QS World University Rankings 2024 : ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ అండ్ స్టడీస్ కోసం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. అందులో భారతదేశానికి చెందిన మూడు యూనివర్సిటీలు టాప్ 50లో చోటు దక్కించుకున్నాయి. అహ్మదాబాద్ (ఐఐఏం) టాప్ -25లో, బెంగళూరు(ఐఐఏం), కలకత్తా(ఐఐఏం)కు టాప్ 50లో చోటు దక్కాయి.
లండన్‌కు చెందిన ఉన్నత విద్యా విశ్లేషణల సంస్థ క్వాక్‌వారెల్లి సైమండ్స్ (QS) ప్రకటించిన ర్యాంకింగ్‌ల్లో భారత్‌కు చెందిన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, డెలవప్ మెంట్ స్టడీస్‌లో ప్రపంచవ్యాప్తంగా 20వ స్థానం దక్కించుకుంది. ఈ విభాగంలో భారత్‌లో అత్యున్నత ర్యాంకు సాధించిన యూనివర్సిటీ జేఎన్యూనే. చెన్నైలోని సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ డెంటిస్ట్రీ స్టడీస్‌లో ప్రపంచవ్యాప్తంగా 24వ స్థానంలో నిలిచింది.
QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 69 భారతీయ విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. గతేడాది 66 విశ్వవిద్యాలయాలు చోటు సాధించగా ఈ ఏడాది మరో మూడు అదనంగా స్థానం పొందాయి. భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో విద్యా రంగం ఒకటని క్యూఎస్ సీఈఓ జెస్సికా టర్నర్ అన్నారు. అయినా భారత్ విద్యారంగంలో గణనీయమైన పురోగతిని సాధిస్తుందని చెప్పారు. ముఖ్యంగా ఈ సంవత్సరం యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో సబ్జెక్టుల వారీగా భారతదేశం గణనీయమై పురోగతిని ప్రదర్శించిందని, ప్రతి పేపర్ సూచికలో 20 శాతం మెరుగుదలను సాధించిందని అన్నారు.
QS Ranking 2023 : గతేడాది(2023) క్వాకరెల్లి సిమండ్స్ (QS) ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ప్రఖ్యాత ఐఐటీ బాంబే అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచంలోనే అత్యున్నత 150 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో ఐఐటీ బాంబే 149వ స్థానాన్ని కైవసం చేసుకుందని QS వ్యవస్థాపకులు, సీఈఓ నుంజియో క్వాకరెల్లి వెల్లడించారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2,900 విశ్వవిద్యాలయాలు పోటీపడగా అందులో భారత్‌కు సంబంధించినవి 45 ఉన్నాయని వివరించారు. గత 9 ఏళ్లలో ఈ ర్యాకింగ్స్లో పోటీపడే సంస్థల సంఖ్య 297 శాతం పెరిగిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన విద్యను అందించే విద్యా సంస్థల ర్యాంకింగ్స్‌ను క్వాకరెల్లి సిమండ్స్ ఏటా ర్యాకింగ్స్‌ను ప్రకటిస్తుంది.
ఎన్నికల్లో గెలుపుపై చిలుక జోస్యం- జ్యోతిష్యులు అరెస్ట్ - Parrot Owner Held Predicted Poll
ఒకే కుటుంబం- 1200 మంది ఓటర్లు- అభ్యర్థులందరి చూపు ఆయనపైనే! - 1200 Voters In One Family In Assam