ETV Bharat / bharat

'జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదం చివరి శ్వాస తీసుకుంటోంది- ప్రజల ఫ్యూచర్​ డిసైడ్​ చేసేది ఈ ఎన్నికలే!' : ప్రధాని మోదీ - PM Narendra Modi Comments - PM NARENDRA MODI COMMENTS

PM Modi Comments : జమ్ముకశ్మీర్ ఉగ్రవాదం, వారసత్వ రాజకీయాలపై ప్రధాని మోదీ కీలక సంచలన చేశారు. జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదం చివరి శ్వాస తీసుకుంటోందని అన్నారు. పరివారవాద రాజకీయాలు ఈ ప్రాంత అభివృద్ధిని దెబ్బతీశాయని మండిపడ్డారు.

PM Modi Jammu And Kashmir Visit
PM Modi Jammu And Kashmir Visit (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2024, 4:24 PM IST

Updated : Sep 14, 2024, 5:09 PM IST

PM Modi Comments : జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదం చివరి శ్వాస తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్ లాంటి అందమైన ప్రాంతాన్ని వారసత్వ రాజకీయాలు దెబ్బతీశాయని విమర్శించారు. అందుకే పరివారవాదుల రాజకీయాలను ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించిందని తెలిపారు. జమ్ముకశ్మీర్​లో అప్రకటిత కర్ఫ్యూలు ఉండవని, ఆ రోజులు ముగిశాయని చెప్పుకొచ్చారు. జమ్ముకశ్మీర్​లోని దోడా జిల్లాలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని మోదీ శనివారం ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారసత్వ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

'జమ్ముకశ్మీర్ విదేశీ శక్తులకు లక్ష్యంగా మారింది'
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జమ్ముకశ్మీర్ విదేశీ శక్తుల లక్ష్యంగా మారిందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత పరివారవాదులు ఈ ప్రాంతాన్ని వంచన చేయడం ప్రారంభించారని విమర్శించారు. గతంలో జమ్ముకశ్మీర్​లో పరివారవాదులు త‌మ పిల్ల‌ల‌ను ప్రొజెక్ట్ చేసి కొత్త నాయకత్వాన్ని ఎదగనివ్వలేదని ఆరోపించారు. అందుకే తాము కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే యువ నాయకత్వాన్ని ఏర్పాటు చేయడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.

"త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు జమ్ముకశ్మీర్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు విశ్వసించిన రాజకీయ పార్టీలు మీ పిల్లల భవిష్యత్తును పట్టించుకోలేదు. వారు వారి వారసుల భవిష్యత్తుపైనే దృష్టి పెట్టాయి. జమ్ముకశ్మీర్ యువత ఉగ్రవాదంతో బాధపడింది. ఈ వారసత్వ పార్టీలు మిమ్మల్ని తప్పుదోవ పట్టించి, వేడుక చూశాయి. జమ్ముకశ్మీర్ ప్రస్తుతం రాళ్లదాడులు లేవు. గతంలో ఉగ్రమూకలు విసిరిన రాళ్లు కొత్త జమ్ముకశ్మీర్​ను సృష్టించడానికి ఉపయోగించాం." అని నరేంద్ర మోదీ వెల్లడించారు.

'ఆ రోజులు ముగిశాయి'
"దాదాపు 2000 సంవత్సరం నుంచి జమ్ముకశ్మీర్ లో పంచాయతీ ఎన్నికలు జరగలేదు. కొత్త నేతలకు అవకాశం రాలేదు. అందుకే కొత్త నాయకత్వాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ప్రయత్నించాను. తర్వాత వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామ్యాన్ని క్షేత్రస్థాయికి చేర్చడమే ఈ ఎన్నికల అసలు లక్ష్యం. జమ్ముకశ్మీర్ లో అప్రకటిత కర్ఫ్యూలు గతంలో ఉండేవి. లాల్‌ చౌక్‌ వద్దకు వెళ్లాలంటే భయపడేవారు ప్రజలు. కాంగ్రెస్ హయాంలో కేంద్రంలో హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా అక్కడకు వెళ్లలేని పరిస్థితి. ఆ రోజులు ముగిశాయి." అని ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యానించారు.

'ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కేంద్రం విఫలం'
మరోవైపు, జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద దాడులను అంతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడో ప్రమాణ స్వీకారం చేసిన 98 రోజుల్లో జమ్ముకశ్మీర్‌ లో 25 ఉగ్రదాడులు జరిగాయని తెలిపింది. ఈ దాడుల్లో 21 మంది భద్రతా సిబ్బంది, 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని శ్రీనగర్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే వ్యాఖ్యానించారు. మరో 47 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. 2019 నుంచి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన సైనికులకు ప్రధాని మోదీ నివాళులర్పించడం లేదని ఆరోపించారు.

ఎన్నికల వేళ జమ్ముకశ్మీర్​లో ఉగ్ర కలకలం- ఒకేరోజు రెండు ఎన్​కౌంటర్లు- ఇద్దరు టెర్రరిస్టులు హతం - Jammu kashmir Encounter

'ప్రజలను ఐక్యం చేసేందుకే వచ్చా'- జైలు నుంచి బయటకు ఇంజినీర్ రషీద్‌ - MP Engineer Rashid

Last Updated : Sep 14, 2024, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.