ETV Bharat / bharat

పూరీలో అపశ్రుతి- బాణసంచా పేలి ముగ్గురు భక్తులు మృతి- 30మందికి పైగా గాయాలు! - Puri firecracker explosion

author img

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 9:39 AM IST

Updated : May 30, 2024, 10:18 AM IST

Firecracker Explosion In Puri : ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో ప్రమాదవశాత్తు జరిగిన బాణసంచా పేలుడులో ముగ్గురు మృతిచెందారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

Firecracker Explosion In Puri
Firecracker Explosion In Puri (ETV Bharat)

Firecracker Explosion In Puri : ఒడిశాలోని పుణ్యక్షేత్రం పూరీలో అపశ్రుతి జరిగింది. ప్రమాదవశాత్తు జరిగిన బాణసంచా పేలుడులో ముగ్గురు మృతిచెందారు. 30మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం రాత్రి పూరీలోని నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథుడి చందన ఉత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వందలాది మంది అక్కడికి వచ్చారు. ఈ క్రమంలోనే కొంతమంది భక్తులు పటాసులు పేల్చారు. ఆ నిప్పు రవ్వలు సమీపంలో బాణసంచా నిల్వ ఉంచిన చోట పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 30మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అందుకు అయ్యే ఖర్చును సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి భరించనున్నట్లు ప్రకటించారు.

మరోవైపు ఈ ప్రమాదంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. భగవంతుడు జగన్నాథుని చందన ఉత్సవంలో జరిగిన బాణసంచా ప్రమాదం గురించి విని షాక్​ అయ్యానని అన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారు తర్వగా కోలుకోవాలని ఆశిస్తున్నాని ఎక్స్​లో పోస్టు చేశారు.

గుడికి వెళ్తుండగా ప్రమాదం- ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
Road accident in Ambala : ఇటీవల హరియాణాలో తీర్థయాత్రకు వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురవ్వడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. వీరందరూ ప్రయాణిస్తున్న మినీ బస్సు అంబాలా- దిల్లీ-జమ్ము జాతీయ రహదారిపై ఓ ట్రక్కును ఢీకొట్టింది. బాధితులందరూ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తున్నారని తెలిపారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

'కోమాలో ఉన్న భర్త ఆస్తిని భార్య అమ్ముకోవచ్చు'- కీలక తీర్పు వెలువరించిన హైకోర్టు - Madras HC On Husband Property Case

మహిళ కడుపులో 2.5కిలోల వెంట్రుకలు- సర్జరీ ద్వారా తొలగింపు- ప్రెగ్నెన్సీ టైంలో అలా చేసినందుకే! - Hair In Woman Stomach

Last Updated : May 30, 2024, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.