PM Modi On Railways : రైల్వే ట్రాకులపైనే తాను జీవితం ప్రారంభించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అందుకే ఇంతముందుకు మన రైల్వేలు ఎంత అధ్వాన్నంగా ఉండేవో తనకు తెలుసని అన్నారు. 2024లో కేవలం రెండు నెలల్లోనే రూ.11లక్షల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించామని చెప్పారు. గత 10 ఏళ్లలో రైల్వేల అభివృద్ధికి గతంలో చేసిన దానికంటే ఆరు రెట్లు ఎక్కువ మొత్తాన్ని బీజేపీ ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించారు.
10 సంవత్సరాల పని కేవలం ట్రైలర్ మాత్రమే!
భారత్‌ను యువకుల దేశంగా అభివర్ణించిన ప్రధాని- అత్యంత ఎక్కువ యువశక్తి భారత్‌లో ఉందని చెప్పారు. తాము వేసే పునాదులు యువత దివ్యమైన భవిష్యత్‌కు గ్యారంటీ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. తమ పది సంవత్సరాల పని కేవలం ట్రైలర్ మాత్రమేనని చెప్పిన మోదీ- మరింత ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 10 వందేభారత్‌లను ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు.
పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్ షెడ్లు!
రూ.85వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు కూడా మోదీ శంకుస్థాపనలు/ప్రారంభోత్సవాలు చేశారు. వీరిలో కొన్నింటిని జాతికి అంకితం చేశారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో 9 పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్ షెడ్లు, రెండు జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారంట్లను ప్రధాని నేడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కొళ్లం-తిరుపతి మెయిల్ ఎక్స్‌ప్రెస్, పలు మార్గాల్లో రెండో లైను, మూడో లైను, గేజు మార్పిడి, బైపాస్ లైన్లను ప్రారంభించారు.
-
VIDEO | "Reforms are being carried out for 'Viksit Bharat', and several projects are being inaugurated and their foundation stones are being laid out in every part of the country. It's been nearly 75 days of 2024. In these 75 days, we have inaugurated and laid foundation stone of… pic.twitter.com/hgtuMxhjFW
— Press Trust of India (@PTI_News) March 12, 2024
51కి చేరిన వందేభారత్‌లు
సికింద్రాబాద్-విశాఖ, కలబురగి-బెంగళూరుతో పాటు లఖ్‌నవూ-దెహ్రదూన్, పట్నా-లఖ్‌నవూ, న్యూ జల్‌పాయ్‌గుడి-పట్నా, పూరి-విశాఖపట్నం, రాంచీ-వారణాసి, ఖజురహో-దిల్లీ, అహ్మదాబాద్-ముంబయి, మైసూరు-చెన్నై మార్గాల్లో మొత్తం 10 రైళ్లను ప్రధాని మంగళవారం ప్రారంభించారు. దీంతో దేశంలో మొత్తం వందేభారత్‌ల సంఖ్య 51కి చేరింది. ఇవి 45 మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. అత్యధికంగా దిల్లీ గమ్యస్థానానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి పది వందేభారత్‌లు అందుబాటులో ఉన్నాయి.
'వచ్చే ఐదేళ్లలో జెట్ స్పీడ్‌లో అభివృద్ధి- ఇండియా కూటమికి నిద్రపట్టడం లేదు!'
'అభివృద్ధితో విపక్షాల బుజ్జగింపు విషం బలహీనం- వికసిత్ భారత్‌గా దేశాన్ని మార్చడమే నా టార్గెట్'