ETV Bharat / bharat

సండే స్పెషల్ : రొయ్యలతో ఈ వెరైటీలు - వహ్వా అనాల్సిందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 4:41 PM IST

Prawns Special Dishes: మీకు రొయ్యలు అంటే ఇష్టమా..? ఎప్పుడూ ఒకే రకం తిని బోర్​ కొట్టిందా..? అయితే ఈ సారి రూట్ మార్చండి. రొయ్యలతో చేసుకునే వెరైటీ వంటకాల లిస్ట్​ మీ కోసం పట్టుకొచ్చాం. మరి వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Etv Bharat
Etv Bharat

Prawns Special Dishes: నాన్ వెజ్​లో చాలా మంది చికెన్ ఎక్కువగా తింటారు. ఆ తర్వాత ప్లేస్​లో మటన్ ఉంటుంది. అయితే.. ఈ సండే మీ ఇంట్లో సీఫుడ్ ట్రై చేయండి. ఇందులోనూ చేపలు తరచూ తింటూనే ఉంటారు. కాబట్టి.. ఈసారి రొయ్యలతో సూపర్ వెరైటీస్ టేస్ట్ చేయండి. మీకోసమే ప్రాన్స్​తో చేసుకునే వెరైటీ రెసిపీస్ లిస్ట్​ పట్టుకొచ్చాం. ఇక లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం.

ప్రాన్స్‌ ఘీ పెప్పర్‌ ఫ్రై(Prawns Ghee Pepper Fry)

కావలసినవి:

  • రొయ్యలు- పెద్ద కప్పు
  • నెయ్యి- మూడు టేబుల్‌స్పూన్లు
  • కరివేపాకు రెబ్బలు- రెండు
  • వెల్లుల్లి తరుగు- టేబుల్‌స్పూను
  • మిరియాలపొడి- స్పూన్​
  • ఉల్లిపాయ- ఒకటి
  • చింతపండు గుజ్జు- స్పూన్​
  • బెల్లం తరుగు- స్పూన్​
  • ఉప్పు- తగినంత

How to Prepare Palak Prawns Curry : 'పాలక్ ప్రాన్స్ కర్రీ..' నోరూరిపోవాల్సిందే!

మసాలా కోసం:

  • ఎండుమిర్చి- రెండు
  • మిరియాలు- స్పూన్​
  • జీలకర్ర- స్పూన్​
  • సోంపు-స్పూన్​
  • అనాసపువ్వు- ఒకటి
  • కరివేపాకు రెబ్బలు-రెండు

తయారీ విధానం:

  • ముందుగా మసాలా సిద్ధం చేసుకోవాలి.
  • అందుకోసం మసాలా కోసం పెట్టుకున్న పదార్థాల(ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, సోంపు, అనాసపువ్వు, కరివేపాకు రెబ్బలు)ను కడాయిలో వేసి వేయించుకుని తీసుకోవాలి. వాటి వేడి చల్లారాక మెత్తగా పొడి చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఓ గిన్నెలో బెల్లం తరుగు, చింతపండు గుజ్జు తీసుకుని కలుపుకోవాలి.
  • తర్వాత స్టౌ మీద కడాయిని పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక కరివేపాకును వేయించుకుని వెల్లుల్లి తరుగు వేయాలి.
  • ఇందులో ఉల్లిపాయముక్కల్ని వేసి వేయించి... మిరియాలపొడి, చేసిపెట్టుకున్న మసాలా, చింతపండు, బెల్లం కలిపిన గుజ్జు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
  • ఇది వేగుతున్నప్పుడు శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసి వాటికి మసాలా పట్టేవరకూ కలిపి దింపేయాలి. అంతే ఘుమఘుమలాడే ప్రాన్స్‌ ఘీ పెప్పర్‌ ఫ్రై రెడీ..

ప్రాన్స్‌ సాంబార్‌ మసాలా ఎప్పుడైనా ట్రై చేశారా?

