PM Modi Speech Ayodhya : అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 తేదీ సరికొత్త యుగానికి ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇకపై రాముడు టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదని, మందిరంలో ఉంటారని పేర్కొన్నారు. ప్రాణప్రతిష్ఠతో రామ భక్తులంతా చాలా ఆనందంతో ఉన్నారని మోదీ తెలిపారు. అయోధ్యలో ఆలయ నిర్మాణం ఆలస్యమైనందుకు రాముడికి క్షమాపణలు చెబుతున్నానని మోదీ అన్నారు.
-
VIDEO | "January 22, 2024, is not just a date, but the beginning of a new era. The construction of Ram Mandir has filled people with a new energy," says PM @narendramodi after Pran Pratishtha ceremony in Ayodhya.
— Press Trust of India (@PTI_News) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)… pic.twitter.com/kukeRXVcwe
">VIDEO | "January 22, 2024, is not just a date, but the beginning of a new era. The construction of Ram Mandir has filled people with a new energy," says PM @narendramodi after Pran Pratishtha ceremony in Ayodhya.
— Press Trust of India (@PTI_News) January 22, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)… pic.twitter.com/kukeRXVcweVIDEO | "January 22, 2024, is not just a date, but the beginning of a new era. The construction of Ram Mandir has filled people with a new energy," says PM @narendramodi after Pran Pratishtha ceremony in Ayodhya.
— Press Trust of India (@PTI_News) January 22, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)… pic.twitter.com/kukeRXVcwe
"ఇవాళ మన రాముడు మళ్లీ వచ్చాడు. ఎన్నో బలిదానాలు, త్యాగాల తర్వాత మన రాముడు వచ్చాడు. ఈ శుభ గడియల్లో ప్రజలందరీకీ కృతజ్ఞతలు. మన బాలరాముడు ఇకనుంచి టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదు. మన రామ్ లల్లా ఇకనుంచి మందిరంలో ఉంటాడు. రామ భక్తులంతా ఆనంద పరవశంలో ఉన్నారు. దేశ విదేశాల్లో ఉన్న భక్తులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2024 జనవరి 22 ఇది సాధారణ తేదీ కాదు. కొత్త కాలచక్రానికి ప్రతీక. బానిస మనస్తత్వం వదిలి సగర్వంగా తలెత్తుకుని చూస్తున్నారు. మా ప్రయత్నంలో ఏదో లోపం ఉండి ఉంటుంది. అందుకే ఈ పని (ఆలయ నిర్మాణం) పూర్తి చేయడానికి ఇన్నేళ్లు పట్టింది. ఈరోజు శ్రీరాముడు మనల్ని క్షమిస్తాడని ఆశిస్తున్నా."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
'వారు సమాజాన్ని అర్థం చేసుకోలేకపోయారు'
గతంలో రాముడి ఉనికిపైనే ప్రశ్నలు లేవనెత్తారని మోదీ గుర్తు చేశారు. వారు భారత సమాజాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారని పేర్కొన్నారు. దశాబ్దాల పాటు కొనసాగిన అయోధ్య వివాదాన్ని పరిష్కరించినందుకు న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు మోదీ. చట్టప్రకారం ఆలయ నిర్మాణం జరిగిందని చెప్పారు. 'రామ మందిరాన్ని నిర్మిస్తే వివాదం చెలరేగుతుందని కొందరు చెప్పేవారు. కానీ వారు ఒకటి అర్థం చేసుకోవాలి. రాముడంటే శక్తి, నిప్పు కాదు. ఆయన సమస్య కాదు పరిష్కారం' అని మోదీ పేర్కొన్నారు.
-
VIDEO | "'Ram Rajya' was established after Lord Ram came in the 'Treta Yuga'. He continued to show us path for thousands of years. Now, the land of Ayodhya is asking us a question, the wait of centuries has ended but what's next? I can feel today that the 'Kaal Chakra' is… pic.twitter.com/kqeoyAmBcs
— Press Trust of India (@PTI_News) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "'Ram Rajya' was established after Lord Ram came in the 'Treta Yuga'. He continued to show us path for thousands of years. Now, the land of Ayodhya is asking us a question, the wait of centuries has ended but what's next? I can feel today that the 'Kaal Chakra' is… pic.twitter.com/kqeoyAmBcs
— Press Trust of India (@PTI_News) January 22, 2024VIDEO | "'Ram Rajya' was established after Lord Ram came in the 'Treta Yuga'. He continued to show us path for thousands of years. Now, the land of Ayodhya is asking us a question, the wait of centuries has ended but what's next? I can feel today that the 'Kaal Chakra' is… pic.twitter.com/kqeoyAmBcs
— Press Trust of India (@PTI_News) January 22, 2024
"మనదేశ సంస్కృతి, కట్టుబాట్లకు రాముడే మూలం. రాముడి ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యం. ఈ క్షణం దేశప్రజల సహనం, పరిపక్వతకు నిదర్శనం. ఈ క్షణం మన విజయానికే కాదు, వినయానికి కూడా సూచిక. పవిత్రత, శాంతి, సామరస్యం భారత ఆత్మకు ప్రతిరూపం. వసుధైక కుటుంబం అనేది మన జీవన విధానం. ఇది సాధారణ మందిరం కాదు- దేశ చైతన్యానికి ప్రతీక. రాముడు మనదేశ ఆత్మ, ధైర్యసాహసాలకు ఆయన ప్రతిరూపం."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
'వెయ్యేళ్ల లక్ష్యం'
రామాలయ నిర్మాణంతోనే మన పని పూర్తి కాలేదన్న మోదీ- వచ్చే వెయ్యేళ్ల కోసం దేశానికి బలమైన పునాది నిర్మించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఘనమైన, దైవిక, సామర్థ్యం కలిగిన భారతదేశాన్ని నిర్మించుకునేందుకు అంతా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో పూర్తిగా సానుకూల శక్తి ఉందని పేర్కొన్న మోదీ- సంప్రదాయాలతో కూడిన ఆధునికతతో దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.
