PM Modi Parliament Budget Session 2024 : లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చేశారని, వచ్చే ఐదేళ్ల పాటు దేశం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈసారి ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ రాబోయే ఐదేళ్లు తమకు కార్యనిర్దేశం చేసేదిగా ఉంటుందని పేర్కొన్నారు. 2047లో వికసిత్ భారత్ కలను నెరవేర్చడానికి పునాది వేస్తుందని అభిప్రాయపడ్డారు. త్వరలో సమర్పించనున్న బడ్జెట్ అత్యంత కీలకమైందని ప్రధాని మోదీ అభివర్ణించారు.
#WATCH | PM Narendra Modi says, " today is the first monday of sawan. an important session is starting on this auspicious day. i extend my greetings to the countrymen on the first monday of sawan. the monsoon session of parliament is starting today. today the whole country is… pic.twitter.com/t32mytIzru
— ANI (@ANI) July 22, 2024
లోక్‌సభ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. "ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ బడ్జెట్ అమృత్ కాల్ సమయంలో ప్రవేశపెట్టే బడ్జెట్. దేశ ప్రజాస్వామ్యం గర్వించదగ్గ ప్రయాణంలో బడ్జెట్ సెషన్ ఒక ముఖ్యమైన గమ్యస్థానం. దాదాపు 60 ఏళ్ల తర్వాత మూడోసారి ఒకే ప్రభుత్వం అధికారం చేపట్టింది. గత పార్లమెంట్ సెషన్లో నిరంతరం గందరగోళం వల్ల కొందరు సభ్యులు తమ వాణిని వినిపించలేకపోయారు. ఇలాంటి వ్యూహాలకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ స్థానం లేదు. ఆ రాజకీయాల నుంచి పార్టీలు అన్నీ బయటకు వచ్చి దేశం కోసం పని చేయాలి" అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
జులై 23న కేంద్ర బడ్జెట్
కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వరుసగా మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను సమర్పించేందుకు పార్లమెంట్ జులై 22న (సోమవారం) సమావేశమైంది. ఈ సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకు జరగనున్నాయి. జులై 23న పూర్తిస్థాయి బడ్జెట్‌ను వరుసగా ఏడో సారి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. సరికొత్త రికార్డును సృష్టించనున్నారు. ఈ బడ్జెట్‌పై వేతనజీవులు, పన్ను చెల్లింపుదారులు, రైతులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ట్యాక్స్ శ్లాబుల్లో మార్పులు ఉంటాయని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. కాగా కేంద్ర సర్కార్ ఈ పార్లమెంట్ సెషన్లో ఆరు బిల్లులను సభ ఆమోదం కోసం తీసుకురానుంది.