PM Modi on Congress : కాంగ్రెస్ పార్టీని తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇప్పుడు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ, గతంలో మహాత్మాగాంధీతో సంబంధమున్న పార్టీ కాదన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ మేరకు కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో విద్వేషం అనే దెయ్యం ప్రవేశించింది. అందుకే కాంగ్రెస్ పార్టీలో దేశభక్తి అనే ఆత్మ తుది శ్వాస విడిచింది. కాంగ్రెస్ నేతలు (రాహుల్ గాంధీని ఉద్దేశించి) విదేశీ పర్యటన సందర్భంగా దేశ వ్యతిరేక అజెండాపై మాట్లాడుతుంటారు. ఇప్పటి కాంగ్రెస్ పార్టీ గణపతి పూజను కూడా ద్వేషిస్తోంది. స్వాతంత్య్ర పోరాటంలో లోకమాన్య తిలక్ నేతృత్వంలో గణపతి వేడుకలు దేశ ఐక్యతా ఉత్సవాలుగా మారాయి. గణపతి వేడుకల్లో అన్నివర్గాల ప్రజలు పాల్గొనేవారు. అందుకే కాంగ్రెస్ పార్టీ గణపతి పూజ పట్ల వ్యతిరేక భావంతో ఉంది. నేను గణేశ్ పూజ కార్యక్రమానికి వెళ్లా, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయం నిద్ర లేచింది. గణేశ్ పూజను కూడా వ్యతిరేకించటం మొదలుపెట్టింది. బుజ్జగింపు రాజకీయాల కోసం ఏమైనా చేస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గణపతి బప్పాను కూడా కటకటాల వెనక్కి పంపింది. గణపతికి జరిగిన ఈ అవమానాన్ని చూసి దేశం మొత్తం ఉలిక్కిపడింది. కానీ ఈ విషయంపై పార్టీ మిత్రపక్షాలు మాత్రం మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ చేసిన ఈ పాపాలకు మనం ఏకమై సమాధానం చెప్పాలి.
-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
#WATCH | Wardha, Maharashtra: PM Narendra Modi says, " ...today's congress hates even ganpati puja. in the freedom struggle, under the leadership of lokmanya tilak, ganpati utsav became the festival of india's unity. people from every society, every class come together in ganesh… pic.twitter.com/CKrcUrkS9P
— ANI (@ANI) September 20, 2024
'వారికి మరో అవకాశం ఇవ్వకూడదు'
రాజకీయాలు, అవినీతి కోసమే కాంగ్రెస్ రైతులను ఉపయోగించుకుందని మోదీ అన్నారు. 'తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చి రైతులను తిప్పించుకుంటోంది. కాంగ్రెస్ అంటేనే అబద్ధం, మోసం, నిజాయతీ లేకపోవడం. మహారాష్ట్ర ప్రజలు ఆ పార్టీ పట్ల జాగ్రత్త వహించి మరోసారి అవకాశం ఇవ్వకుండా చేయాలి. గత ప్రభుత్వం విశ్వకర్మ వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రజలను ఎదగనివ్వలేదు. వెనుబడిన వర్గాలు, దళితులపై కాంగ్రెస్‌కు ఉన్న ప్రతికూల ఆలోచనలను ప్రభుత్వ వ్యవస్థ నుంచి తొలగించాం. ఇప్పుడు విశ్వకర్మ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. వారు కేవలం హస్త కళాకారులుగానే మిగిలిపోకుండా పారిశ్రామిక వేత్తలుగా మారాలన్నదే మా లక్ష్యం' అని అన్నారు.
#WATCH | Maharashtra: Addressing the National PM Vishwakarma programme in Wardha, PM Narendra Modi says, " ...congress and its friends deliberately did not let the sc, st and obc people move forward. we have eliminated this anti-dalit and anti-backward thinking of congress from… pic.twitter.com/MIE4mQ2PQ5
— ANI (@ANI) September 20, 2024
ఏడాది కాలంలో 18 వృత్తులకు చెందిన 20 లక్షల మందికి పైగా విశ్వకర్మ పథకం ద్వారా లబ్ధి పొందారని, 8 లక్షల మందికి పైగా హస్తకళాకారులు నైపుణ్య శిక్షణ పొందారని ప్రధాని మోదీ తెలిపారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, వేల సంవత్సరాల నాటి నైపుణ్యాలను ఉపయోగించుకునే రోడ్‌మ్యాప్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. విశ్వకర్మ పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేశారు.
VIDEO | During his visit to Wardha today to participate in the National 'PM Vishwakarma' Programme, PM Modi visited an exhibition showcasing the efforts of Vishwakarma craftsmen.
— Press Trust of India (@PTI_News) September 20, 2024
During the visit, PM also bought an artefact of Lord Jagannath from one Vishwakarma and paid him… pic.twitter.com/081a2RTB2S