Ramayana On Saree West Bengal : అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో బంగాల్లోని నదియా జిల్లాకు చెందిన పికుల్‌రాయ్ ఏడాది పాటు శ్రమించి రామాయణ గాథను తెలిపే చీరను తయారుచేశాడు. ఈ చీరను భారీ ధరకు కొనేందుకు చాలా మంది ముందుకొచ్చినా విక్రయించేందుకు పికుల్‌రాయ్ అంగీకరించలేదు. ఈ చీరను సీతాదేవి పేరిట అయోధ్య రామాలయానికి కానుకగా ఇవ్వనున్నట్లు పికుల్ రాయ్ తెలిపాడు. తన సోదరుడుతో కలిసి చీరతో అయోధ్యకు బయలుదేరాడు.
రాణాఘట్కు చెందిన పికుల్ రాయ్‌కు చేనేత పరిశ్రమతో చాలా కాలంగా అనుబంధం ఉంది. అతనికి చీరల దుకాణం కూడా ఉంది. అతను ఒక ఏడాది క్రితం రామాయణ కథను వివరించే చీరను తయారు చేయడం ప్రారంభించాడు. ఈ చీరపై రాముడు, సీతతో పాటు, వారి వనవాసం కథను కూడా చిత్రీకరించాడు. 'ఏడాది క్రితం చీరపై రామాయణ కథను చిత్రీకరించాలనే ఆలోచన వచ్చింది. అందుకు చీరను తయారుచేశాను. చాలా మంది ఈ చీరను భారీ ధరకు కొనుగోలు చేయాలనుకున్నారు. కానీ ఈ చీరను సీతాదేవి పేరిట అయోధ్యలోని రామమందిరానికి కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను.' అని పికుల్ రాయ్ అన్నారు.
రామాయణ గాథను చీరపై తన సోదరుడు తీర్చిదిద్దడంపై అనంత్ రాయ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆ చీరను రామాలయానికి కానుకగా ఇస్తామని చెప్పారు. అందుకే తాను కూడా సోదరుడికి తోడుగా అయోధ్యకు వెళ్తున్నానని అన్నారు. పికుల్ రాయ్, అతడి సోదరుడు అనంత రాయ్ శుక్రవారం రాత్రి హబీబ్‌పుర్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకు బయలుదేరారు.
468ఏళ్ల క్రితం పర్షియన్ రామాయణం
468 ఏళ్ల క్రితం పర్షియన్ భాషలోకి అనువదించిన రామాయణం తాజాగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని గంగాదాస్ స్కూల్లో ఈ రామాయణ పుస్తకం లభ్యమైంది. అక్బర్ కాలంలో చేతిరాతతో పర్షియన్ భాషలోకి అనువదించిన రామాయణం ఇది. అంతేగాక ఈ ప్రదేశంలోనే ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారితో పోరాడుతూ వీరమరణం పొందడం గమనార్హం. మొఘల రాజు అక్బర్ గ్వాలియర్ వచ్చినప్పుడు గంగాదాస్ పాఠశాలలోని మహంత్ వద్ద విద్యను అభ్యసించాడని రామసేవక్ మహారాజ్ చెప్పారు. ఆ తర్వాత అక్బర్ దీన్-ఈ-ఇలాహి మతాన్ని స్థాపించారని చెప్పారు. 468 ఏళ్ల నుంచి ఈ రామాయణం గంగాదాస్ స్కూల్లో భద్రంగా ఉందని అన్నారు.
సైక్లింగ్, వాకింగ్, స్కేటింగ్- అయోధ్యకు భక్తుల సాహసయాత్రలు- ఇతర మతస్థులు కూడా!
అయోధ్య రాముడి కోసం మోదీ ఉపవాసం- కొబ్బరి నీళ్లు సేవిస్తూ, నేలపై నిద్రిస్తూ కఠోర దీక్ష