ETV Bharat / bharat

ఎంపీ ప్రజ్వల్​ రేవణ్ణ అరెస్ట్​- ఎయిర్​పోర్ట్​లో దిగగానే సిట్​ అదుపులోకి - Hassan Sex Scandal

Prajwal Revanna Return : మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Prajwal Revanna Return
Prajwal Revanna Return (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 31, 2024, 6:20 AM IST

Updated : May 31, 2024, 7:32 AM IST

Prajwal Revanna Return : లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్‌ MP ప్రజ్వల్ రేవణ్ణను కర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అరెస్టు చేసింది. శుక్రవారం తెల్లవారుజామున జర్మనీలోని మ్యూనిచ్‌ నగరం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ప్రజ్వల్‌ను C.I.S.F అదుపులోకి తీసుకుంది. అధికారిక లాంఛనాలు పూర్తైన తర్వాత సిట్ బృందానికి అప్పగించింది. ప్రజ్వల్‌ను విచారణ నిమిత్తం భారీ భద్రత మధ్య బెంగళూరులోని C.I.D కార్యాలయానికి తరలించారు.

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ తిరిస్కరణ
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలతో నెలరోజులుగా పరారీలో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ, కేసు విచారణకు సహకరిస్తానని, శుక్రవారం సిట్ ముందు వ్యక్తిగతంగా హాజరవుతానని సోమవారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని, తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగమేనని అయితే న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని తెలిపారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవణ్ణకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఫలితంగా బెంగళూరు ఎయిర్​పోర్టులో దిగగానే ప్రజ్వల్​ రేవణ్ణను అరెస్ట్ చేశారు పోలీసులు.

నోటీసులు, విజ్ఞప్తుల తర్వాత దేశానికి
తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజ్వల్‌ రేవణ్ణ ఎన్డీఏ కూటమి తరఫున హాసన నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం వల్ల ఆయన గత ఏప్రిల్‌లో దేశం విడిచి పరారయ్యారు. ఈ నేపథ్యంలోనే రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి. ఆయన జాడ కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆయనపై నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, రెడ్‌ కార్నర్‌, బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి బహిరంగానే కోరారు.

'నన్ను క్షమించండి- మే 31న సిట్​ ముందు హాజరవుతా'- ప్రజ్వల్​ రేవణ్ణ వీడియో రిలీజ్ - Prajwal Revanna Return To India

'లొంగిపో, లేదంటే జరిగేది అదే'- ప్రజ్వల్​ రేవణ్ణకు దెవెగౌడ సీరియస్ వార్నింగ్ - Deve Gowda warns Prajwal Revanna

Last Updated : May 31, 2024, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.