Ram Mandir Special Guest List : సోమవారం కన్నులపండవగా జరిగే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను అతిథులుగా ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులు సుమారు 8,000 మంది పేర్లతో జాబితాను సిద్ధం చేసింది. అందులో 506 మందిని అత్యంత ప్రముఖులుగా ఎంపిక చేసింది. ఆ ముఖ్య అతిథుల్లో ఎవరేవరు ఉన్నారంటే?
రాజకీయ నాయకులు
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు జెేపీ నడ్డా, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ, బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి, యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్ కుటుంబం, మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, రంజన్ భట్టాచార్య (మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయీ అల్లుడు), మాజీ రాష్ట్రపతులు రామ్‌నాథ్ కోవింద్, ప్రతిభా భారతి, మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ కుటుంబం, ప్రణాళికాసంఘం మాజీ ఛైర్‌పర్సన్ మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా, లోక్‌సభ మాజీ స్పీకర్లు సుమిత్రా మహాజన్, మీరాకుమార్. మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, హెచ్‌డీ కుమారస్వామి, ఉమాభారతి.
న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎన్‌వీ రమణ, వీరితో పాటు పలువులు మాజీ న్యాయమూర్తులు ఉన్నారు. ఇస్రో ఛైర్‌పర్సన్ ఎస్ సోమనాథ్, మాజీ ఛైర్‌పర్సన్ కె శివన్, సుదర్శన్ శర్మ (డీఆర్డీవో), ఇస్రో సంచాలకుడు నీలేశ్ దేశాయ్, ఇ శ్రీధరన్ (మెట్రో)
పారిశ్రామికవేత్తలు
రతన్ టాటా, ముకేశ్ అంబానీ కుటుంబం, ఎన్ చంద్రశేఖరన్ దంపతులు, గౌతమ్ అదానీ, మైనింగ్ మొగల్ అనిల్ అగర్వాల్, అశోక్ హిందూజ, అజీం ప్రేమ్‌జీ, 'బాంబే డైయింగ్' నుస్లీ వాడియా, సుధీర్ మెహతా, జీఎంఆర్ రావు, స్థిరాస్తి వ్యాపారి నిరంజన్ హిరానందని, కుమారమంగళం బిర్లా దంపతులు, అజయ్ పిరమల్, ఆనంద్ మహీంద్ర, కె కీర్తివాసన్ (టీసీఎస్), నవీన్ జిందాల్, ఉదయ్ కోటక్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులు, నందన్ నీలేకని, టి.వి.మోహన్‌దాస్ పాయ్.
సినీ ప్రముఖులు
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, మోహన్‌లాల్, ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, అక్షయ్‌కుమార్, అనుపమ్‌ఖేర్, అజయ్ దేవగణ్, కంగనా రనౌత్, మాధురీ దీక్షిత్, హేమామాలిని (బీజేపీ ఎంపీ), సన్నీ దేవోల్ (బీజేపీ ఎంపీ), టీవీ రామాయణం 'రాముడు' అరుణ్ గోవిల్, 'సీత' దీపికా చిఖ్లియా.
ఇతర ప్రముఖులు
నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ దౌత్యవేత్తలు వీణా సీకరీ, లక్ష్మీ పురి, 'వందేభారత్' రైలు సూత్రధారి సుధాంశు మణి, జీ20 భారత ప్రభుత్వ ప్రతినిథి అమితాబ్ కాంత్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్.
కళాకారులు
సరోద్ విద్వాంసుడు అమ్జద్‌అలి ఖాన్, పాటల రచయిత మనోజ్ ముంతశిర్ దంపతులు, రచయిత ప్రసూన్ జోషి, సినీ దర్శకులు సంజయ్‌లీలా బన్సాలీ, మధుర్ భండార్కర్, గాయకులు శ్రేయా ఘోషల్, కైలాశ్‌ఖేర్, శంకర్ మహదేవన్, అనూప్ జలోటా, సోనూ నిగమ్, అనురాధా పౌఢ్వాల్.
క్రీడారంగం
సచిన్ తెందూల్కర్, కపిల్‌దేవ్, మహేంద్రసింగ్ ధోని, సునీల్ గావస్కర్, విరాట్ కోహ్లి, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహవాగ్, రవీంద్ర జడేజా, రోహిత్‌శర్మ, మిథాలీ రాజ్, విశ్వనాథన్ ఆనంద్, పి.టి.ఉష, ఫుట్‌బాలర్ బాయ్‌చుంగ్ భూటియా, సైనా నెహ్వాల్, పీవీ సింధు, పుల్లెల గోపీచంద్, వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి.
దశావతారాలు, హనుమ, గరుడ- బాలరాముడి విగ్రహం ప్రత్యేకతలివే!
రాముడికి కానుకగా 400 కేజీల తాళం- రూ.1.65 లక్షల రామాయణం ప్రదర్శన