ETV Bharat / bharat

రాగులతో ఇలా పునుగులు చేశారంటే - పిల్లలు దుకాణం వైపు పోనేపోరు! - Ragi Punugulu recipe - RAGI PUNUGULU RECIPE

Ragi Pindi Punugulu : ఈ వేసవి సెలవుల్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో ఉన్నారంటే.. చిరుతిండి కోసం దుకాణం చుట్టూ తిరుగుతుంటారు. దానివల్ల డబ్బు దుబారా.. పైగా అన్​ హెల్దీ కూడా! అందుకే.. మీరే సూపర్ స్నాక్స్‌ తయారు చేశారంటే.. రుచికి రుచికి, ఆరోగ్యానికి ఆరోగ్యం దక్కుతాయి. ఇందుకోసం సూపర్ రెసిపీని తీసుకొచ్చాం!

Ragi Pindi Punugulu
Ragi Pindi Punugulu
author img

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 2:04 PM IST

Updated : May 1, 2024, 2:12 PM IST

Ragi Pindi Punugulu : సాయంత్రం వేళ స్నాక్స్ అనగానే.. అందరూ మైదాపిండి, గోధుమ పిండితో తయారయ్యే వంటకాల పేర్లే చెబుతుంటారు! కానీ.. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావని అంటుంటారు నిపుణులు. అందుకే.. మీ కోసం స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చాం. అవే రాగి పునుగులు! మామూలు పునుగులు అందరికీ తెలుసు. కానీ.. ఈ రాగి పునుగులు మాత్రం చాలా మందికి తెలియదు. ఈ పునుగులు రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివని నిపుణులు చెబుతున్నారు. మరి, ఇంకెందుకు ఆలస్యం? ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగి పునుగులను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :

  • రాగి పిండి- కప్పు
  • మినప పప్పు - 2 కప్పులు
  • తినేసోడా చిటికెడు
  • ఆయిల్‌
  • ఉల్లిపాయ ముక్కలు
  • జీలకర్ర టేబుల్‌ స్పూన్‌
  • కట్‌ చేసిన పచ్చిమిర్చి -4
  • నువ్వులు-టేబుల్‌ స్పూన్‌
  • ఉప్పు రుచికి సరిపడా

సమ్మర్ స్పెషల్ : నోరూరించే మునక్కాయ బిర్యానీ - ఇలా ప్రిపేర్​ చేయండి - కుమ్మేస్తారంతే! - Drumstick Biryani Recipe

రాగి పునుగులు తయారు చేసే విధానం :

  • ప్రిపేర్ చేయడానికి 3 గంటల ముందు మినపపప్పు నానపెట్టుకోవాలి.
  • తర్వాత మినపప్పును మిక్సిలో వేసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.
  • ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో, కప్పు రాగిపిండి, సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు పునుగుల మిశ్రమంలోకి.. జీలకర్ర, నువ్వులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, తినేసోడా చిటికెడు వేసుకుని బాగా మిక్స్‌ చేయాలి.
  • ఈ మిశ్రమం పునుగులు వేసుకునే పిండిలాగా కొద్దిగా జారుగా ఉండాలి. కాబట్టి, వాటర్‌ యాడ్‌ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఒక పాన్‌లోకి ఆయిల్‌ వేసుకుని నూనె బాగా వేడైన తర్వాత రాగి పిండిని పునుగులుగా వేసుకోవాలి.
  • పునుగులను చక్కగా డీప్ ఫ్రై అయిన తర్వాత బయటకు తీసుకోవాలి.
  • అంతే.. ఎంతో రుచికరమైన పునుగులు రెడీ అయిపోతాయి.
  • వీటిని మీ పిల్లలకు సాయంత్రం స్నాక్స్‌గా పెట్టారంటే.. మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయి ఈ రాగి పునుగులు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి!

రాగులతో లాభాలు :

  • రాగులలో కాల్షియం, ప్రొటీన్‌ పుష్కలంగా ఉంటాయి. దాదాపు 100 గ్రాముల రాగుల్లో 344మి.గ్రా కాల్షియం ఉంటుందట. ఒక కప్పు రాగి పిండిలో 10 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయని నిపుణులంటున్నారు.
  • కప్పు రాగి పౌడర్లో 16.1 గ్రాముల ఫైబర్‌ ఉంటుందట. కాబట్టి, బరువు తగ్గాలనుకునే తరచూ రాగులతో చేసిన ఆహార పదార్థాలను తినాలని సూచిస్తున్నారు.
  • అలాగే ఇందులో ఎముకలను బలంగా ఉంచే ఐరన్‌ కంటెంట్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది.

సమ్మర్‌లో జీర్ణ సమస్యలు వేధిస్తున్నాయా? సత్తుపిండితో ఈ రెసిపీలు ట్రై చేయండి! - Recipes With Sattu Atta

సూపర్ రెసిపీ : మసాలా ఎగ్ బుర్జీ - నషాళానికి తాకాల్సిందే! - MASALA EGG BHURJI

Last Updated : May 1, 2024, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.