ప్రాన్స్​ 65(Prawns 65)

కావాల్సినవి:

  • రొయ్యలు- 250గ్రా
  • పసుపు- పావు స్పూన్​
  • మిరియాలపొడి- పావు స్పూన్​
  • జీలకర్రపొడి- అరస్పూన్​
  • ఉప్పు- తగినంత
  • ధనియాల పొడి- స్పూన్​
  • కారం- స్పూన్​
  • మొక్కజొన్న పిండి- స్పూన్​
  • సెనగపిండి- స్పూన్​
  • బియ్యప్పిండి- స్పూన్​
  • నిమ్మరసం- స్పూన్​
  • నూనె- తగినంత

తయారీ:

  • ముందుగా రొయ్యల్ని పసుపు వేసి శుభ్రం చేసుకోవాలి.
  • ఇప్పుడు ఓ గిన్నెలో రొయ్యలు, మిరియాలపొడి, జీలకర్రపొడి, ధనియాల పొడి, కారం వేసి కలపాలి.
  • ఆ తర్వాత బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, శనగపిండి వేసి.. మసాలా మొత్తం రొయ్యలకు పట్టించాలి.
  • చివరిగా నిమ్మరసం, ఉప్పువేసి మరోసారి కలపాలి.
  • ఈ మసాలా పట్టించిన రొయ్యలని ఒక్కోటిగా నూనెలో వేయించుకుంటే ప్రాన్‌ 65 సిద్ధం.

నాన్​వెజ్​ స్పెషల్​.. మిక్స్​డ్ ఫ్రైడ్ బిర్యానీ చేసేద్దామా?

రొయ్యల ఆమ్లెట్(Prawns Omelette)

  • రొయ్యలు-20
  • బఠాణీ గింజలు- 100 గ్రాములు
  • గుడ్లు – 3
  • కారం-ఒక టీ స్పూన్
  • మిరియాల పొడి-ఒక టీ స్పూన్
  • సోయాసాస్‌ ఒక టీ స్పూన్
  • పసుపు-చిటికెడు
  • నువ్వుల నూనె, కొత్తిమీర తురుము, పుదీనా తురుము, ఉల్లికాడలు, ఉప్పు- రుచికి తగినంత

తయారీ విధానం:

  • రొయ్యలను శుభ్రం చేసుకుని లైట్‌గా ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసి వాటిని ఉడికించుకోవాలి. అలాగే పచ్చి బఠానీలను కూడా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత ఒక గిన్నె తీసుకుని గుడ్లు, చిటికెడు ఉప్పు, కారం, మిరియాల పొడి, అర టీ స్పూన్‌ సోయాసాస్‌ వేసుకుని బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం స్టౌ వెలిగించి బాణలి పెట్టుకుని వేడెక్కిన తర్వాత.. కొంచెం నువ్వుల నూనె వేసుకుని ఉల్లికాడ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న బఠాణీలు వేసుకుని కొంచెం సేపు వేయించాలి.
  • తర్వాత ఉడికించుకున్న రొయ్యలను వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అనంతరం ఈ రొయ్యల మిశ్రమాన్ని వేరే బౌల్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • అదే బాణలిలో కొంచెం నూనె వేసుకుని ముందుగా కలిసి ఉంచుకున్న గుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసుకుని.. దానిపైన రొయ్యల–బఠాణీ మిశ్రమాన్ని పరచుకోవాలి. ఇప్పుడు దానిని రెండువైపులా కాలనివ్వాలి.
  • అంతే.. రొయ్యలు ఆమ్లెట్‌ రెడీ.
  • ఇప్పుడు ఆమ్లెట్​ను జాగ్రత్తగా ప్లేట్‌లోకి తీసుకుని.. గార్నిష్‌ కోసం కొద్దిగా నూనె, మిగిలిన సోయాసాస్‌ వేసుకుని కొత్తిమీర, పుదీనా తురుముని వేసుకుంటే.. టేస్టీ టేస్టీ రొయ్యల ఆమ్లెట్ రెడీ.. దీనిని బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు.

కార్తిక మాసం ముగిసిపోయింది - ఈ సండే మీ ఇంట్లో ఏం కూర - ఈ నాన్​వెజ్​ ట్రై చేస్తారా!

రెస్టారెంట్​ స్టైల్లో​ చికెన్​ 65 - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.