ETV Bharat / bharat

కాపర్​ మైన్​లో చిక్కుకున్న కార్మికులు- 14 మంది సేఫ్, ఒకరు మృతి - Rajasthan Lift Collapse News - RAJASTHAN LIFT COLLAPSE NEWS

Rajasthan Lift Collapse News : రాజస్థాన్‌లోని కొలిహాన్​ రాగి గనిలో చిక్కుకున్న 15 మంది కార్మికులను రెస్క్యూ టీమ్ బయటకు తీసింది. వీరిలో ఒకరు మరణించారు. మిగతా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరెవరికీ ఎవరికీ ప్రాణభయం లేదని వైద్యులు చెప్పారు.

Rajasthan Mine collapse
Rajasthan Lift Collapse News (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 7:41 AM IST

Updated : May 15, 2024, 12:40 PM IST

Rajasthan Lift Collapse News : రాజస్థాన్​లోని కొలిహాన్​ రాగి గనిలో చిక్కుకున్న 15 మంది కార్మికులను రెస్క్యూ టీమ్​​ బయటకు తీసింది. వీరిలో ఒకరు మృతి చెందగా, మిగతా 14 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారని జిల్లా కలెక్టర్​ నీమ్​కథానా శరద్​ మెహ్రా తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీళ్లకు చేతులు, కాళ్లపై స్వల్ప గాయాలు అయ్యాయని, ప్రాణభయం లేదని వైద్యులు తెలిపారు.

ఇంతకీ ఏమైందంటే?
HCL Copper Mine Lift Collapse : హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్-HCLకు చెందిన రాగి గనిలో మంగళవారం రాత్రి సుమారు 8 గంటలకు కార్మికులు గనిలోంచి బయటకు వస్తుండగా, లిఫ్ట్ తెగిపోయింది. దీనితో 15 మంది కార్మికులు 1875 అడుగుల లోతులో చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారికి ఔషధాలు, ఆహారం ప్యాకెట్లు అందించారు. గనిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు కోల్​కతాకు చెందిన ఎస్​బీఆర్​ఎఫ్ బృందం ఖేత్రీకి వచ్చింది. ఎన్​డీఆర్​ఎఫ్ బృందం కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంది. ఈ రెస్యూ బృందాలు రెండూ కలిసి అనేక గంటలపైపాటు కష్టపడి 15 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. కార్మికులు అందరూ సురక్షితంగా బయటకు రావడం పట్ల, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, సహోద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ చర్యలు
HCL Copper Mine Rescue Operation : ఇంతకు ముందు, రాగి గనిలో కార్మికులు చిక్కుకున్న విషయం తెలుసుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్​ లాల్​ శర్మ, సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్ నీమ్‌కథానా శరద్ మెహ్రా, ఎస్పీ ప్రవీణ్ కుమార్ నాయక్ నునావత్, సీఎంహెచ్‌ఓ వినయ్ గెహ్లావత్ సహా పలువురు అధికారులు, వైద్యులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అత్యవసర సహాయం కోసం అంబులెన్స్​లను సిద్ధం చేశారు. మరోవైపు ఘటనపై ఆందోళన కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ వ్యక్తం చేశారు. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

'ఓటింగ్ లెక్కలు మరింత క్లియర్​గా చెప్పండి​- పోలింగ్​ జరిగిన 48 గంటల్లోపే!' - Lok Sabha Election 2024

'రెండేళ్ల యూకే గ్రాడ్యుయేట్ వీసాను కొనసాగించాల్సిందే'- విదేశాలకు వెళ్లే విద్యార్థులకు గుడ్​ న్యూస్​ - UK Graduate Visa

Last Updated : May 15, 2024, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.