Vande Bharat Sleeper Coach Prototype Unveiled : వందే భారత్ స్లీపర్ రైళ్లను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రొటోటైప్ వెర్షన్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆవిష్కరించారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఎమ్‌ఈఎల్) ఫెసిలిటీలో వీటిని ప్రారంభించారు. బీఎమ్‌ఈఎల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వందే భారత్ తయారీ కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
వందే భారత్ చైర్ కార్ విజయవంతమైన తర్వాత, వందే భారత్ స్లీపర్ తయారీ ఇప్పుడే పూర్తయిందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పది రోజుల పాటు వీటిపై కఠినమైన ట్రయల్స్, టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇవి మరిన్ని పరీక్షల కోసం పట్టాలెక్కనున్నాయి. ఈ పరీక్షలు విజయవంతమైతే వీటి ఉత్పత్తి ప్రారంభంకానుంది. ఏడాదిన్నర తర్వాత నెలకు రెండు నుంచి మూడు చొప్పున వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.
#WATCH | Bengaluru, Karnataka | Railway Minister Ashwini Vaishnaw says, " a lot of things have been taken care of in this coach...four trains, vande chair car, vande sleeper, vande metro and amrit bharat have been designed in a way to address many things, like modern technology,… https://t.co/e8YI0nDmEW pic.twitter.com/dq2UwMxY0j
— ANI (@ANI) September 1, 2024
వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సికింద్రాబాద్ టు విశాఖ రూట్లో మరో స్టాప్