Road Accident In Bihar : బిహార్ కైమూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మోహానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి (ఎన్‌హెచ్-2)లో ఉన్న దేవకాలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ టీం సాయంతో మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం దగ్గర్లోని భబువా సదర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
బైక్ రైడర్‌ను రక్షించబోయి
'మోహానియా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం స్కార్పియో నడుపుతున్న డ్రైవర్ ఎదురుగా ఉన్న బైక్‌ను తప్పించే క్రమంలో అదుపు తప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న భారీ కంటైనర్‌ను ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో బైక్ రైడర్ కూడా ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించాము. ఈ దుర్ఘటనతో ఎన్‌హెచ్‌పై ట్రాఫిక్ స్తంభించింది. ముందుగా దానిని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాము' అని మోహానియా ఎస్డీపీఓ దిలీప్ కుమార్ తెలిపారు. మృతులకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో సంబంధిత స్టేషన్ పోలీసులు నిమగ్నమయినట్లు ఆయన చెప్పారు.
హరిద్వార్ వెళ్తుండగా ప్రమాదం- 24 మంది మృతి
Uttar Pradesh Accident : శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది చనిపోయారు. పలువురు గాయాల పాలయ్యారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, 13 మంది మహిళలు ఉన్నారు. యాత్రికులను తీసుకెళ్తున్న ఒక ట్రాక్టర్ చెరువులో పడిపోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. యాత్రికులంతా హరిద్వార్ వెళ్తుండగా కాస్‌గంజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ ట్రాలీలో 35 నుంచి 40 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
INLD పార్టీ అధ్యక్షుడిపై కాల్పులు- నఫే సింగ్ సహా కార్యకర్త మృతి
రూ.49కే 48 గుడ్లంటూ ఆఫర్- లింక్‌పై క్లిక్ చేస్తే క్షణాల్లో రూ.48వేలు మాయం!