PM Modi Warning To Pakistan : చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలిస్తామని దాయాది దేశాన్ని మరోసారి గట్టిగా హెచ్చరించారు. కార్గిల్ 25వ విజయ దివస్‌ను పురస్కరించుకుని ద్రాస్‌లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం ఆనాటి యుద్ధంలో అమరులు అయిన కుటుంబాలతో ప్రధాని ముచ్చటించారు. తర్వాత షిన్‌కున్ లా సొరంగ పనుల ప్రాజక్టును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మన బలానికి, సహనానికి, వాస్తవాలకు ఈ విజయగాథ నిదర్శమన్నారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారని ప్రధాని అన్నారు. శాంతి కోసం భారత్ తపిస్తే పాకిస్థాన్ తన నిజ స్వభావాన్ని చూపిందని దుయ్యబట్టారు. కార్గిల్‌లో యుద్ధం మాత్రమే గెలవలేదని భారత్ సత్తా, సామర్థ్యాన్ని చాటామని చెప్పారు.
#WATCH | Ladakh: Prime Minister Narendra Modi meets the families of the heroes of Kargil War on the occasion of 25th #KargilVijayDiwas2024 pic.twitter.com/sFWZMGDIW6
— ANI (@ANI) July 26, 2024
"ఈరోజు గొప్ప భూమి అయిన లద్దాఖ్ కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవానికి సాక్షిగా నిలుస్తుంది. పాకిస్థాన్ గతంలో చేసిన అన్ని వికృత ప్రయత్నాల్లోనూ విఫలమైంది. కానీ, చరిత్ర నుంచి పాకిస్థాన్ ఏమీ నేర్చుకోలేదు. ఉగ్రవాదం, ప్రత్యక్ష యుద్ధం సాయంతో నిలదొక్కుకోవడానికి చూస్తోంది. ఈ ఉగ్రవాద పోషకులకు వారి దుర్మార్గపు చర్యలు ఎప్పటికీ ఫలించవని నేను చెప్పాలనుకుంటున్నాను. మన సైనికులు తీవ్రవాదాన్ని పూర్తి శక్తితో అణిచివేస్తారు. శత్రువులకు తగిన రీతిలో బుద్ధి చెబుతారు."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
"గతంలో పాకిస్థాన్ పాల్పడిన వికృత ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా, చరిత్ర నుంచి ఆ దేశం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు సరికదా! ఉగ్రవాదం, ప్రాక్సీ వార్‌తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ రోజు నేను మాట్లాడే మాటలు ఉగ్రవాదులను తయారుచేస్తున్న వారికి (పాక్ సైన్యాన్ని ఉద్దేశిస్తూ) నేరుగా వినబడతాయి. ముష్కరులను పెంచి పోషిస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే. వారి దుర్మార్గపు కుట్రలు ఎన్నటికీ ఫలించవు. మా దళాలు ఉగ్రవాదాన్ని నలిపివేసి శత్రువులకు తగిన జవాబిస్తాయి" అని మోదీ పాక్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
#WATCH | Ladakh: Prime Minister Narendra Modi virtually carries out the first blast of the Shinkun La Tunnel project
— ANI (@ANI) July 26, 2024
Shinkun La Tunnel Project consists of a 4.1 km long Twin-Tube tunnel which will be constructed at an altitude of around 15,800 feet on the Nimu – Padum – Darcha… pic.twitter.com/ISobHEhkzl
అగ్నిపథ్ విమర్శలపై ప్రతిపక్షాలకు కౌంటర్
మరోవైపు అగ్నిపథ్ పథకంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. భారత బలగాలకు సంబంధించి పెన్షన్ నిధులు ఆదా చేసేందుకే ఈ పథకం తీసుకువచ్చారంటూ చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పథకాన్ని సమర్థిస్తూ మాట్లాడిన ఆయన, దేశ సైన్యాన్ని ఆధునికీకరించడానికి, బలోపేతం చేయడానికి అవసరమైన సంస్కరణ అని చెప్పారు.
#WATCH | On the Agnipath scheme, PM Narendra Modi says, " the history of those who are misleading the youth of the country shows that they do not care about the soldiers. these are the same people who lied about one rank one pension. it is our government which implemented one rank… https://t.co/dSygFxGqDp pic.twitter.com/NPWON70E2j
— ANI (@ANI) July 26, 2024
55మంది ఉగ్రవాదులను చంపడమే టార్గెట్- ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 స్టార్ట్ - Operation Sarp Vinash 2024