద్వారంగా భక్తులు భావిస్తారు. 'అరుణ' అంటే ఎరుపు రంగు. ఇది శివుడికి సంబంధించిన రంగు. తిరువణ్నామలైలోని అరుణాచల కొండలో భగవంతుడు అగ్ని రూపంలో పూజలు అందుకుంటాడు. అరుణాచల కొండపైన ఏటా కార్తీక దీపాన్ని వెలిగించి ఆరాధిస్తుంటారు.

'అన్నామలై'- సూపర్ హిట్!
1992లో 'అన్నామలై' పేరుతో తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ విడుదలైంది. ఇందులో రజినీకాంత్ హీరోగా నటించారు. బాలచందర్ ప్రొడక్షన్ హౌస్​ 'కవితాలయ' నిర్మించిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో 'మలై డా.. అన్నామలై' అనేది రజినీకాంత్ చెప్పే ప్రసిద్ధ పంచ్‌లైన్. ఇందులో రజినీకాంత్ 'అన్నామలై' అనే పాల విక్రేత పాత్రను పోషించారు. తమిళ భాషలో 'మలై' అంటే పర్వతం అని అర్థం. హీరో పరాక్రమం, కృషి, విజయాన్ని సూచించడానికి ఈ పదం సరిగ్గా ఉంటుందని ఆనాడు బాలచందర్ భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆ పేరు ఎఫెక్టుతో అన్నామలై మూవీ సూపర్ హిట్ అయింది. మరి ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఎలాంటి ఫలితాలు సాధిస్తారనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.

తమిళనాడుపై BJP స్పెషల్​ ఫోకస్- అన్నామలై​ మ్యాజిక్​ పనిచేస్తుందా? డబుల్​ డిజిట్ సాధ్యమేనా? - Tamil Nadu BJP Chief K Annamalai

తమిళనాడులో బీజేపీ జోరు- అన్నామలై రాకతో మారిన సీన్​ - bjp growth in tamil nadu

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.