ETV Bharat / bharat

'అవినీతిపై రాజీలేని పోరు- ఆ సంస్థలకు పూర్తి స్వేచ్ఛ' - Parliament Session 2024

PM Modi Rajyasabha Speech : అవినీతిపై పోరాటం చేసేందుకు ప్రభుత్వ ఏజెన్సీలకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అవినీతిపై పోరాటమే తమ ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు ఇచ్చిన సమాధానంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత పదేళ్లలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పనితీరును చూసే ప్రజలు మూడోసారి అధికారం ఇచ్చారని తెలిపారు.అయితే ప్రధాని మాట్లాడుతుండగా విపక్షాలు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశాయి. దీనిపై రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Parliament Session 2024
PM MODI (Sansad TV)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 1:54 PM IST

Updated : Jul 3, 2024, 5:25 PM IST

PM Modi Rajyasabha Speech : దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయడానికి తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన ప్రధాని మరోసారి విపక్షాలపై మండిపడ్డారు. విపక్షాల అజెండాను ప్రజలు తిరస్కరించారని మోదీ అన్నారు.

తమ దృష్టి అభివృద్ధిపైనేకాని ఓటు బ్యాంకు రాజకీయాలపై కాదన్నారు. రాజ్యాంగం అనే పదం కాంగ్రెస్‌కు సరిపోదన్న ప్రధాని ఎమర్జెన్సీ సమయంలో ఆ పార్టీ చేసిన రాజ్యాంగ సవరణలను గుర్తు చేశారు. రాజ్యాంగ ప్రతులను ప్రదర్శించడం ద్వారా కాంగ్రెస్‌ తాము చేసిన చెడుపనులను దాచేందుకు యత్నిస్తోందని విమర్శించారు.

విపక్షాల హయాంలో రిమోట్‌ కంట్రోల్‌ పాలన నడిచేదంటూ సోనియా గాంధీని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పనితీరును చూసే ప్రజలు మూడోసారి అధికారం ఇచ్చారని తెలిపారు. 140 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ప్రధాని విమర్శించారు.

"స్వతంత్ర భారత చరిత్రలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణంలో అనేక దశాబ్దాల తర్వాత దేశ ప్రజలు ఒక ప్రభుత్వానికి వరుసగా మూడోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చారు. పదేళ్లు దేశాన్ని పాలించిన తర్వాత ఒక ప్రభుత్వం తిరిగి ఎన్నికకావడం 60 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 6 దశాబ్దాల తర్వాత జరిగిన ఈ ఘటన అసామాన్యమైనది. కొందరు ఉద్దేశపూర్వకంగా దేశ ప్రజలు తీసుకున్న ఈ మహత్తర నిర్ణయంపై మసిపూయాలని చూస్తున్నారు." అని మోదీ అన్నారు.

వారికి పూర్తి స్వేచ్ఛ
అవినీతిని అణచివేసేందుకు ప్రభుత్వ సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు ప్రధాని మోదీ చెప్పారు. అవినీతి, నల్లధనంపై మరింత ఉక్కుపాదం మోపుతామన్న మోదీ తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరన్నారు.

"అవినీతికి వ్యతిరేకంగా పోరాటమనేది నాకు ఎన్నికల గెలుపు, ఓటములకు కొలమానం కాదు. ఎన్నికల్లో గెలవడానికి లేదా ఓడిపోవడానికి నేను అవినీతిపై పోరాడటం లేదు. ఇది నా మిషన్‌, ఇది నా దృఢవిశ్వాసం. అవినీతి అనేది ఒక చెదపురుగు దేశాన్ని నాశనం చేసిందని నేను నమ్ముతున్నాను. ఈ దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయడానికి, సామాన్య ప్రజల మనస్సులలో అవినీతిపై ద్వేషాన్ని పెంచడానికి నేను చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను." అని మోదీ స్పష్టం చేశారు.

మణిపుర్‌ అంశంపైనా స్పందించిన ప్రధాని.. ఆ అంశంపై రాజకీయాలు చేయడం ఆపాలని విపక్షాలకు హితవు పలికారు. ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో మణిపుర్‌లో పదిసార్లు రాష్ట్రపతి పాలన విధించారని ప్రధాని గుర్తుచేశారు. ఇలాంటి విద్వేష రాజకీయాలను ఏదో ఒక రోజు మణిపుర్‌ ప్రజలు తిరస్కరిస్తారని కాంగ్రెస్‌ను మోదీ హెచ్చరించారు.

"మణిపుర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. అక్కడ జరిగిన అల్లర్లపై 11 వేలకుపైగా ఎఫ్ఆర్‌ఐలు నమోదయ్యాయి. 500 మందికిపైగా అరెస్టు అయ్యారు. మణిపుర్‌లో హింసాత్మక సంఘటనలు తగ్గుముఖం పడుతున్నాయి. దానర్థం అక్కడ శాంతిపై ఆశ, భరోసా సాధ్యమవుతున్నాయి. నేడు అక్కడ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, ఇతర సంస్థలు తెరుచుకున్నాయి. మణిపుర్‌లో శాంతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి." అని ప్రధాని తెలిపారు.

విపక్ష సభ్యుల వాకౌట్
ప్రధాని మోదీ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విపక్షాలు సభలో ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. వారి ఆందోళన నడుమే మోదీ ప్రసంగం కొనసాగించగా ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వెళ్లిపోయారు. దీనిపై ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

వారు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారంటూ ఛైర్మన్‌ ధన్‌ఖఢ్‌ దుయ్యబట్టారు. అబద్ధాలను ప్రచారం చేస్తున్న వారు నిజాలను వినలేకపోతున్నారని ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిన విపక్షాలు ఇప్పుడు నినాదాలు చేస్తూ పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు.

'వికసిత్‌ భారత్ లక్ష్యంగా డే&నైట్​ పనిచేస్తా- సానుభూతి కోసం 'బాలక్​ బుద్ధి' రాహుల్​ కొత్త డ్రామా' - PM Modi Seech In Parliament

'దేశ సేవే తొలి బాధ్యత- పార్లమెంట్ నియమాలు పాటించాలి'- NDA ఎంపీలకు మోదీ సూచనలు - NDA Meeting 2024

Last Updated : Jul 3, 2024, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.