ETV Bharat / bharat

మోదీ మరోసారి ప్రధాని కావాలని సైకిల్ యాత్ర- 12 జ్యోతిర్లింగాల దర్శనానికి ముస్లిం యువతి ప్లాన్

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 5:47 PM IST

PM Modi Fan Cycle Yatra : మహారాష్ట్రలోని ముంబయికు చెందిన ఓ ముస్లిం యువతి ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని సైకిల్ యాత్ర చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఈ సైకిల్ యాత్ర చేపట్టినట్లు షబ్నమ్ షేక్ తెలిపింది. మరెందుకు ఆలస్యం ఆ యువతి సైకిల్ యాత్ర గురించి తెలుసుకుందాం.

PM Modi Fan Cycle Yatra
PM Modi Fan Cycle Yatra
మోదీ మరోసారి ప్రధాని కావాలని సైకిల్ యాత్ర

PM Modi Fan Cycle Yatra : తన అభిమాన నాయకుడు నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించాలని సైకిల్ యాత్రను చేపట్టింది ఓ ముస్లిం యువతి. రోజుకు 80 నుంచి 90 కిలోమీటర్లు తొక్కుతూ తన అభిమాన నాయకుడి కోసం శ్రమిస్తోంది. మరో 7-8 నెలల్లో సైకిల్ యాత్రను పూర్తి చేస్తానని ధీమాగా చెబుతోంది. సైకిల్​కు కాషాయ జెండాలు కట్టి అందంగా తీర్చిదిద్ది చూపరులను ఆకట్టుకునేలా చేసింది. అసలు ఎవరు ఈ యువతి? ఎక్కడకి సైకిల్​పై యాత్ర చేస్తుంది? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.

నరేంద్ర మోదీ మూడో సారి ప్రధాని పదవి చేపట్టాలని మహారాష్ట్రలోని ముంబయికు చెందిన షబ్నమ్ షేక్ అనే యువతి సైకిల్ యాత్ర చేపట్టింది. సైకిల్​పై 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు సిద్ధమైంది. తన స్నేహితుడితో కలిసి సైకిల్​ను హుషారుగా తొక్కుతూ ఇప్పటికే మహారాష్ట్రలో ఉన్న రెండు జ్యోతిర్లింగాలను దర్శించుకుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్​లోని ఓం కారేశ్వర్​ వెళ్లనున్నట్లు షబ్నమ్ చెప్పింది. ఆ తర్వాత ఉజ్జయిన్​లోని బాబా మహాకాల్​ను దర్శించుకుని నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని పదవి చేపట్టాలని దేవుడ్ని కోరుకోనున్నట్లు తెలిపింది.

PM Modi Fan Cycle Yatra
స్నేహితుడితో షబ్నమ్ షేక్

తాజాగా షబ్నమ్ షేక్ చేపడుకున్న సైకిల్ యాత్ర మధ్యప్రదేశ్​లోని బడ్వానీ జిల్లాకు చేరుకుంది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ షబ్నమ్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించింది. 'నేను నా స్నేహితుడితో కలిసి సైకిల్ యాత్ర ప్రారంభించా. నేను ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమానిని. మరోసారి ఆయనే ప్రధాని పీఠాన్ని అధిరోహించాలని కోరుకుంటున్నా. అందుకోసమే ముంబయి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు సైకిల్ యాత్ర చేపడుతున్నా.' అని షబ్నమ్ షేక్ తెలిపింది.

PM Modi Fan Cycle Yatra
షబ్నమ్ షేక్ సైకిల్ యాత్ర

'జై శ్రీరామ్' అంటూ నినాదాలు
'జై శ్రీరామ్', 'హర్ హర్ మహాదేవ్' అని నినాదాలు చేస్తూ షబ్నమ్ సైకిల్ యాత్ర చేస్తోంది. తాను భారతీయ సనాతన ముస్లిం అమ్మాయినని చెబుతోంది. ప్రధాని మోదీ లక్షణాల గురించి చెబిచే ఒక సిరీస్ తయారువుతుందని అంటోంది. తాను అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్లినప్పుడు తనకు చాలా గౌరవం లభించిందని పేర్కొంది.

PM Modi Fan Cycle Yatra
సైకిల్ తొక్కుతున్న షబ్నమ్ షేక్

అయోధ్యకు పాదయాత్ర
అంతకుముందు హిందూ- ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా, మతసామరస్యాన్ని ప్రోత్సహించే విధంగా ముంబయి నుంచి అయోధ్యకు పాదయాత్ర చేపట్టింది షబ్నమ్​ షేక్. రాముడి జెండాలు చేతబట్టి 1400 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు కాలి నడకనే వెళ్లింది. మధ్యమధ్యలో విరామం తీసుకుంటూ రోజుకు 60 కిలోమీటర్లు నడిచింది షబ్నమ్​.

9లక్షలు 9వేల సార్లు మోదీ పేరు రాసిన పెద్దాయన- కారణం స్వార్థమేనట!

మంచుపై సైకిల్ యాత్ర- 9వేల అడుగుల ఎత్తులో ఉన్న ఆలయంలో పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.