PM Modi On TMC : బంగాల్లో ప్రజలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లూటీ చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కేంద్రం పంపిన నిధులను దోచుకోవడానికి టీఎంసీ నకిలీ జాబ్ కార్డులను సృష్టించిందని మోదీ ఆరోపించారు. బంగాల్ పర్యటనలో భాగంగా రూ. 4,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసగింస్తూ టీఎంసీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
-
#WATCH | West Bengal: Prime Minister Narendra Modi flags off the Siliguri-Radhikapur train, via video link. pic.twitter.com/ehHq3LxqJ8
— ANI (@ANI) March 9, 2024
ప్రజల భూములను దోచుకోవటంలో బిజీ
అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు సిలిగురి- రాధికాపుర్ మధ్య కొత్త ప్యాసింజర్ రైలు సర్వీసును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. బంగాల్లో తొలుత వామపక్షాలు ప్రజల మాట వినలేదని ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కూడా ప్రజలను పట్టించుకోవడం లేదని మోదీ ఆరోపించారు. 'వీరంతా ప్రజల భూములు దోచుకోవటంలో బిజీగా ఉన్నారు. బంగాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఇక్కడి మంత్రులు జైలులో ఉన్నారు. స్వాతంత్య్రం అనంతరం బంగాల్ అభివృద్ధిని కాంగ్రెస్ విస్మరించింది. తమ ప్రభుత్వం మాత్రం తూర్పు భారతాన్ని అభివృద్ధి ఇంజిన్‌గా పరిగణిస్తోంది' అని మోదీ తెలిపారు.
'అవకాశం ఇస్తే అన్ని అభివృద్ధి చేస్తాం'
'సందేశ్‌ఖాలీలోని దళిత, ఆదివాసీ మహిళలపై టీఎంసీ నేతలు ఏం చేశారనే అనే విషయంపై దేశం మొత్తం చర్చిస్తోంది. మహిళలపై దాడులు చేయడం, పేదవాళ్ల దగ్గర నుంచి దోచుకోవడమే టీఎంసీ నేతల పని. ప్రజల కష్టాల గురించి వారు పట్టించుకోవడం లేదు. కేంద్ర పంపిన నిధులను దోచుకోవడం కోసం 25 లక్షల నకీలీ జాబ్ కార్డులను సృష్టించింది బంగాల్ ప్రభుత్వం. పేద ఇళ్ల కోసం నిధులను పంపితే వాటిని లూటీ చేశారు. మేము ఉజ్వల పథకం ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. కానీ టీఎంసీ ప్రభుత్వం మాత్రం 14 లక్షల మందికి పైగా మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అనుమతించడం లేదు. అందుకే మీరు నాకు అవకాశం ఇస్తే నేను మీ అందరికీ అన్ని సౌకర్యాలను తిరిగి తీసుకొస్తాను' అని మోదీ హామీ ఇచ్చారు.
ప్రభుత్వ పాఠశాలలో చేరితే స్టూడెంట్ అకౌంట్లో రూ.1000 డిపాజిట్- ఎక్కడంటే?
శ్మశానంలో మహాశివరాత్రి వేడుకలు- అక్కడే ప్రసాదాలు వండి భక్తులకు పంపిణీ