ETV Bharat / bharat

పరీక్ష కేంద్రాల వారీగా NEET ఫలితాలు ప్రకటించండి: సుప్రీం కోర్టు - NEET UG Paper Leak Case

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 12:39 PM IST

Updated : Jul 18, 2024, 5:08 PM IST

SC On NEET UG 2024 : పరీక్ష కేంద్రం, నగరాల వారీగా నీట్‌ యూజీ వాటి ఫలితాలు ప్రకటించాలని ఎన్‌టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతకుముందు నీట్​ పరీక్షలో కచ్చితంగా విస్తృత పరిధిలో అక్రమాలు జరిగాయని తేలితేనే రీటెస్ట్​కు ఆదేశిస్తామని స్పష్టం చేసింది.

NEET UG Paper Leak Case
NEET UG Paper Leak Case (ETV Bharat,ANI)

SC On NEET UG 2024 : నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై విచారణ జరుపుతున్న భారత సర్వోన్నత న్యాయస్థానం పరీక్ష కేంద్రం, నగరాల వారీగా వాటి ఫలితాలు ప్రకటించాలని ఎన్‌టీఏను గురువారం ఆదేశించింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు వాటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని పేర్కొంది. నీట్‌- యూజీ సంబంధిత పిటిషన్‌లను జులై 22న తిరిగి విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల వివరాలు కనిపించకుండా చూడాలని సూచించింది.

అంతకుముందు విస్తృత స్థాయిలో అక్రమాలు జరిగాయని(లీక్ అయ్యిందని) గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశించగలమని కోర్టు స్పష్టం చేసింది. అలాగే పిటిషనర్లకు వచ్చిన కనీస మార్కులపై సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సొలిసిటర్ జనరల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, కేవలం 131 మంది విద్యార్థులు మాత్రమే రీటెస్ట్‌ కోరుతున్నారు.

తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు!
సామాజిక పరిణామాల దృష్ట్యా నీట్ పరీక్షకు సంబంధించిన పిటిషన్ల విచారణకు తాము ప్రాముఖ్యం ఇస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ వ్యవహారంలో కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందోనని లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారని సీజేఐ అన్నారు. అలాగే పిటిషనర్లు, నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి మరింత సమాచారాన్ని అడిగారు. 'మొత్తంగా మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి? పిటిషన్లు వేసిన విద్యార్థులు నీట్​ పరీక్షలో పొందిన కనీస మార్కులు ఎన్ని? అసలు ఎంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు?' అని న్యాయవాదుల్ని ప్రశ్నించారు.

"పరీక్ష రాసిన 23 లక్షల మందిలో, ఒక లక్ష మంది మాత్రమే వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందుతారు. విస్తృతస్థాయిలో పేపర్ లీక్ జరిగిందని తేలితే కచ్చితంగా రీటెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీనిపై సీబీఐ విచారణ జరుగుతోంది. మాకు దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాలు బయటపెడితే, కచ్చితంగా దర్యాప్తుపై ప్రభావం పడుతుంది" అని అన్నారు.

ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్‌ లీక్‌ అయ్యిందని, అలాగే పరీక్ష నిర్వహణలోనూ అవకతవకలు జరిగాయని వార్తలు రావడం వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. నీట్​ ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నీట్‌ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్‌ మార్కులు కలపడం, ఓఎంఆర్‌ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోంది.

పూరీ రత్నభాండాగారం రీఓపెన్- ఆభరణాలన్నీ బయటకు!

8వ తరగతిలో స్కూల్​కు గుడ్​బై- 15 ఏళ్లకే స్టార్టప్ కంపెనీకి CTO- ఉదయ్ శంకర్ కథ తెలుసా? - AI Startup Uday Shankar

Last Updated : Jul 18, 2024, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.