Rahul Gandhi Fires On BJP : గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న 56 అంగుళాల ఛాతీ ఇప్పుడు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మన్‌కీ బాత్ గురించి మాట్లాడే ప్రధాని, కామ్ కీ బాత్(పని) గురించి ఎప్పుడు మాట్లాడతారని ప్రశ్నించారు. 25మంది వ్యాపారవేత్తల కోసం రూ.16లక్షల కోట్లు మాఫీ చేశారని ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌లో లెఫ్టినెంట్ గవర్నరే రాజు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన జమ్ముకశ్మీర్ వ్యక్తి కాదని, ఔట్‌సైడర్ అని చెప్పారు. ఇక్కడి ప్రజలు కోరుకునే అభివృద్ధిని ఆయన చేయలేడని, ఇక్కడి పరిస్థితుల గురించి గవర్నర్‌కు ఏం తెలియదని అన్నారు. మోదీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్ ప్రజల హక్కులను హరించిందని ధ్వజమెత్తారు. పూంఛ్ జిల్లాలోని సూరన్కొటె, శ్రీనగర్ జిల్లాలోని జైన్కొటెలో సోమవారం జరిగిన ఎన్నికల సభల్లో రాహుల్ మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
"బీజేపీ, ఆర్ఎస్ఎస్ సభ్యులు జమ్ముకశ్మీర్, ఇతర రాష్ట్రాల్లో 24/7 ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. వారు ఎక్కడి వెళ్లినా, సోదరులను ఒకరిపైకి ఒకరిని ఉసిగొల్పుతున్నారు. ఇదీ వారి పని. వారి రాజకీయాలు ద్వేషంపై ఆధారపడి ఉంటాయి. ఒకవైపు ద్వేషాన్ని వ్యాపింపజేసే వ్యక్తులు, మరోవైపు 'మొహబ్బత్ కీ దుకాణాలను తెరిచే వారు ఉన్నారు. గతంలో మోదీకి 56 అంగుళాల ఛాతీ ఉండేది. అది ఇప్పుడు లేదు"
--రాహుల్ గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు
VIDEO | Jammu and Kashmir elections: " bjp and rss members spread hatred and violence 24="" 7 in jammu and kashmir and other states. wherever they go, they pit brothers against each other. this is their work, and their politics is based on hatred. this hatred can only be countered… pic.twitter.com/WM5WjAZsBD
— Press Trust of India (@PTI_News) September 23, 2024
'అన్యాయంగా యూటీ చేశారు'
భారత్‌లో కేంద్ర పాలిత ప్రాంతాలు(యూటీ) రాష్ట్రాలుగా మారాయని తెలిపారు రాహుల్. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, బిహార్ నుంచి ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పాటు అయ్యాయని అన్నారు. అయితే, భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని యూటీ చేయడం జరగలేదన్నారు. కానీ మొట్టమొదటి సారి ఓ రాష్ట్ర ప్రజల హక్కులను హరించి యూటీ చేశారని మండిపడ్డారు. జమ్ముకశ్మీర్ ప్రజలు అన్యాయానికి గురయ్యారని చెప్పారు.
'పార్లమెంట్ జమ్ముకశ్మీర్ ప్రజల వాయిస్ వినిపిస్తా'
పార్లమెంట్లో జమ్ముకశ్మీర్ ప్రజల వాణి వినిపిస్తానని, రాష్ట్ర హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని రాహుల్ అన్నారు. అవసరముంటే, ఆర్డర్ వేయగానే ప్రత్యక్షమవుతానని అన్నారు. "రాష్ట్ర హోదా పునరుద్ధరించడం ఇక్కడి ప్రజలకు అదిపెద్ద సమస్య. బీజేపీ చేయకున్నా(ఎన్నికల తర్వాత) ఆ పని మేము చేస్తామని గ్యారెంటీ ఇస్తున్నా. దేశవ్యాప్తంగా బీజేపీ హెచ్ఎమ్టీ వంటి అనేక కంపెనీలను ముసేసింది. సామాన్యులను పట్టించుకోకుండా, 25మంది వ్యాపారవేత్తలకు, రూ.16లక్షల కోట్లు మాఫీ చేసింది. కానీ పేదలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలకు చేయలేదు. తప్పుల తడకగా ఉన్న జీఎస్టీతో అనేక, చిన్న మధ్యతరగతి పరిశ్రమనలు మూతపడటానికి కారణమైంది. ఫలితంగా ఇక్కడి వారితో సహా యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఇది నరేంద్ర మోదీ గిఫ్ట్. ప్రధాని, మన్‌కీ బాత్‌లో అర్థం లేని సుదీర్ఘ ప్రసంగాలు ఇస్తారు, కానీ ప్రజల సమస్యలు పట్టించుకోరు. కామ్ కీ బాత్ మాట్లాడరు. ఇకపై ఎవరూ మోదీ మన్‌కీ బాత్ వినరు." అని రాహుల్ అన్నారు.
'లాల్ చౌక్‌లో ఐస్‌క్రీం తినడం- మీ హయాంలో సాధ్యమయ్యేదా రాహుల్?'
రాహుల్, శ్రీనగర్‌కు వచ్చినప్పుడల్లా, తన చెల్లెలు, స్నో బాల్స్‌తో ఆడుకుంటారని, లాల్ చౌక్‌లో ఐస్ క్రీం తింటారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇది సాధ్యమయ్యేదా అంటూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రశ్నించారు. వాళ్లు ద్వేషాన్ని వ్యాప్తి చేయడం వల్ల 30ఏళ్లు జమ్ముకశ్మీర్ ఉగ్రవాద నీడలో ఉందని ఆరోపించారు. ఇప్పుడు ఆ పరిస్థితిని ప్రధాని మోదీ మార్చారని అన్నారు.
#WATCH | Kathua, Jammu and Kashmir: On the statement of Congress MP Rahul Gandhi, Union Minister Jitendra Singh says, " you should ask him this question that when he goes to srinagar and makes snowballs and plays with his sister, goes to lal chowk and eats ice cream, was it… pic.twitter.com/Cgp2EhyKZw
— ANI (@ANI) September 23, 2024
దిల్లీ రామాయణం! పక్కన ఖాళీ కుర్చీతో ముఖ్యమంత్రిగా ఆతిశీ ఛార్జ్ - Atishi assumes charge as Delhi CM