ETV Bharat / bharat

'కొవిడ్, యుద్ధాల ప్రభావం ఉన్నా దేశంలో ధరలు పెరగలేదు'- రాష్ట్రపతి ప్రసంగం - parliament budget session live

Parliament Budget Session 2024
Parliament Budget Session 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 9:31 AM IST

Updated : Jan 31, 2024, 1:24 PM IST

13:21 January 31

కొత్త సభ్యుల ప్రమాణం
రాజ్యసభకు ఎన్నికైన సాత్నం సింగ్ సంధు, నరైన్ దాస్ గుప్తా, స్వాతి మలివాల్​తో రాజ్యసభ ఛైర్మన్ జగ్​దీప్ ధన్​ఖడ్ ప్రమాణం చేయించారు.

13:18 January 31

లోక్​సభ వాయిదా
రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంటు గురువారానికి వాయిదా పడింది. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ గురువారం ఓట్‌ అన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

12:26 January 31

  • సికిల్‌ సెల్‌, ఎనీమియాతో బాధపడుతున్న గిరిజనుల కోసం జాతీయ మిషన్‌: రాష్ట్రపతి
  • జాతీయ మిషన్‌ కింద ఇప్పటివరకు 1.40 కోట్ల మందికి పరీక్షలు చేయించాం: రాష్ట్రపతి
  • ఇంజినీరింగ్, మెడిసిన్‌ కూడా మాతృభాషల్లో చదివే అవకాశం కల్పించాం: రాష్ట్రపతి
  • వైద్య కళాశాలల సంఖ్యను గణనీయంగా పెంచాం: రాష్ట్రపతి

12:00 January 31

  • కరోనా, యుద్ధాలు ప్రభావం దేశంలో ధరల పెరుగుదలపై పడకుండా జాగ్రత్త పడ్డాం: రాష్ట్రపతి
  • రష్యా-ఉక్రెయిన్‌, పాలస్తీనా-ఇజ్రాయెల్‌ యుద్ధాల వేళా ద్రవ్యోల్బణాన్ని అదుపుచేశాం: రాష్ట్రపతి
  • ఎన్నో సమస్యలున్నా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతున్నాం: రాష్ట్రపతి
  • ఆవాస్‌ యోజన పథకం ద్వారా సామాన్యులకు నీడ కల్పిస్తున్నాం: రాష్ట్రపతి
  • దేశ అభివృద్ధి నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉంది: రాష్ట్రపతి
  • యువశక్తి, నారీశక్తి, రైతులు, పేదలు అనే స్తంభాలపై ఆధారపడి ఉంది: రాష్ట్రపతి
  • గ్రీన్‌ మొబిలిటీని ప్రోత్సహిస్తున్నాం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
  • సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉన్నాం: రాష్ట్రపతి

11:36 January 31

  • రూ.4 లక్షల కోట్లు వెచ్చించి దేశమంతా తాగునీటి వసతి కల్పిస్తున్నాం: రాష్ట్రపతి
  • ఉజ్వల కనెక్షన్లు పది కోట్లు దాటాయి: రాష్ట్రపతి
  • కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ అందించాం: రాష్ట్రపతి
  • ఆత్మనిర్భర భారత్‌, మేకిన్‌ ఇండియా మన బలాలుగా మారాయి: రాష్ట్రపతి
  • రూ.7 లక్షల ఆదాయం వరకు పన్ను లేకుండా చేశాం: రాష్ట్రపతి
  • సామాన్యులకు భారం పడకుండా పన్ను సంస్కరణలు తీసుకొచ్చాం: రాష్ట్రపతి
  • 2 కోట్లమంది మహిళలు స్వయంసమృద్ధి సాధించారు: రాష్ట్రపతి
  • 4.10 కోట్ల మందికి పక్కా ఇళ్లు నిర్మించాం: రాష్ట్రపతి

11:25 January 31

  • నారీశక్తి వందన్‌ అధినీయం చట్టం ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయింపు: రాష్ట్రపతి
  • పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్‌ ముందుకెళ్తోంది: రాష్ట్రపతి
  • తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేశాం: రాష్ట్రపతి
  • అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని ఆటంకాలు అధిగమించాం: రాష్ట్రపతి
  • ఎన్నో ఏళ్ల భారతీయుల కల రామమందిర నిర్మాణం సాకారమైంది: రాష్ట్రపతి
  • దేశంలో 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోంది: రాష్ట్రపతి
  • దేశంలో కొత్త క్రిమినల్‌ చట్టాన్ని తీసుకొచ్చాం: రాష్ట్రపతి
  • ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌తో ముందుకెళ్తున్నాం: రాష్ట్రపతి
  • రక్షణరంగం, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి: రాష్ట్రపతి

