Death Threat Calls To Salman Khan : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.2కోట్లు ఇవ్వాలని, లేదంటే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తి ముంబయి ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ పంపాడు. దీంతో వర్లీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. లారెన్స్‌బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో హత్యకు గురైన బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్‌సిద్ధిఖీని చంపేస్తామని బెదిరించిన 20ఏళ్ల గుఫ్రన్‌ను అరెస్టు చేసిన కాసేపటికే ఈ పరిణామం జరిగింది.
VIDEO | Visuals from outside Galaxy Apartment, the residence of Bollywood actor Salman Khan. Salman Khan received another death threat. The threat message was received by the Mumbai Police. More details are awaited.
— Press Trust of India (@PTI_News) October 30, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/o1eJflT6MA
అసలేం జరిగిందంటే?
తమకు రూ.5కోట్లు ఇవ్వాలని, లేదంటే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, ఎన్సీపీ నాయకుడు జీషన్ సిద్ధిఖీని చంపేస్తామని ఇటీవల బెదిరింపులకు దిగాడు ఓ వ్యక్తి. ఈ ఘటనపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నోయిడాలో కాల్ చేసి బెదిరింపులకు పాల్పడిన నిందితుడు గుఫ్రన్ ఖాన్ని మంగళవారం అరెస్టు చేశారు. అంతలోనే గుర్తు తెలియని వ్యక్తి నుంచి ముంబయి ట్రాఫిక్ పోలీసులకు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని మరోసారి బెదిరింపులు రావడం గమనార్హం.
సల్మాన్‌కు వరుసగా బెదిరింపులు
గతంలోనూ సల్మాన్ ఖాన్‌కు పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. తాము కోరిన డబ్బులు ఇవ్వకపోతే సల్మాన్ చంపేస్తామని హెచ్చరించారు దుండగులు. కొన్నాళ్ల క్రితం కూడా సల్మాన్ ఖాన్‌ను చంపుతామని ముంబయి ట్రాఫిక్ పోలీసులకు సందేశం పంపిన షేక్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సైతం పలుమార్లు సల్మాన్ ను హతమారుస్తామని హెచ్చరించింది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు
గతేడాది రెండుసార్లు సోషల్ మీడియా, ఈ-మెయిల్స్ ద్వారా సల్మాన్‌కు బెదిరింపు హెచ్చరికలు పంపింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. చివరిసారిగా 2023 నవంబర్‌లో 'మరణానికి వీసా అవసరం లేదు' అంటూ సల్మాన్‌ను హెచ్చరించింది. తమకు పూజ్యనీయమైన కృష్ణజింకలను వేటాడినందుకు సల్మాన్ ఖాన్‌ను చంపుతామని ఇప్పటికే ప్రకటించింది. బిష్ణోయిల మందిరానికి వెళ్లి క్షమాపణలు చెబితే వదిలేస్తామని స్పష్టం చేసింది. ఇటీవలే ఎన్సీపీ నేత, సల్మాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసింది. అలాగే సల్మాన్‌కు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండాలని పలువురికి బెదిరింపు సందేశాలు పంపింది.