"ఇది విగ్రహ ప్రాణప్రతిష్ఠే కాదు. దేశ విశ్వాసాలకు ప్రాణప్రతిష్ఠ. ఇది కేవలం ఆలయమే కాదు భారత చైతన్యానికి ప్రతీక. రాముడే భారత్ ఆధారం, రాముడే భారత్ విధానం, రాముడే భారత్ ప్రతాపం, రాముడే భారత్ ప్రభావం, రాముడే విశ్వం, రాముడే విశ్వాత్మ. రాముడే నిత్యం, రాముడే నిరంతరం.
ఇవాళ దేశంలో నిరాశావాదానికి చోటు లేదు. ఉన్న బలాన్ని కూడదీసుకుని దేశ వికాసానికి తోడ్పడాలి. 'దేవ్ సే దేశ్- రామ్ సే రాష్ట్ర్' ఇదే మన కొత్త నినాదం. పరాక్రమవంతుడు రాముడిని నిత్యం పూజించాలి. రాముడు వేల ఏళ్లుగా మనకు ప్రేరణ కలిగిస్తున్నాడు. భవిష్యత్తులో మనం అనేక విజయాలు సాధించాలి. భారత సర్వోన్నత అభివృద్ధికి ఈ మందిరం చిహ్నం కావాలి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
'త్రేతాయుగంలోకి వచ్చినట్టుంది'
ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో యావద్దేశం రామమయం అయిందని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. త్రేతాయుగంలోకి వచ్చామా అన్నట్లు ఉందని పేర్కొన్నారు. దేశంలోని అన్ని నగరాలు, గ్రామాలు అయోధ్యగా మారిపోయాయని, అన్ని మార్గాలు రామజన్మభూమి వైపు తరలివస్తున్నాయని చెప్పుకొచ్చారు. ప్రతి జీవి రామనానం జపిస్తోందని అన్నారు. ఎక్కడైతే ఆలయం నిర్మించాలని సంకల్పించుకున్నామో, అక్కడే మందిరం నిర్మించినట్లు చెప్పారు. అనేక మంది త్యాగాల ఫలితంగా ఆలయం అందుబాటులోకి వచ్చిందని వివరించారు.
"500 ఏళ్ల కల నెరవేరింది. ఎన్నో పోరాటాల తర్వాత ఈ అద్భుత ఘట్టం సాకారమైంది. ఈ అద్భుత ఘట్టాన్ని నేను మాటల్లో వర్ణించలేను. అయోధ్య ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా వర్ధిల్లుతుంది. ప్రధాని మోదీ దూరదృష్టి, అంకితభావంతోనే ఇదంతా సాధ్యమైంది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రామరాజ్యాన్ని సాకారం చేస్తుంది. అయోధ్య వీధుల్లో ఇప్పుడు తుపాకీ గుళ్ల చప్పుడు వినిపించదు. కర్ఫ్యూలు ఉండవు. ఇకపై అయోధ్యలో దీపోత్సవాలు, రామోత్సవాలు ఉంటాయి. శ్రీరాముడి పేరు, ఆయన సంకీర్తనలు వినిపిస్తాయి. రామ విగ్రహ ప్రతిష్ఠాపనతో రామరాజ్యం వచ్చింది."
-యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం
అంతకుముందు, ప్రధాని మోదీ సమక్షంలో ఆలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. రామ్‌లల్లా విగ్రహానికి అచ్ఛాదన తొలగించి ప్రాణప్రతిష్ఠ చేశారు. విగ్రహానికి బంగారు కడ్డీతో తిలకం దిద్దారు. అద్దంలో తన ముఖాన్ని రాముడికి చూపించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య యాజమాన్‌గా మోదీ వ్యవహరించారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం బాలరాముడికి తొలి హారతి ఇచ్చారు మోదీ. ఆ తర్వాత గర్భగుడిలో సాష్టాంగ ప్రమాణం చేశారు. వేదమంత్రాలు, మంగళవాద్యాలతో ప్రాణప్రతిష్ఠ వేడుక నిర్వహించారు. ప్రధాని పక్కనే RSS అధినేత మోహన్ భాగవత్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆశీనులై పూజల్లో పాల్గొన్నారు.
కోట్లాది మంది కల సాకారం- అయోధ్యలో కొలువుదీరిన శ్రీరాముడు
రామమందిరంతోపాటు అయోధ్యలో ముఖ్య ఆలయాలివే- తప్పక దర్శించుకోండి!
హైదరాబాద్ నుంచి బంగారు పాదుకలు, ఛత్తీస్‌గఢ్ నుంచి 3లక్షల కిలోల బియ్యం- రాఘవుడికి ఎన్నో కానుకలు