Rahul Gandhi On Lateral Entry : లేటరల్ ఎంట్రీ పేరుతో దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లను బీజేపీ లాక్కుంటోందని కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ఆరోపించారు. ఉన్నతోద్యోగాలను దొడ్డిదోవన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఇస్తోందని పేర్కొన్నారు. బీజేపీ రామరాజ్యం పేరుతో రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోందని మండిపడ్డారు.
"బీజేపీ రామరాజ్యం పేరుతో రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి దళితులు, ఓబీసీలు, ఆదివాసీల నుంచి రిజర్వేషన్లు లాక్కోవాలని చూస్తోంది" - రాహుల్ గాంధీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత
Lateral entry is an attack on Dalits, OBCs and Adivasis.
— Rahul Gandhi (@RahulGandhi) August 19, 2024
BJP’s distorted version of Ram Rajya seeks to destroy the Constitution and snatch reservations from Bahujans.
కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి
రాహుల్ ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ లేటరల్ ఎంట్రీ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ప్రత్యారోపణలు చేశారు. లేటరల్ ఎంట్రీ నియామకాల్లో పాటించే నిబంధనలను ఉటంకించారు. ఈ విధానంలోనూ రిజర్వేషన్లను కచ్చితంగా పాటించాలంటూ 2020లో కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఓ మెమోను కూడా ఆయన పోస్టు చేశారు.
"ఉన్నత ఉద్యోగాల్లో లేటరల్ ఎంట్రీపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని సూచిస్తున్నాయి. ఈ విధానాన్ని తీసుకొచ్చింది గత యూపీఏ ప్రభుత్వమే. 2005లో వీరప్ప మొయిలీ అధ్యక్షతన నియమించిన రెండో ఎస్సార్సీ సైతం ఈ విధానాన్ని బలంగా సమర్థించింది. దాన్ని అమలు చేసేందుకు ఎన్‌డీయే ప్రభుత్వం పారదర్శక విధానాన్ని తీసుకొచ్చింది" అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
Lateral entry
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 18, 2024
INC hypocrisy is evident on lateral entry matter. It was the UPA government which developed the concept of lateral entry.
The second Admin Reforms Commission (ARC) was established in 2005 under UPA government. Shri Veerappa Moily chaired it.
UPA period ARC…
రాహుల్ గాంధీ 'లేటరల్ ఎంట్రీ'పై చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారమే చెలరేగుతోంది. లేటరల్ ఎంట్రీ పద్ధతిలో 45 మంది సంయుక్త కార్యదర్శులు, ఉపకార్యదర్శులు/ డైరెక్టర్ల నియామకానికి యూపీఎస్సీ ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించింది. దీన్ని రాహుల్‌గాంధీ తప్పుపట్టారు. ఇది జాతి వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల రిజర్వేషన్లను బీజేపీ లాక్కోవాలని చూస్తోందని ఆరోపించారు. ఉన్నతస్థానాల్లో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం దక్కడం లేదని, దీన్ని మెరుగుపరిచే బదులు, లేటరల్ ఎంట్రీ ద్వారా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఆ పదవులను కట్టబెట్టాలని చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఈ విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, కానీ ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని బీజేపీ అంటోంది.
పార్టీలో ఎన్నో అవమానాలు- ఎవరు తోడుగా వస్తే వారితో వెళ్తా: చంపయీ - Champai Soren Letter