Punjab Cm New Born Baby : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో బిడ్డకు తండ్రి అయ్యారు. ఆయన రెండో భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్(34) గురువారం ఆడశిశువుకు జన్మనిచ్చారు. తాను తండ్రినయ్యాననే విషయాన్ని మాన్ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో గురుప్రీత్ కౌర్‌కు ప్రసవం జరిగిందని తెలిసింది.
పంజాబ్ సీఎం హోదాలో ఉండగా తండ్రి అయిన తొలి నాయకుడిగా 51 ఏళ్ల భగవంత్ మాన్ నిలిచారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను రెండేళ్ల క్రితమే మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. భగవంత్ మాన్ 2016 సంవత్సరంలో తన మొదటి భార్య ఇంద్రప్రీత్ కౌర్‌కు విడాకులు ఇచ్చారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. వాళ్లు కెనడాలో స్థిరపడ్డారు. ఇక 2022 మార్చిలో పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మొదటి భార్య పిల్లలు కూడా హాజరయ్యారు. 2022 జూలై 7న గురుప్రీత్ కౌర్‌ను మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. కురుక్షేత్ర జిల్లా పెహోవా పట్టణానికి చెందిన గురుప్రీత్ ఒక వైద్యురాలు. కౌర్ తండ్రి ఇంద్రజిత్ సింగ్ ఒక రైతు, ఆమె తల్లి మాతా రాజ్ కౌర్ గృహిణి. భగవంత్ మాన్ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారం, క్రీడలు, రాజకీయ అంశాలపై కామెడీ ప్రోగ్రామ్స్ చేసేవారు. 2008లో గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్‌లోనూ ఆయన పాల్గొన్నారు.
'నాన్న అని పిలిపించుకునే హక్కు కోల్పోయారు'
2023 డిసెంబరులో ఎక్స్ వేదికగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మొదటి భార్య కుమార్తె సీరత్ కౌర్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. 'నేను సీఎం భగవంత్ మాన్ కుమార్తెను. అయితే నాన్న అని పిలిపించుకునే హక్కును మాన్ కోల్పోయారు. నేను ఇప్పుడు అతన్ని సీఎం మాన్ అనే పిలుస్తాను. మా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారు. మేం మౌనంగా ఉన్నాం. అందుకే ఆయన సీఎం స్థానానికి చేరుకోగలిగారు. సీఎం రెండో భార్య ప్రస్తుతం గర్భంతో ఉన్నారు. ఆయన మూడోసారి తండ్రి కాబోతున్నారు. సొంత పిల్లలకే న్యాయం చేయలేని వ్యక్తి, రాష్ట్రానికి ఏం మంచి చేస్తారు?' అంటూ భగవంత్ కుమార్తె వ్యాఖ్యలు చేశారు.
బామ్మ, మనవరాలికి బస్సు జర్నీ ఫ్రీ- నాలుగు చిలుకలకు మాత్రం రూ.444 టికెట్ - RTC Bus Ticket For Parrots
'58ఏళ్ల వయసులో ఆమె తల్లి ఎలా అయ్యారు?!'- రాష్ట్ర సర్కార్ నుంచి నివేదిక కోరిన కేంద్రం