11:13 January 31

పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

  • కొత్త పార్లమెంటులో నా తొలి ప్రసంగం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
  • భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైంది: రాష్ట్రపతి
  • శాంతినికేతన్‌ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది: రాష్ట్రపతి
  • భగవాన్‌ బిర్సాముండా జన్మదినాన్ని జన్‌ జాతీయ దివస్‌గా జరుపుకొంటున్నాం: రాష్ట్రపతి
  • ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణం: రాష్ట్రపతి
  • చంద్రుడి దక్షిణధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్‌ రికార్డు: రాష్ట్రపతి
  • ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను భారత్‌ దిగ్విజయంగా ప్రయోగించింది: రాష్ట్రపతి
  • భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్‌-1 ప్రవేశించింది: రాష్ట్రపతి
  • జీ20 సమావేశాలను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది: రాష్ట్రపతి
  • ఆసియా క్రీడల్లో భారత్‌ తొలిసారిగా 107 పతకాలు సాధించింది: రాష్ట్రపతి
  • ఆసియా పారా క్రీడల్లో భారత్‌ 111 పతకాలు సాధించింది: రాష్ట్రపతి
  • భారత్‌లో తొలిసారిగా నమోభారత్‌ రైలును ఆవిష్కరించాం: రాష్ట్రపతి

11:07 January 31

  • పార్లమెంటుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
  • రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్వాగతం పలికిన ఉపరాష్ట్రపతి, ప్రధాని

11:03 January 31

  • ఈ లోక్‌సభ చివరి సమావేశాలు సజావుగా జరగాలి: ప్రధాని
  • పార్లమెంటులో చర్చలకు ప్రతిపక్షాలు సహకరించాలి: ప్రధాని
  • సమావేశాలను అడ్డుకునే వారిని ప్రజలు క్షమించరు: ప్రధాని
  • నిర్మాణాత్మక విమర్శలను స్వీకరిస్తాం: ప్రధాని మోదీ
  • భారత్‌ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది: ప్రధాని మోదీ
  • జనవరి 26న కర్తవ్యపథ్‌లో నారీశక్తి ఇనుమడించింది: ప్రధాని
  • శాంతి పరిరక్షణలో నారీశక్తి కీలకంగా మారింది: ప్రధాని
  • నారీశక్తిని కేంద్రం ప్రతిబింబిస్తుంది: ప్రధాని మోదీ

10:34 January 31

  • శాంతి పరిరక్షణలో నారీశక్తి కీలకంగా మారింది: మోదీ

  • జనవరి 26న కర్తవ్యపథ్‌లో నారీశక్తి ఇనుమడించింది: ప్రధాని మోదీ
  • చివరి సమావేశాలు సజావుగా జరిగేలా సభ్యులు సహకరించాలి: ప్రధాని

10:21 January 31

  • కాసేపట్లో పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం
  • కొత్త పార్లమెంటు భవనంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం
  • ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్న పార్లమెంటు సమావేశాలు
  • ప్రస్తుత లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు
  • పార్లమెంటులో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
  • రేపు(గురువారం) తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్రం
  • గత సమావేశాల్లో ఘటన దృష్ట్యా పార్లమెంట్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత
  • పార్లమెంట్ పరిసరాల్లో సీఐఎస్‌ఎఫ్‌ బలగాల మోహరింపు, తనిఖీలు

09:22 January 31

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Parliament Budget Session 2024 : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభంకానున్నాయి. ప్రస్తుత 17వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 9వ తేదీతో ఈ సమావేశాలు ముగుస్తాయి. రాష్ట్రపతి ప్రసంగం, ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమర్పణ, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రధాని నరేంద్ర మోదీ సమాధానంతో ఈ సమావేశాలు ముగియనున్నాయి.

ఏప్రిల్‌-మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అలాగే రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ముకశ్మీర్‌ వార్షిక పద్దును కూడా సభ ముందుకు తీసుకురానున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికారం చేపట్టే ప్రభుత్వం జులైలో మళ్లీ పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది.

ప్రభుత్వానికి ప్రత్యేక అజెండా లేదని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి పేర్కొనగా, ప్రతిపక్షాలు మాత్రం పలు అంశాలను లేవనెత్తనున్నట్లు తెలిపాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిరుద్యోగం, భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం, వ్యవసాయ సంక్షోభం, మణిపుర్‌ మారణకాండ తదితర అంశాలను ప్రస్తావించనున్నట్లు కాంగ్రెస్‌ తెలిపింది. ఇతర పార్టీలు కూడా వివిధ అంశాలను ప్రస్తావించగా స్వల్పకాలంపాటు జరిగే ఈ సమావేశాల్లో వీలైనంత వరకు ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి తెలిపారు. ప్రతిపక్షాలు అనేక సూచనలు చేశాయని, ప్రస్తుత లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలని తెలిపారు. అందువల్ల వచ్చే సమావేశాల్లో అవకాశం కల్పిస్తామని ప్రతిపక్షాలకు సూచించినట్లు ప్రహ్లాద్‌ జోషి చెప్పారు.

Last Updated : Jan 31, 2024, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.