ETV Bharat / bharat

'రామేశ్వరం కేఫ్​లో జరిగింది బాంబ్​ బ్లాస్టే'- సీఎం వెల్లడి- రంగంలోకి NIA - Karnataka Cafe Blast News

Rameshwaram Cafe Blast : కర్ణాటక బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్​లో జరిగిన ప్రమాదాన్ని బాంబు పేలుడుగా తేల్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు రాష్ట్ర డీజీపీ అలోక్‌ మోహన్‌ ప్రకటించారు. బాంబు పేలుడు వెనుక ఉన్న బాధ్యులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. ఈ పేలుడు గురించి ఎన్​ఐఏ, ఐబీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు డీజీపీ వెల్లడించారు.

CM On Rameshwaram Cafe Blast
CM On Rameshwaram Cafe Blast
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 9:03 PM IST

Updated : Mar 1, 2024, 10:40 PM IST

Rameshwaram Cafe Blast : కర్ణాటక బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్​లో జరిగిన ఘటనను బాంబు పేలుడుగా తేల్చారు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య. ఓ యువకుడు కేఫ్‌లోకి వచ్చి ఓ బ్యాగు పెట్టి కౌంటర్‌లో టోకెన్‌ తీసుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందన్నారు. పోలీసులు కేఫ్​ క్యాషియర్‌ను ప్రశ్నిస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్ధరామయ్య అన్నారు. అయితే ఈ ఘటనను రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు సీఎం. బీజేపీ ప్రభుత్వంలోనూ పేలుడు జరిగిందని గుర్తుచేశారు.

అయితే దీనిని తక్కువ తీవ్రత కలిగిన బాంబుగా గుర్తించామని చెప్పారు పోలీసు ఉన్నతాధికారులు. పేలుడు జరిగిన సమయంలో కేఫ్​లో దాదాపు 40 మంది వరకు ఉన్నారని, ఈ ప్రమాదంలో హోటల్​ సిబ్బంది సహా 10 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరు సిబ్బంది కాగా మిగతావారు కస్టమర్లని చెప్పారు. అయితే ఎవరు కూడా తీవ్రంగా గాయపడలేదన్నారు. బ్యాగులో ఉన్న వస్తువు పేలడం వల్లే ఆ ఘటన జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరోవైపు ఫోరెన్సిక్‌ బృందాలు ఐఈడీ కారణంగానే ఆ పేలుడు సంభవించిందా అన్న విషయాన్ని నిర్ధరించేందుకు నమూనాలు సేకరిస్తున్నాయని రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర వెల్లడించారు. ఫోరెన్సిక్‌ నివేదిక కోసం వేచి చూస్తున్నామని చెప్పారు.

'సిలిండర్‌ లీక్​ వల్ల బ్లాస్ట్​ జరగలేదు'
కేఫ్​లో ఆరుగురు కస్టమర్లతో కలిసి కూర్చున్న ఓ మహిళ వెనకాల పేలిపోయిన హ్యాండ్‌బ్యాగ్‌ పడి ఉందని అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ వెల్లడించారు. బ్యాగ్‌లోని అనుమానిత పదార్థం వల్లనే ఈ పేలుడు జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్లు ఆయన చెప్పారు. సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అవ్వడం వల్ల పేలుడు జరగలేదన్న దానిపై ఓ స్పష్టతకు వచ్చినట్లు అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ తెలిపారు. ఎక్కడా కూడా సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అయిన ఆనవాళ్లు లేవన్నారు. టీ, కాఫీ తయారీకోసం వాడే మరో గ్యాస్‌ సిలిండర్‌ను కూడా పరిశీలించినట్లు చెప్పారు. దాని నుంచి కూడా ఎటువంటి గ్యాస్‌ లీక్‌ జరగలేదని అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ స్పష్టం చేశారు.

మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పేలుడు జరిగినట్లు రామేశ్వరం కేఫ్​ నుంచి పోలీసులకు సమాచారం అందినట్లు కర్ణాటక డీజీపీ అలోక్‌ మోహన్‌ తెలిపారు. ఫోరెన్సిక్‌ బృందాలు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. బెంగళూరు పోలీసు కమిషనర్‌, ఇతర అధికారులు ప్రమాదస్థలంలోనే ఉండి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. బాంబు పేలుడుకు బాధ్యులెవరో త్వరలోనే తేలుస్తామన్నారు.

రంగంలోకి దర్యాప్తు బృందాలు
బాంబు ప్రమాద ఘటన గురించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హోంశాఖ మంత్రి పరమేశ్వరకు సమాచారం ఇచ్చినట్లు డీజీపీ తెలిపారు. ఫోరెన్సిక్‌ బృందాలు పూర్తిగా నిర్ధారణకు వచ్చాక అన్ని అంశాలపై ఓ స్పష్టత వస్తుందని, ఘటనాస్థలంలో ఓ బ్యాటరీని స్వాధీనం చేసుకున్నట్లు మీడియా అడిగిన ప్రశ్నకు డీజీపీ సమాధానం ఇచ్చారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడ్డవారు ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇక కేఫ్‌లో పేలుడు విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. అగ్నిమాపక సిబ్బంది, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ)తో పాటు బాంబుస్క్వాడ్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), ఫోరెన్సిక్‌ నిపుణులూ రంగంలోకి దిగారు.

హోంమంత్రి పరామర్శ
రామేశ్వరం కేఫ్​లో పేలుడుపై కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్​ కూడా స్పందించారు. 'ఇది తక్కువ తీవ్రతతో జరిగిన పేలుడు. ఐఈడీలో టైమర్​ ఫిక్స్​ చేశారు. ఓ యువకుడు కేఫ్​లోకి వచ్చి పెట్టిన బ్యాగు గంట తర్వాత పేలింది. ఈ ఘటనలో దాదాపు 10 మందికి గాయాలయ్యాయి. ఘటనపై విచారణ కోసం 7 నుంచి 8 బృందాలను ఏర్పాటు చేశాం. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది. ఉపా చట్టంతో పాటు పేలుడు పదార్థాల చట్టం కింద కేసు కూడా నమోదైంది. ఈ ఘటనపై బెంగళూరు ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని డీకే అన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి జీ. పరమేశ్వరతో కలిసి ఘటనా స్థలిని పరిశీలించారు డీకే శివకుమార్​. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

బీజేపీ రియాక్షన్​
మరోవైపు బాంబు పేలుడు ఘటనపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో కాంగ్రెస్​ ప్రభుత్వం, పోలీసు ఇంటెలిజెన్స్​ విభాగం పూర్తి వైఫల్యం చెందిందని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీ వై విజయేంద్ర మండిపడ్డారు. కేఫ్‌ వ్యవస్థాపకుడు నాగరాజ్‌తో మాట్లాడినట్లు బెంగళూరు దక్షిణ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలిపారు. గ్యాస్‌ సిలిండర్ వల్ల బ్లాస్ట్​ జరగలేదని, ఓ కస్టమర్​ వదిలివెళ్లిన బ్యాగ్ వల్లే పేలుడు సంభవించిందని ఆయన తనకు తెలియజేసినట్లు చెప్పారు. ఇది బాంబు పేలుడు కేసేనని, దీనిపై సీఎం సమాధానం చెప్పాలని 'ఎక్స్‌' వేదికగా ఎంపీ డిమాండ్‌ చేశారు.

'వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వడగాల్పులు'- ఐఎండీ హెచ్చరిక

మోదీ మరోసారి ప్రధాని కావాలని సైకిల్ యాత్ర- 12 జ్యోతిర్లింగాల దర్శనానికి ముస్లిం యువతి ప్లాన్

Last Updated : Mar 1, 2024, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.