Renuka Swamy Murder Case Forensic Report: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక పోలీసులకు అందింది. ఈ నివేదికను చూస్తే నిందితుల ఏ విధంగా క్రూరంగా వ్యవహరించారో తెలుస్తోందని సిట్ అధికారులు తెలిపారు. న్యాయస్థానంలో దాఖలు చేయనున్న అభియోగపత్రంతో పాటు ఈ రిపోర్ట్‌ను పొందుపరుస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఫోరెన్సిక్ నివేదిక పేర్కొన్న విషయాలు
రేణుకాస్వామికి ఛాతీపై కొట్టడం వల్లే ఎముక విరిగి, ఊపిరితిత్తికి గుచ్చుకుందని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు.'తలకు తీవ్ర గాయాలు కావడం వల్ల మెదడులో రక్తస్రావం జరిగింది. ప్రమాద స్థలంలో ఉంచిన మినీ లారీకి రేణుక స్వామి తలను తీసుకువెళ్లి కొట్టడం వల్ల తలకు, వెన్నుపూసకు గాయాలయ్యాయి. కాలితో తన్నడం వల్ల మర్మావయాలకు తీవ్రగాయాలై, రక్తస్రావం కనిపించింది. మోకాలు విరిగింది. కుడి కన్ను పూర్తిగా దెబ్బతింది. చిత్రహింసలకు తాళలేక, శరీరం లోపల అవయవాలకు గాయాలు కావడం వల్లే అతను మరణించాడు' అని ఫోరెన్సిక్ నిపుణులు తమ నివేదికలో పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం రిపోట్తో మృతదేహాన్ని పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక రూపొందించారు.
హస్య నటుడికి నోటీసులు
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో రెండో నిందితుడుగా సినీ కథానాయకుడు దర్శన్ ఉన్నాడు. హత్య తర్వాత దర్శన్‌తో కలిసి చర్చలు జరిపిన కర్ణాటక హాస్య నటుడు చిక్కణ్ణకు విచారణకు హాజరు కావాలని ప్రత్యేక దర్యాప్తు దళం నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత కామాక్షిపాళ్యలోని బార్ అండ్ రెస్టారెంటులో దర్శన్, అతని స్నేహితులతో చిక్కణ్ణ సమావేశమయ్యాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకసారి ఆయనను పోలీసులు విచారించారు. అయితే తనతో సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే దర్శన్ చర్చించారని ఆయన స్పష్టం చేశారు. అభియోగపత్రాన్ని దాఖలు చేయనున్న నేపథ్యంలో మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే రేణుకాస్వామి హత్య అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు తాను మరో నిందితుడికి రూ.30 లక్షలు ఇచ్చినట్లు విచారణలో దర్శన్ అంగీకరించాడు.
నోట్లో ఎముకలు, బిర్యానీ కుక్కి కరెంట్ షాక్- పవిత్ర కళ్లముందే దర్శన్ చిత్రహింసలు